ట్వీటర్‌లో ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఫొటో
బాలీవుడ్ మాఫియా గురించి మాట్లాడటం, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కు నేరుగా ఓ వీడియో మెసేజ్‌లో మాటల యుద్ధం చేయడం వంటివి చేస్తూ కొన్ని రోజులుగా నేషనల్ టాపిక్‌గా మారారు కంగనా రనౌత్. అయితే ఆమెను సమర్థించేవాళ్లు, పొగిడేవాళ్లతో పాటు విమర్శించేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కంగనాను భగత్‌సింగ్‌తో పోల్చారు తమిళ హీరో విశాల్. కొంతమంది ఆమె ధైర్యాన్ని ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చుతున్నారు.
ఈ విషయంలో కంగనా మీద ఓ సెటైర్ వేశారు ప్రకాశ్ రాజ్. ‘ఒక్క సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషిస్తే నిజంగా ఝాన్సీ లక్ష్మీ భాయ్ అయిపోతారా? అలా అయితే దీపికా పదుకోన్ రాణీ పద్మావతి, హృతిక్ రోషన్ అక్బర్, ఆమిర్ ఖాన్ మంగల్ పాండే, అజయ్ దేవగన్ భగత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ మోదీజీ అయిపోవాలి’ అనే అర్థం వచ్చేట్లు ట్వీటర్‌లో ఈ తారలు చేసిన ఆ పాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు ప్రకా‹శ్ రాజ్.
Comments
Please login to add a commentAdd a comment