JS khehar
-
హైకోర్టు జడ్జీల నియామకాలు పూర్తి
► 10 రాష్ట్రాలకు 51మంది కేటాయింపు న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ మరింత పటిష్టం కానుంది. కేసులను త్వరితగతిన విచారించడానికి సుప్రీంకోర్టు కొలీజియం అధిక సంఖ్యలో హైకోర్టు జడ్జిలను నియమించింది. పది హైకోర్టులకు 51 మంది జడ్జిలను కేటాయించింది. ఛీఫ్ జస్టిస్ జేఎస్ కెహర్ నేతృత్వంలో ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, జె చలమేశ్వర్, రంజన్ గగోయ్, ఎంబీ లోకూర్‌లతో కూడిన కొలీజియం ఈ నియమాకాలను చేపట్టింది. ఈఏడాది మార్చిలోనే కొలీజియం ఈనియామాలకు సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్‌ను(ఎంఓపీ) ని ఖరారు చేసింది. ఇందులో అధికంగా ముంబై హైకోర్టుకు 14 మంది, పంజాబ్ హర్యానాల ఉమ్మడి హైకోర్టుకు 9 మందిని కేటాయించారు. పాట్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్టులకు ఆరుగురి చొప్పన నియమించారు. ఢిల్లీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు నలుగురి చొప్పున కేటాయించారు. జమ్మూకాశ్మీర్‌కు ముగ్గురు, జార్ఖండ్, గౌహతి హైకోర్టులకు ఇద్దరు చొప్పున నియమించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్టాడుతూ జడ్జీల నియామకాలు పారదర్శకంగా జరిగాయని, న్యాయవ్యవస్థలో పారదర్శకత సాధించాలని ఆకాంక్షించారు. -
మేనిఫెస్టోలపై సీజేఐ వ్యాఖ్యలు హర్షణీయం
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సత్తా పార్టీ (తెలంగాణ) హర్షం వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకపోతే దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని, ఈమేరకు చట్టాలు చేయాలని గతంలోనే తమ పార్టీ స్పష్టం చేసిందని పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు డా.పాండురంగారావు అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో గతంలో లోక్‌సత్తా చేసిన సూచనలపై చర్చించారు. హామీల అమలుకు ఎంత డబ్బు అవసరం, దానిని ఎలా సమకూర్చుకుంటారనేది మేనిఫెస్టోలో స్పష్టచేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. -
పార్టీలకు మేనిఫెస్టోలే భగవద్గీత: వెంకయ్య
గాంధీనగర్: పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను భగవద్గీతగా భావించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం సూచించారు. మేనిఫెస్టోలు చిత్తు కాగితాలుగా మారుతున్నాయని సీజేఐ జేఎస్ ఖేహర్ అనడం తెలిసిందే గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం వెంకయ్య మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాయి’ అన్నారు. ప్రైవేట్ పెట్టుబడులతో.. సాక్షి, న్యూఢిల్లీ: అందరికీ చౌక ధరల్లో ఇళ్లను అందించడంలో భాగంగా ప్రైవేట్ సంస్ధల పెట్టుబడులతో క్రెడాయ్ ఆధ్వర్యంలో 352 గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను వెంకయ్య ప్రారంభించారు. రూ.38 వేల కోట్ల వ్యయంతో 17 రాష్ట్రాల్లోని 53 నగరాల్లో రెండు లక్షలకుపైగా ఇళ్లను నిర్మించనున్నారు. తిరుపతిలో రూ.10 కోట్లతో 50 ఇళ్లను, హైదరాబాద్‌లో రూ.663 కోట్లతో 1,784 గృహాలను నిర్మించనున్నారు. -
మీ బాధ నాకు తెలుసు, సాయం చేస్తాను: మోదీ
అలహాబాద్ (ఉత్తరప్రదేశ్): న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తొలగించేందుకు, పెండింగ్ కేసుల తగ్గించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సాయం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్‌కు హామీ ఇచ్చారు. 'న్యాయవ్యవస్థపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలన్న చీఫ్ జస్టిస్ సంకల్పానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నేను ఆయనకు హామీ ఇస్తున్నాను' అని మోదీ అన్నారు. అలహాబాద్ హైకోర్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖేహర్ మాట్లాడుతున్నప్పుడు ఆయనలోని బాధ తనకు అర్థమైందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 1200 పాత చట్టాలను తొలగించి.. న్యాయవ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేసిందని అన్నారు. కోర్టుల పనితీరును సరళీకరించేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు టెక్నాలజీ వినియోగాన్ని చీఫ్ జస్టిస్ తీసుకొచ్చారంటూ మోదీ ప్రశంసించారు. -
ఎమ్మెల్యేకు సీజేఐ కథ, జరిమానా
న్యూఢిల్లీ: 23 సంవత్సరాల క్రితం ఓ మేగజిన్‌లో రాసిన ఆర్టికల్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ప్రధాన న్యాయమూర్తి భారీగా జరిమానా విధించారు. బీహార్‌లోని ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ 1994లో తనపై నియచక్ర మేగజిన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సీజేఐ జేఎస్ ఖెహర్.. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టులో పిటిషన్ వేయడంపై రవీంద్రను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇచ్చిన రవీంద్ర.. 2013లో తాను ఆ ఆర్టికల్‌ను చదివానని చెప్పారు. పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు పిటిషన్‌ను తీసుకునేందుకు తిరస్కరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానానికి తృప్తి చెందని న్యాయమూర్తి పిటిషన్ అమూల్యమైన కోర్టు సమయాన్ని వృథా చేసిందని అన్నారు. ప్రజాప్రతినిధి ఉండి చట్టాన్ని దుర్వినియోగం చేయాకూడదని వ్యాఖ్యానించారు. ఏళ్ల తర్వాత పిటిషన్‌ను ఫైల్ చేసినందుకు పిటిషనర్‌కు రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నివ్వెరపోయిన రవీంద్రసింగ్ జరిమానాను రద్దు చేయాలని కోరారు. రవీంద్ర అభ్యర్ధనపై స్సందించిన సీజేఐ.. తాను విద్యార్థి దశలో ఉన్న సమయంలో హాస్టల్లో జరిగిన ఓ సంఘటను చెప్పారు. హాస్టల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ విద్యార్థికి రూ.25 జరిమానా విధించారని చెప్పారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు తక్కువ జరిమానా విధించింనందుకు సదరు విద్యార్థి వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జి చెప్పిన కథతో కోర్టులో నవ్వులు పూశాయి. ఆ విద్యార్థిలాగే రవీంద్ర కూడా రూ.10 లక్షల జరిమానాకు ఇంకొంచెం ఎక్కువ చెల్లించాలని న్యాయమూర్తి అన్నారు. -
ఇక ఫాస్ట్‌ట్రాక్ విచారణ
సీజేఐ జేఎస్ ఖేహర్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దాదాపు 61వేల కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో పనిచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. పలు అంశాలపై వేసిన వ్యాజ్యాలను తొలగించబోమని ఆయన భరోసా ఇచ్చారు. ‘మేం ఫాస్ట్‌ట్రాక్‌లో పనిచేస్తాం. ఆందోళన వద్దు. ఏ వ్యాజ్యాన్నీ రద్దుచేసే ప్రసక్తే లేదు’ అని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న 15 రోజుల్లోనే సామాజిక న్యాయానికి సంబంధించిన కేసుల వాదనలు వినే ధర్మాసనాన్ని జస్టిస్ ఖేహర్ పునరుద్ధరించారు. ఈ సామాజిక న్యాయ బెంచ్‌ను మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2014లో స్థాపించారు. కాగా, ఈ ధర్మాసనానికి జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వం వహిస్తారు. ఈ బెంచ్ ప్రతి శుక్రవారం రెండు గంటలపాటు కూర్చుని.. ప్రజాపంపిణీ వ్యవస్థ మొదలుకుని కరువు పరిస్థితులు, కబేళాలు, రాత్రి ఆవాసాలు, ఆరోగ్యం, శుభ్రత, పిల్లల అక్రమ రవాణా వంటి కేసులను విచారించనుంది.