కాంగ్రెస్‌లో ఇక కౌలుదారులు, అద్దెదారులు లేరు
ఏపీసీసీ రాఘువీరారెడ్డి
దేవినేని నెహ్రూకు పశ్చాత్తాపం తప్పదని ఎద్దేవా
విజయవాడ సెంట్రల్ : టీడీపీలోకి వెళ్లినందుకు దేవినేని నెహ్రూ పశ్చాత్తాపపడటం ఖాయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆంధ్రరత్న భవన్‌లోజిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో ఇక కౌలుదారులు, అద్దెదారులు లేరు. ఉన్నవాళ్లంతా సొంతవాళ్లేనని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్‌పార్టీని వీడకముందు దేవినేని నెహ్రూ తనను కలిసి 2018 వరకు పార్టీని వీడనని చెప్పారన్నారు. పార్టీని వీడిన తరువాత కాంగ్రెస్ అద్దె ఇల్లు అని మాట్లాడటం బాధ కలిగించిందన్నారు. నెహ్రూ కౌలుదారుడని తాను గుర్తించలేకపోయామని కౌంటర్ ఇచ్చారు.
కలిసి పనిచేయండి
నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్‌కు నియామకపత్రాన్ని అందించారు. కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి మస్తాన్‌వలీ, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి , ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎన్.ఎస్.రాజా, టీజేఆర్ సుధాకర్ బాబు, గొడుగు రుద్రరాజు, మీసాల రాజేశ్వరరావు, రాజీవ్‌రతన్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు.