Jhansi lakshmibayi
-
లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?
బాలీవుడ్ మాఫియా గురించి మాట్లాడటం, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కు నేరుగా ఓ వీడియో మెసేజ్‌లో మాటల యుద్ధం చేయడం వంటివి చేస్తూ కొన్ని రోజులుగా నేషనల్ టాపిక్‌గా మారారు కంగనా రనౌత్. అయితే ఆమెను సమర్థించేవాళ్లు, పొగిడేవాళ్లతో పాటు విమర్శించేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కంగనాను భగత్‌సింగ్‌తో పోల్చారు తమిళ హీరో విశాల్. కొంతమంది ఆమె ధైర్యాన్ని ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చుతున్నారు. ఈ విషయంలో కంగనా మీద ఓ సెటైర్ వేశారు ప్రకాశ్ రాజ్. ‘ఒక్క సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషిస్తే నిజంగా ఝాన్సీ లక్ష్మీ భాయ్ అయిపోతారా? అలా అయితే దీపికా పదుకోన్ రాణీ పద్మావతి, హృతిక్ రోషన్ అక్బర్, ఆమిర్ ఖాన్ మంగల్ పాండే, అజయ్ దేవగన్ భగత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ మోదీజీ అయిపోవాలి’ అనే అర్థం వచ్చేట్లు ట్వీటర్లో ఈ తారలు చేసిన ఆ పాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు ప్రకా‹శ్ రాజ్. -
కోట్లాది గుండెల్లో ప్రేరణ జ్యోతి ఆమె!
ఝూన్సీ లక్ష్మిబాయ్. ఈ పేరు పౌరుషానికి మరో పేరు. సాహసానికి మారు పేరు. దేశభక్తికి, పరాక్రమానికి నిలువెత్తు రూపం ఆమె. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీర వనిత ఝూన్సీలక్ష్మిబాయ్. బ్రిటీష్‌వారితో జరిగిన భీకరపోరులో వెన్నుచూపని వీరనారి ఆమె. 1857 మహాసంగ్రామంలో ఎంతో వీరోచితంగా పోరాడి నేటికీ ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్న లక్ష్మిబాయ్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. -
ఝాన్సీలక్ష్మీబాయి అడుగు జాడల్లో నడవాలి
ఆదిలాబాద్ టౌన్ : విద్యార్థినులు వీరవనిత ఝాన్సీలక్ష్మీబాయి చూపినబాటలో నడవాల ని ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ మనోజ్‌పవార్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో ఝాన్సీలక్ష్మీబాయి జయంతి వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళలకు స్వేచ్ఛలేని కాలంలో మహిళ శక్తిగా ఎదిగారని అన్నారు. ఆమె జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిని గడగడలాడించారని తలెఇపారు. ఝాన్సీలక్ష్మీ జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు నిఖిల్, ప్రమోద్, కర్ణ, వినోద్, తదితరులు పాల్గొన్నారు.