JP Infratech
-
జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలకు లోనైన జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకి సురక్షా గ్రూప్‌నకు లైన్ క్లియరైంది. రుణదాతలు, గృహ కొనుగోలుదారుల నుంచి సురక్షా బిడ్‌కు అనుమతి లభించింది. దీంతో ఫ్లాట్లను కొనుగోలు చేసినా సొంతం చేసుకునేందుకు వీలులేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జేపీ ఇన్ఫ్రా వివిధ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టింది. వీటికి సంబంధించి 20,000 మందికిపైగా గృహ కొనుగోలుదారులు ఫ్లాట్ల కోసం వేచిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10 రోజులుగా.. జేపీ ఇన్ఫ్రా టేకోవర్‌కు అటు పీఎస్‌యూ దిగ్గజం ఎన్బీసీసీ, ఇటు సురక్షా గ్రూప్ వేసిన బిడ్స్‌పై 10 రోజులపాటు వోటింగ్ ప్రాసెస్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సురక్షా గ్రూప్ బిడ్‌కు 98.66 శాతం మద్దతు లభించినట్లు తాజాగా రిజల్యూషన్ అధికారి అనుజ్ జైన్ వెల్లడించారు. ఎన్బీసీసీకి 98.54 శాతం వోట్లు లభించినట్లు తెలియజేశారు. వెరసి అతిస్వల్ప మార్జిన్‌తో సురక్షా గ్రూప్ ముందంజ వేసినట్లు వివరించారు. చదవండి : ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
ఇల్లు కొంటే షేర్లు ఫ్రీ!
న్యూఢిల్లీ: తమ వద్ద ఇల్లు కొనుగోలు చేసినవారికి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన 2000 షేర్లను ఉచితంగా ఇస్తామని జేపీ గ్రూప్ ప్రకటించింది. అనేక కారణాలతో చితికిపోయి దివాలా తీసిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను పునరుజ్జీవింపజేసేందుకు జేపీ గ్రూప్ పదివేల కోట్ల రూపాయల ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా షేర్లు ఇచ్చే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. జేపీ అసోసియేట్స్‌కు అనుబంధ సంస్థైన జేపీ ఇన్ఫ్రాటెక్ 2007లో నోయిడాలో 32వేల ఫ్లాట్స్ అభివృద్ధి చేయడం ఆరంభించింది. ఇందులో 9,500 ఫ్లాట్స్‌ను డెలివరీ చేసింది. మరో 4,500 ఫ్లాట్లకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందించేందుకు దరఖాస్తు చేసుకుంది. 2021 నాటికి మిగిలిన ఫ్లాట్స్ డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రుణభారం పెరగడంతో పనులు పూర్తికాలేదు. దీంతో డెలివరీ సమయానికి జరగని వారంతా కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంకు జేపీ ఇన్ఫ్రాటెక్ నుంచి తమ రుణాలు రాబట్టుకునే యత్నాలు ఆరంభించడంతో ఇళ్లు కొన్నవారిలో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఇళ్లు కొన్నవారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు షేర్లు ఇచ్చే ప్రతిపాదనను జేపీ గ్రూప్ తెచ్చింది. ఇందుకోసం 4.5 కోట్ల షేర్లు అవసరపడతాయని అంచనా. కేవలం షేర్లు ఇవ్వడమే కాకుండా ఇళ్ల కొనుగోలుదారులకు రెరా ప్రకారం జరిమానా కూడా చెల్లిస్తామని, ఫస్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో 50 శాతం స్టాంప్ డ్యూటీ భరిస్తామని జేపీ గ్రూప్ పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు హామీగా జేపీ అసోసియేట్స్ రూ. 750 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేసింది. మరోవైపు జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకు సంబంధించి లక్షద్వీప్ గ్రూప్ ఆఫర్ చేసిన రూ. 7,350 కోట్ల బిడ్‌ను రుణదాతలు తిరస్కరించారు. బుధవారం జరిగిన సీఓసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం తమకు సరిపోదని రుణదాతలు బిడ్‌ను తిరస్కరించారు. కంపెనీ కొనుగోలుకు వచ్చిన బిడ్లలో లక్షద్వీప్ బిడ్ ముందంజలో ఉన్నది. కానీ రుణదాతలు ససేమిరా అనడంతో అమ్మకం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే సూచనలు ఉన్నాయి. -
