Setairs
-
లోకేష్ పై కేశినేని సెటైర్లు
-
బాబుపై జెసి ప్రభాకర్ సెటైర్లు
-
పురందేశ్వరిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లపై సెటైర్లు
-
చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు..
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఇంగ్లిషు మీడియం చదువులు.. బాబు హయాంలో ఉన్నాయా? పేద పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తే.. ప్రశ్నిస్తారనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన ‘విద్యాదీవెన నగదు జమ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు. అప్పుడు.. ఇప్పుడు తేడా చూడండి... ‘‘గత ప్రభుత్వంలో జగనన్న ‘అమ్మ ఒడి’ అనే పథకం ఎక్కడైనా ఉందా?. ఈ రాష్ట్రంలో ఏనాడైనా, ఎక్కడైనా ఇలా ఉందా?. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడులాంటి కార్యక్రమం గతంలో ఉందా?. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమం ఏనాడైనా జరిగిందా?. ప్రభుత్వ బడులు మూసేసి, చదువుల భారాన్ని దించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించలేదా?. ఆ రోజుకూ, ఈ రోజు కూ తేడాలు చూడండి. పేదల పిల్లలు చదువులు ఎందుకు మానేస్తున్నారని ఎప్పుడైనా గతంలో ఆలోచించారా యూనిఫారం, షూలు, సాక్సులు, తెలుగు-ఇంగ్లిషుల్లో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగ్.. ఇలాంటివన్నీ జగనన్న విద్యాకానుక మాదిరిగా ఎప్పుడైనా గతంలో ఇచ్చారా?. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ఇచ్చారా? స్కూలు తెరిచిన ఆరేడు నెలలు తర్వాత టెక్ట్స్‌బుక్స్ ఇచ్చేవారంటూ’’ సీఎం మండిపడ్డారు. అందుకే దొంగల ముఠాకు కడుపుమంట.. ‘‘ఇంత మంచి జరిగింది కాబట్టే.... దొంగల ముఠాకు కడుపుమంట, బీపీ పెరుగుతూ ఉంది. పథకాలు మరిచిపోవాలని పేపర్, టీవీలు చూస్తే చాలు... అబద్ధాల మీద అబద్ధాలు చూపిస్తున్నారు. విద్యాదీవెన పథకం కింద ఇక్కడ ప్రారంభిస్తామని తెలిసి... ప్రశ్నపత్రాలను వారి హయాంలో మంత్రిగా పని చేసిన వారి స్కూళ్లనుంచే ప్రశ్నపత్రాలు ఫొటోలు తీసి... వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వారే నాశనం చేస్తారు, వారే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. మనం వచ్చాక 1.3లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ రోజు కూడా పేపర్ లీక్ అంటూ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా నానా యాగీ చేశారని’ సీఎం నిప్పులు చెరిగారు. వీళ్లే చేస్తారు, మళ్లీ వీళ్లే ప్రచారం చేస్తారు.. ‘‘మహిళలు తమ కష్టాలు చెప్పుకునే వ్యవస్థ ఉంది కాబట్టి, కేసుల నమోదు కూడా పెరిగింది. విజయవాడలో అత్యాచారం జరిగిందని నానా యాగీ చేశారు. గుంటూరులో ఏదేదో జరిగిపోయిందని యాగీ చేశారు. విశాఖలో ఏదేదో జరిగిపోతుందని మరో యాగీ కూడా చూశారు. బాలికలు మీద, మహిళల మీద అత్యాచారం రాసిన దుర్మార్గులు ఎవరు?అన్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ–5 చూపదు. ఈ ఘటనల్లో నిందితులు టీడీపీ వారే. వీళ్లే చేస్తారు, మళ్లీ వీళ్లే ప్రచారం చేస్తారు. ఏడుకొండల వాడిని కోరగలిగేది ఒక్కటే..దేవుడా మా రాష్ట్రాన్నిరక్షించు ఈ ఎల్లోమీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాలుకలు సాచి, బుసలు కొట్టే కృపా సర్పాలనుంచి, ధూర్తుల నుంచి, దుష్టచతుష్టయం నుంచి, రక్షించు దేవా అని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానని’’ సీఎం అన్నారు. -
లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?
బాలీవుడ్ మాఫియా గురించి మాట్లాడటం, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కు నేరుగా ఓ వీడియో మెసేజ్‌లో మాటల యుద్ధం చేయడం వంటివి చేస్తూ కొన్ని రోజులుగా నేషనల్ టాపిక్‌గా మారారు కంగనా రనౌత్. అయితే ఆమెను సమర్థించేవాళ్లు, పొగిడేవాళ్లతో పాటు విమర్శించేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కంగనాను భగత్‌సింగ్‌తో పోల్చారు తమిళ హీరో విశాల్. కొంతమంది ఆమె ధైర్యాన్ని ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చుతున్నారు. ఈ విషయంలో కంగనా మీద ఓ సెటైర్ వేశారు ప్రకాశ్ రాజ్. ‘ఒక్క సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషిస్తే నిజంగా ఝాన్సీ లక్ష్మీ భాయ్ అయిపోతారా? అలా అయితే దీపికా పదుకోన్ రాణీ పద్మావతి, హృతిక్ రోషన్ అక్బర్, ఆమిర్ ఖాన్ మంగల్ పాండే, అజయ్ దేవగన్ భగత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ మోదీజీ అయిపోవాలి’ అనే అర్థం వచ్చేట్లు ట్వీటర్లో ఈ తారలు చేసిన ఆ పాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు ప్రకా‹శ్ రాజ్. -
చంద్రబాబుపై నెటిజన్ల సెటైర్లు..
-
లోకేశ్ ఆస్తి లెక్కలపై జోకులు
-
మా బుజ్జిగాడే నా సైన్యం!
