jilani
-
నా ప్రభువే కాపాడాడు
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ‘అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్ధం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’ అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, ‘హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికి సాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?’ అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’శాపగ్రస్తుడా..దుర్మార్గుడా..దూరంగా పారిపో..’ అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్ మరోపాచిక విసురుతూ..‘జీలానీ . నిన్ను నీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ‘కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు.. నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది.దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు. మాసం మహాత్మ్యం పుణ్యఫలాలనిచ్చే పుష్యం: పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం. పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి బుద్ధి కారకుడు కావడం వల్ల ఈ మాసం బృహస్పతికీ, శనికీ అత్యంత ప్రీతికరమైనది. శనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చే నూనె. కాబట్టి ఈ మాసంలో నువ్వులు, నువ్వులనూనెతో ఆయనను అభిషేకించి, పూజించాలని, నువ్వులు దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్రవచనం. అలాగే ఇది మంచు కప్పబడి ఉండే మాసం కాబట్టి పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైలగ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ నువ్వులనూనె ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేయడం. అలాగే సంక్రాంతి పిండి వంటలన్నిటిలో నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. ఇక ఈ మాసం శూన్యమాసం అని ఆందరూ ఆడిపోసుకుంటారు కానీ, అత్యుత్తమమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదీ, రైతులు పండుగగా, పితృదేవతల పండగగా చెప్పుకునే సంక్రాంతి పండగ వచ్చేది కూడా ఈ మాసంలోనే కాబట్టి చిన్న చూపు తగదు. -
స్టోరేజ్ ట్యాంకులో పడి విద్యార్థుల గల్లంతు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని బత్తలాపురం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుమలనగర్‌కు చెందిన సాబిర్(13), శివశంకరనగర్‌కు చెందిన జిలాని(14) మరో ముగ్గురు స్నేహితులు శుక్రవారం సాయంత్రం ఈతకొట్టేందుకు వెళ్లారు. సాబిర్, జిలాని ఇద్దరూ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు. గట్టున చూస్తున్న మిగిలిన ముగ్గురు పిల్లలు భయంతో పారిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. సాబిర్, జిలాని రాత్రి ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అర్థరాత్రి తరువాత పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ హడావుడి చూసిన మిగిలిన పిల్లలు భయంతో అసలు విషయం చెప్పారు. శనివారం ఉదయం పోలీసులు, కుటుంబసభ్యులు సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్దకు వెళ్లి పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వారి ఆచూకి ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటిలో మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు మున్సిపల్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. -
రౌడీ రాజకీయం!
శుక్రవారం.. అది శ్రీకాకుళంలోని ప్రసిద్ధ జామియా మసీదు ప్రాంగణం.. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అదే సమయంలో అదే మతానికి చెందిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ప్రార్థనల పవిత్రతను సైతం పట్టించుకోకపోగా సాక్షాత్తు మతపెద్దలనే అడ్డుకొని ప్రార్థనకు భంగం కలిగించాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఒక యువకుడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. మసీదు కమిటీకి తమ వారినే ఎన్నుకోవాలన్నది ఆయన పంతం. అందుకే ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారైన, నేర చరిత్ర కలిగిన సదరు వ్యక్తి మరో రాజకీయ పార్టీకి చెందిన యువకుడిపై దాడికి తెగబడ్డాడు.