జేపీ ఇన్ఫ్రాకు ప్రమోటర్ల ఆఫర్ రూ.10,000 కోట్లు
న్యూఢిల్లీ: జేపీ ఇన్ఫ్రాటెక్ కంపెనీని దివాలా స్థితి నుంచి బయటపడేసేందుకు ప్రమోటర్ మనోజ్ గౌర్ రూ.10,000 కోట్లతో బ్యాంకు రుణాలు తీర్చివేయడంతోపాటు, నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ముందుకొచ్చారు. రూ.9,800 కోట్ల రుణాల్లో కొంత తీర్చివేయడం, రుణాలిచ్చిన సంస్థలకు ఈక్విటీ వాటా కేటాయించడంతోపాటు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రణాళికలో భాగం. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ ముందు గౌర్ ఈ ప్రణాళికను ఉంచారు. గ్రూపు కంపెనీని కాపాడుకునేందుకు హైడ్రో ఎలక్ట్రిక్, సిమెంట్ ప్రాజెక్టుల్లో మనోజ్గౌర్ తనకున్న వాటాలను ఇప్పటికే విక్రయించిన విషయం తెలిసిందే. అయితే, గౌర్ తాజా ప్రణాళికకు రుణదాతల కమిటీ అంగీకరించినదీ, లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. జేపీ ఇన్ఫ్రా కొనుగోలుకు లక్షద్వీప్ ప్రైవేటు లిమిటెడ్ ఇటీవలే రూ.7,350 కోట్లతో బిడ్ వేసింది. దీంతో పోలిస్తే మనోజ్గౌర్ ఎక్కువ ఆఫర్‌తో ముందుకొచ్చినట్టే. కాగా, దీనిపై రానున్న రెండు రోజుల్లో రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేపీ ఇన్ఫ్రాటెక్ 32,000 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికి కేవలం 9,500 మాత్రమే పూర్తి చేసి స్వాధీనం చేసింది. మరో 4,500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే రూ.6,500 కోట్లు కావాల్సి ఉంటుంది. -
గతవారం బిజినెస్
జేపీ ఫ్లాట్ బయ్యర్స్‌కు సుప్రీం అండ! గృహ కొనుగోలుదారు ప్రయోజనాలే లక్ష్యంగా రియల్టీ దిగ్గజం– జేపీ ఇన్ఫ్రాటెక్ దివాలా ప్రక్రియను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమీక్షించటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. జేపీ ఇన్ఫ్రా నిర్వహణ నియంత్రణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమించిన ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు (ఐఆర్పీ) అప్పగిస్తూ... తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. ధరలు అప్... పరిశ్రమలు డౌన్ 2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. మరోవైపు ఆగస్టు నెల్లో రిటైల్ ధరల స్పీడ్ 3.36 శాతంగా నమోదయింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక రిటైల్ ధరల తరహాలోనే టోకు ధరలు కూడా ఆగస్టులో తీవ్ర స్థాయికి పెరిగాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.24 శాతం పెరిగింది. ఎగుమతులు బాగున్నా... భారంగా లోటు భారత్ ఎగుమతుల వృద్ధి ఆగస్టులో 10.29 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయి వృద్ధి రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ఆగస్టులో ఎగుమతుల విలువ 23.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఆగస్టు నెలలో దిగుమతులూ భారీగా పెరిగాయి. ఈ విలువ 21.02 శాతం పెరుగుదలతో 35.