మా దైవసమానుడి దైన్యం.. పొగడ్తలతో ముంచేసి అగడ్తల్లోకి దించేయడం ఈ పురుషపుంగవులు ఎప్పుడూ చేసే పనే. అవ్వాళ్ల ఒళ్లునొప్పులూ, జ్వరం అంటూ ఆఫీసుకు లీవు పెట్టారాయన. ‘‘నీలో లక్ష్మీకళ పూర్తిగా తాండవిస్తోందోయ్. అబ్బ... జ్వరం, ఒళ్లునొప్పులూ తెగ బాధిస్తున్నాయ్! నేను విష్ణుమూర్తిని కాకపోయినా.. లక్ష్మీదేవిలాంటి నీ భర్తనే కదా. కాబట్టి నొప్పులు తగ్గడానికి వైద్యంగా, కాసేపు కాళ్లు నొక్కవోయ్’’ అంటూ రిక్వెస్ట్ చేశారు. బాధ పడే వ్యక్తికి అవసరమైన చికిత్సగా కాసేపు కాళ్లు పట్టాను. అంతే... ఆ సిచ్యువేషన్‌ను అడ్వాంటేజీగా తీసుకొని వెంటనే ఆయన ఓ సైడుకు తిరిగిపోతూ... ‘‘ఇప్పుడు అచ్చం నేను విష్ణుమూర్తిలా లేనూ’’ అంటూ ముసిముసిగా నవ్వుతూ మా బుజ్జిగాడితో, నాతో ఏకకాలంలో పరాచికాలు మొదలుపెట్టారు. సెటైర్లు వేయడంలో ఇప్పుడిప్పుడే మా బుజ్జిగాడూ నాలా తయారవుతున్నాడు. ‘‘అవున్నాన్నా... అలంకార్ సెంటర్ దగ్గర పాములు ఆడించేవాడు ఉంటాడు చూశావా? వాణ్ణి రిక్వెస్ట్ చేసి కాసేపు నాగుపామును అద్దెకు తెచ్చి మీ హెడ్డు కవర్ అయ్యేలా సరిగ్గా మీ తల దగ్గర దాన్ని వదులుతా. దాంతో ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్రకు నిండుదనం వస్తుంది’’ అన్నాడు. అంతే! ఆ మాటల్లోని మర్మం అర్థమై... ఒళ్లు నొప్పుల మాట మరచిపోయి సెలవు క్యాన్సిల్ చేసుకుని మరీ ఆఫీసుకు బయల్దేరారాయన. మరోరోజు మసాలా వంకాయ ఫ్రై చాలా బాగా కుదిరింది. ముగ్గురం తినడానికి సరిపోయినంత వండినా... ఆరోజు ఆయన నాలుకకు అది బాగా రుచిగా అనిపించడంతో ముందువెనకా చూసుకోకుండా మొత్తం తినేశారు. అందుకు మాకేమీ బాధ లేదు గానీ... తను చేసిన పనిని కప్పిపుచ్చుకోడానికో, తన గిల్టీ ఫీలింగ్‌ను కవర్ చేసుకోడానికో మళ్లీ ఓ డైలాగ్ వదిలారాయన. ‘‘ఒరేయ్... మీ అమ్మ సాక్షాత్తూ పార్వతీ మాతరా. అంటే నాలో సగం అన్నమాట. కాబట్టి నేను తిన్నదాంట్లో సగం ఆటోమేటిగ్గా ఆమెకే అంకితమవుతుంది కదరా. అందుకే అమ్మకు కూర మిగల్లేదని బాధపడకు’’ అంటూ ఓదార్చబోయారు. ఆ మాటతో మళ్లీ మా బుజ్జిగాడికి ఒళ్లు మండిపోయింది. ‘‘అవున్నాన్నా. నేను చెప్పానుగా... అలంకార్ సెంటర్లో పాములాడించే వాడు ఉంటాడని. ఈసారి పామును తెచ్చి నీ తల దగ్గర కాకుండా, నీ మెడకు చుడదాం’’ అన్నాడు వాడు కసిగా. ‘‘చూశావోయ్... నీ పెంపకంలో వీడు పూర్తిగా అమ్మ కూచి అయిపోయాడు. ఎప్పుడూ నీ పార్టీనే. ఇవ్వాళ్ల అన్నీ నీ తరఫున మాట్లాడుతున్నాడని సంతోషపడుతున్నావేమో? ఇలాంటి వాళ్లే రేపు పెళ్లాల చేత మరపు మందు అడిగి మరీ పెట్టించుకుని, వాళ్ల భార్యలకు సపోర్టు చేస్తూ ఉంటారు. రేపు వాడి పెళ్లాం వచ్చాక వాడు ఆమెనే సమర్థిస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు... ప్రస్తుతం నేను పడుతున్న బాధ’’ అన్నారు ఆయన ఉక్రోషంగా. అప్పుడు అన్నాన్నేను ఒక మాట... ‘‘పోన్లెండి, ఇప్పుడు నేను అనుభవించే బాధలేవీ వాడి పెళ్లాం పడదన్నమాట. ఆ ఊహే నాకు ఆనందంగా ఉంది. అలా ప్రవర్తించే మన బుజ్జిగాడి మంచితనాన్ని పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలన్న తన స్వార్థంతోనైనా తను మన అబ్బాయిని బాగా చూసుకుంటుంది. ఈ ఆలోచనే నన్నెంతగానో సంతోషపెడుతోంది’’ అన్నాను. అంతే... ‘హు’ అంటూ తన అసహనాన్ని ప్రకటిస్తూ, పెండింగ్ వర్క్ అనే సాకుతో వెంటనే బయల్దేరారు మరోమారు ఆఫీసుకు! - వై!