పార్టీలకు మేనిఫెస్టోలే భగవద్గీత: వెంకయ్య | Parties should treat their manifestos as Bhagwad Geeta: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

పార్టీలకు మేనిఫెస్టోలే భగవద్గీత: వెంకయ్య

Published Mon, Apr 10 2017 1:39 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

Parties should treat their manifestos as Bhagwad Geeta: Venkaiah Naidu

గాంధీనగర్‌: పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను భగవద్గీతగా భావించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం సూచించారు. మేనిఫెస్టోలు చిత్తు కాగితాలుగా మారుతున్నాయని సీజేఐ జేఎస్‌ ఖేహర్‌ అనడం తెలిసిందే గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం వెంకయ్య మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాయి’ అన్నారు.

ప్రైవేట్‌ పెట్టుబడులతో..
సాక్షి, న్యూఢిల్లీ: అందరికీ చౌక ధరల్లో ఇళ్లను అందించడంలో భాగంగా ప్రైవేట్‌ సంస్ధల పెట్టుబడులతో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో 352 గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను వెంకయ్య ప్రారంభించారు. రూ.38 వేల కోట్ల వ్యయంతో 17 రాష్ట్రాల్లోని 53 నగరాల్లో రెండు లక్షలకుపైగా ఇళ్లను నిర్మించనున్నారు. తిరుపతిలో రూ.10 కోట్లతో 50 ఇళ్లను, హైదరాబాద్‌లో రూ.663 కోట్లతో 1,784 గృహాలను నిర్మించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement