ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం బదిలీ
అనంతపురం టౌన్ : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగంను కర్నూలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి అపర్ణ ఉపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులో పీడీ పోస్టు ఖాళీగా ఉండడంతో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జుబేదాబేగం గతంలో వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, హైదరాబాద్లో పనిచేశారు. తాజాగా ఈమెను కర్నూలుకు బదిలీ చేసిన ప్రభుత్వం ఇక్కడికి మాత్రం ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న ఉషాఫణికర్కు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.