ఝాన్సీలక్ష్మీబాయి అడుగు జాడల్లో నడవాలి
ఆదిలాబాద్ టౌన్ : విద్యార్థినులు వీరవనిత ఝాన్సీలక్ష్మీబాయి చూపినబాటలో నడవాల ని ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ మనోజ్‌పవార్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో ఝాన్సీలక్ష్మీబాయి జయంతి వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళలకు స్వేచ్ఛలేని కాలంలో మహిళ శక్తిగా ఎదిగారని అన్నారు. ఆమె జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిని గడగడలాడించారని తలెఇపారు. ఝాన్సీలక్ష్మీ జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు నిఖిల్, ప్రమోద్, కర్ణ, వినోద్, తదితరులు పాల్గొన్నారు.