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11.65 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రత్యేక సంస్థగా బీఎస్ఎన్ఎల్ టవర్స్ బీఎస్ఎన్ఎల్కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్ఎన్ఎల్కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా టాటా సన్స్! టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది. కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపినా, దీనిని మిస్త్రీ వ్యతిరేకించారు. విదేశీ మారక నిల్వలు.. రికార్డ్ దేశీయ విదేశీ మారకద్రవ్య(ఫారెక్స్) నిల్వలు కొత్త రికార్డులకు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 8వ తేదీతో ముగిసిన వారంలో 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆటో... మహీంద్రా నుంచి జీతో మినీ వ్యాన్ మహీంద్రా అండ్ మహీంద్రా హైదరాబాద్ మార్కెట్లో జీతో మినీ వ్యాన్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్–4 ప్రమాణాలతో 625 సీసీ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ ఎం–డ్యూరా ఇంజన్‌ను పొందుపరిచారు. 16 హెచ్‌పీ ఇంజన్ ఔట్పుట్, 38 ఎన్ఎం టార్క్, 1,190 కిలోల బరువు, అయిదు గేర్లు, మాన్యువల్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. డ్రైవర్‌తో సహా అయిదుగురు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. 3 రంగుల్లో లభిస్తోంది. మార్కెట్లోకి టాటా ‘టియాగో విజ్’ ‘టాటా మోటార్స్’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ ‘టియాగో’లో లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ‘విజ్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.52 లక్షలు– రూ.5.3 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త వెర్షన్లో 9 రకాల కొత్త ఫీచర్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. నియామకాలు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌లో సురేశ్ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) వైస్ చైర్మన్‌గా శ్రీనివాసా ఫామ్స్ ఎండీ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ నుంచి ఈ పదవి పొందిన రెండో వ్యక్తిగా రికార్డు స్థాపించారు. ఐఈసీ బోర్డులో తొలిసారిగా దేశం నుంచి వెంకటేశ్వర హ్యాచరీస్ వ్యవస్థాపకులు బి.వి.రావు 1992–93లో స్థానం సంపాదించారు. యూఐఐ సీఎండీగా ఎంఎన్ శర్మ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ (యూఐఐ) కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంఎన్ శర్మ నియమితులయ్యారు. తక్షణం ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఇంతక్రితం ఆయన హెల్ ఇన్సూరెన్స్ టీపీఏ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పనిచేశారు. విలీనం దిశగా ఇండస్ఇండ్–బీఏఎఫ్ఎల్ ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సూక్ష్మరుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఒకనాటి ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. విలీన సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఇరు సంస్థలూ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిర్ధిష్ట కాలవ్యవధిలో మదింపు ప్రక్రియ పూర్తిచేసేందుకు, విలీన అవకాశాలను పరిశీలించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇరు సంస్థలు తెలియజేశాయి. అయితే, ఒప్పంద గడువు ఎప్పటిదాకా ఉంటుందనేది వెల్లడించలేదు. సైయంట్ చేతికి బీఅండ్‌ఎఫ్ డిజైన్ ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ తాజాగా అమెరికాకు చెందిన బీఅండ్‌ఎఫ్ డిజైన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు 5.5 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. తమ అనుబంధ సంస్థ సైయంట్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. -
రూ. 2 వేల కోట్లు కట్టండి..
