journalism Field
-
ట్రంప్ రహస్యాలు చెప్పినందుకు పులిట్జర్
న్యూయార్క్: పాత్రికేయ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు ఈ ఏడాదికి గాను ‘ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్’లను వరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబానికి సంబంధించి ఆస్తుల గురించి వివరాలను ప్రపంచానికి వెల్లడించినందుకు ఈ అవార్డును ప్రకటించారు. అమెరికా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను బోర్డు ప్రకటించింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇద్దరు మహిళలకు ట్రంప్ డబ్బు ఇచ్చారని కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని పార్క్లాండ్లో ఉన్న ఓ పాఠశాలలో 2018 ఫిబ్రవరిలో జరిగిన కాల్పుల ఉదంతంలో స్కూల్ యాజమాన్యం, అధికారుల వైఫల్యంపై కథనాలు ప్రచురించిన సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినెల్ పత్రికను సమాజ సేవ కేటగిరీలో ఈ అవార్డు వరించింది. సినగాగ్‌లో 2018 అక్టోబర్‌లో జరిగిన కాల్పుల ఉదంతాన్ని కవర్ చేసినందుకు బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో పిట్స్బర్గ్ పోస్ట్ గెజిట్‌కు పులిట్జర్ అవార్డు వచ్చింది. -
రోబో జర్నలిస్టు వచ్చేశాడు
బీజింగ్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనేకాదు పాత్రికేయరంగంలోకి రోబో వచ్చేశాడు. చైనాలో రోబో రాసిన 300 పదాల కథనమొకటి ఓ దినపత్రికలో ప్రచురితమైందని బుధవారం పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాసం రాసిన రోబో పేరు జియానో నాన్ అని, అది కేవలం సెకన్లోనే దీన్ని రాసేసిందని పరిశోధన బృందం వెల్లడించింది. ఈ రోబో చిన్న కథనాలు, పెద్ద వార్తలూ రాయగలదట. స్టాఫ్ రిపోర్టర్లతో పోల్చితే దీనికి మెరుగైన సమాచార విశ్లేషణ సామర్థ్యం ఉందని, వేగంగా కథనాలు రాయగలదని బృందం పేర్కొంది. ప్రస్తుతం రోబోలు ముఖాముఖి ఇంటర్వూ్యలు నిర్వహించలేవని, సమయస్ఫూర్తితో ప్రశ్నలు సంధించలేవని బృందం పేర్కొంది. అయితే మీడియాలో కీలకమైన ఎడిటర్లు, రిపోర్టర్లకు సహాయకారులుగా మాత్రం ఉపయోగపడగలవని పేర్కొంది.