మసీదు పవిత్రతను మంట గలిపాడు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పట్టణంలోని 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జామియా మసీదులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా జిలానీ అనే వ్యక్తి అక్కడికి వచ్చి మత పెద్దపైనా, మరో యువకుడిపైనా దౌర్జన్యానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదంతా మసీదు కమిటీ ఎన్నిక నేపథ్యంలో జరిగిందని కొందరు చెబుతుం డగా, బాధితుడి సోదరుడు మాత్రం తమ సోదరుడు వైఎస్సార్సీపీ చెందిన వ్యక్తి కావడంతోనే టీడీపీ మద్దతుదారుగా ఉంటూ నేరచరిత్ర కలిగిన జిలానీ దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ మహ్మద్ అబ్దుల్ రఫీ అనే వ్యక్తి ఆరోపించారు. ఇదీ నేపథ్యం జిల్లాలోనే ప్రముఖ మసీదుగా పేరుగాంచిన శ్రీకాకుళం జామియా మసీదు పాలక కమిటీ కొన్నాళ్ల క్రితం రద్దయింది. వక్ఫ్ బోర్డు అనుమతితో కొత్త కొత్త కమిటీని నియమించాల్సి ఉంటుంది. మసీదులో రెగ్యులర్‌గా ప్రార్థనలు చేస్తున్న సభ్యుల నుంచే పాలకవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. అయితే తమ వర్గీయులకే మసీదు బాధ్యతలు అప్పగించాలని టీడీపీకి చెందిన జిలానీ అనే వ్యక్తి కొన్నాళ్లగా పట్టుబడుతున్నాడు. తమకు స్థానిక ఎమ్మెల్యే అండదండలున్నాయని మాట వినకపోతే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్టు అబ్దుల్ షాజహాన్, తదితర పెద్దలు వాపోతున్నారు. జిలానీ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని గతంలో అతడు చేసిన దురాగతాలపై పత్రికల్లో వార్తలు వచ్చాయని, బంద్ కూడా జరిగిందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రార్థనల్లో భాగంగా మత పెద్ద మెహతాబ్ ఆలం మౌలానా ప్రార్థన నిర్వహిస్తుండగా జిలానీ వచ్చి అడ్డుకున్నాడని, సుమారు 300 మంది సమక్షంలో అనరాని మాటలన్నాడని ముస్లిం పెద్దలు ఆరోపించారు. ఈ సందర్భంగా గొడవలొద్దన్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పట్టణాధ్యక్షుడు సిరాజుద్దీన్ (30)పై జిలానీ దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఆగ్రహం చెందిన ముస్లిం పెద్దలు జిలానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన సిరాజుద్దీన్‌ను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. అనంతరం ముస్లిం పెద్దలంతా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడ బైఠాయించారు. మసీదు ప్రాంగణంలో కొన్నాళ్ల నుంచి శాంతిభద్రతలు లోపించాయని, జిలానీ వంటి వీధి రౌడీలు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అతనిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. తనను జిలానీ భయపెట్టే ప్రయత్నం చేశాడని మత పెద్ద మౌలానా ఆరోపించారు. ప్రభుత్వం మారిన తరువాతే.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే మసీదులో వర్గపోరు మొదలైందని, నేరచరిత్ర కలిగిన జిలానీ కొన్నాళ్లుగా ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తున్నాడని సిరాజుద్దీన్ సోదరుడు మహ్మద్ అబ్దుల్ రఫీ ఆరోపించారు. ప్రార్థనలు జరుగుతుండగా మరో వ్యక్తి ఫోన్ చేసి జిలానీని రప్పించారని, వచ్చీ రావడంతోనే ప్రార్థనలను అడ్డుకొని కర్రలతో సిరాజుద్దీన్‌పై దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. మసీదు కార్యకలాపాల కు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదని తాము ఎంత కోరుకుంటున్నా కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్సార్సీపీ జిల్లా, రాష్ర్ట పెద్దల దృష్టికి తీసుకువెళ్లామని, పోలీసులకు ఫిర్యాదిచ్చామని రఫీ తెలిపారు. కేసు నమోదు చేశాం:సీఐ మసీదులో జరిగిన ఘటనపై సీఐ తాతారావును వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మసీదు కమిటీ ఎన్నికకు సం బంధించే గొడవలు తలెత్తినట్టు ఓ వర్గం చెబుతోందన్నారు. పార్టీలకు దీనికి సంబంధం లేద ని తమ విచారణలో తేలిందన్నారు. బాధ్యులపై చర్యలు చేపడతామని, భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. సిరాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిలానీతో పాటు అతనికి సహకరించిన కరీముల్లాఖాన్, అన్వర్‌లపై కేసు నమోదు చేశామని తెలిపారు. ‘ముస్లింలంతా శాంతియుతంగా ఉండాలి’ రిమ్స్‌క్యాంపస్: జిల్లాలోని ముస్లింలంతా అందరితో సోదరభావంతో ఉండాలని జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ ప్రదాన కార్యదర్శి మహిబుల్లా ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. జామియా మసీదుకు గతంలో సహాయ కార్యదర్శిగాను, ఉపాధ్యక్షుడిగాను పనిచేశానని పేర్కొన్నారు. తన తరువాత ఈ ఏడాది జూన్ 28వ తేదీ వరకు మాజీ కౌన్సిలర్ రఫీ మసీదుకు అధ్యక్షుడిగా కొనసాగారని, అరుుతే అకౌంటు అప్పజెప్పకపోవటం, వక్ఫ్‌బోర్డు చట్ట ప్రకారం నడపకపోవటం వల్ల రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆయన్ని తప్పించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు వంద మంది ముస్లింలకు రఫీ షెల్టరు ఇచ్చి పోషిస్తున్నారని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చిన ముస్లింల చిరునామాలు, వారితో ఉన్న సం బంధాల గురించి అడిగి తెలుసుకున్నా మన్నారు.