జేపీ అసోసియేట్స్‌కు సుప్రీం కోర్టు ఆదేశం ► జేపీ ఇన్ఫ్రా గృహ కొనుగోలుదారులకు అండ... ► ఐఆర్‌పీకి సంస్థ యాజమాన్య బాధ్యతలు ► కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు వెళ్లకుండా నిషేధం ► దివాలా ప్రక్రియపై సమగ్ర సమీక్ష న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారు ప్రయోజనాలే లక్ష్యంగా రియల్టీ దిగ్గజం– జేపీ ఇన్ఫ్రాటెక్ దివాలా ప్రక్రియను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమీక్షించటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జేపీ ఇన్ఫ్రా నిర్వహణ నియంత్రణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమించిన ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు (ఐఆర్పీ) అప్పగిస్తూ... తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. ఇతర ముఖ్య ఆదేశాలు చూస్తే... ⇒ దాదాపు 32,000కుపైగా గృహ కొనుగోలుదారులు.. రుణ దాతలు వారివారి డబ్బు ఎలా తిరిగి పొందాలనేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి వీలుగా జేపీ ఇన్ఫ్రాటెక్ తన రికార్డులన్నీ ఐఆర్‌పీకి అప్పగించాలి. ⇒ ఐఆర్పీ ప్రొసీడింగ్స్‌పై సూచనలు, సలహాల కోసం సలహాదారుగా (అమికస్ క్యూరీ) సీనియర్ అడ్వకేట్ శంకర్ నాప్తాడేను సుప్రీం నియమించింది. ⇒ కోర్టు అనుమతి లేకుండా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేదా డైరెక్టర్‌కానీ విదేశాలకు వెళ్లకూడదు. ⇒ దివాలా ప్రొసీడింగ్స్ ప్రారంభమైనప్పుడు డైరెక్టర్లు సహా జేపీ ఇన్ఫ్రా వ్యవహారాలతో సంబంధమున్న ఎవ్వరూ విదేశాలు వెళ్లకూడదు. అయితే కంపెనీకి రుణ దాతలుగా ఉన్న ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ ప్రతినిధులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుంది. ⇒ గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలే లక్ష్యంగా జేపీ ఇన్ఫ్రాటెక్ మాతృ సంస్థ జేపీ అసోసియేట్స్ తక్షణం రిజిస్ట్రీ వద్ద రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయాలి. ⇒ రూ.2,000 కోట్లు ఎలా సమకూర్చుకోవాలన్న అంశాన్ని కూడా జేపీ అసోసియేట్స్‌కు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వేల్కర్, డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. భూములు లేదా ఆస్తులు విక్రయించి అక్టోబర్ 27వ తేదీ నాటికి కోర్టు రిజిస్ట్రీ వద్ద డబ్బు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ⇒ కంపెనీ నిర్వహణను ఐఆర్‌పీకి అప్పగించినందువల్ల ఇకపై వినియోగదారుల కమిషన్ వంటి ఇతర ఎటువంటి న్యాయ వేదికపైనా ఏ ప్రయోజనం కోసమూ జేపీ ఇన్ఫ్రా టెక్‌పై ఇతర ప్రొసీడింగ్స్ జరపకుండా స్టే ఉత్తర్వులు మంజూరు చేసింది. ⇒ కేసు తదుపరి విచారణను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. జేపీ షేర్ల భారీ పతనం... సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్, జేపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని నమోదుచేసుకున్నాయి. జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్– నిఫ్టీలో 6.4 శాతం (రూ.1.50) పతనమై, 21.85కు తగ్గింది. ఒక దశలో 21.05 ధరను సైతం చూసింది. ఇక జేసీ ఇన్ఫ్రాటెక్ షేర్ 4.78 శాతం తగ్గి, (రూ.0.80) 15.95కు పడింది. మా ఆందోళనంతా వారి గురించే... కంపెనీ ప్రయోజనాల గురించి మేము ఆందోళన చెందడంలేదు. మా ఆందోళన అంతా... గృహ కొనుగోలుదారుల గురించే. వారిలో చాలామంది దిగువ, మధ్య తరగతికి చెందిన వారు ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించడం అవసరం. ఇది మా బాధ్యత. వారికి ఫ్లాట్ అయినా దక్కాలి లేదా వారు కట్టిన డబ్బైనా వెనక్కు రావాలి. – చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దివాలా ప్రొసీడింగ్స్ సరికాదు... గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలు పక్కనబెట్టి కంపెనీపై దివాలా చర్యలు సరికాదు. – కేసు విచారణలో సుప్రీంకు సహకరిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హోమ్ బయ్యర్స్‌కు పెద్దపీట... గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. కాగా జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను ఇతర కష్ట కంపెనీలతో పోల్చుతూ కఠిన చర్యలు తీసుకోవడం సరికాదు. ఎందుకంటే, కంపెనీకి ఉన్న రుణం రూ. 9,000 కోట్లు. ఆస్తుల విలువ రూ.17,000 కోట్లు. కనీ సం అంటే రూ.15,000 కోట్లయినా పలుకుతాయి. – జేపీ ఇన్ఫ్రా అడ్వకేట్ పీఎస్ పట్వాలియా