Julie-2
-
ముద్దుకి ముందు... ఈ టిప్స్ పాటించండి!
మీకు సిగరేట్ తాగే అలవాటుందా? అయితే... నోటిని శుభ్రంగా కడుక్కోండి! లేదా నోట్లో చూయింగ్ గమ్ వేసుకొండి! – ఎవరినైనా ముద్దు పెట్టుకోవడానికి ముందు మీరు తప్పకుండా ఫాలో కావలసిన ఫస్ట్ టిప్. శరీరం నుంచి దుర్వాసన (బ్యాడ్ స్మెల్) రాకుండా చూసుకోవడం... సెకండ్ టిప్! ఈ రెండు టిప్స్ ఎవరు చెప్పారో తెలుసా? ‘ఖైదీ నంబర్ 150’లో రత్తాలు పాటలో హాట్ హాట్‌గా కనిపించిన రాయ్ లక్ష్మీ. ఆన్ స్క్రీన్ అయినా... ఆఫ్ ద స్క్రీన్ అయినా... ఈ టిప్స్ అందరికీ ఉపయోగపడతాయేమో కదూ! మూడో టిప్ కూడా ఉందండోయ్! అయితే... అది నటీనటులకు మాత్రమే, ప్రేక్షకులకు కాదు. అదేంటంటే... కిస్సింగ్ సీన్ లేదా రొమాంటిక్ సీన్స్‌లో నటించేటప్పుడు సెట్లో ఎవరున్నా, ఎంతమంది ఉన్నా... మర్చిపోమ్మని సెలవిచ్చారు. ఇప్పుడీ టిప్స్ అన్నీ ఎందుకంటే... రాయ్ లక్ష్మీ నటించిన హాట్ హిందీ సిన్మా ‘జూలీ–2’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదీ సంగతి! అన్నట్టు... ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
నెటిజన్లపై శివమెత్తిన శ్రియ
తమిళసినిమా: ఇంటర్నెట్లో హాట్ హీరోయిన్స్ అని టైప్ చేస్తే చాలు అర్ధ నగ్నం, నగ్న హీరోయిన్ల ఫొటోలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వాటిలో కొన్ని మార్ఫింగ్ ముఖాలు కూడా కనిపిస్తాయి. కొందరు హీరోయిన్లు అయితే తమ అందాలను ఆరబోసే విధంగా కురచ దుస్తులు ధరించి ఫొటోలను తమ ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్ చేసి ఫ్రీ పబ్లిసిటీ పొందేస్తున్నారు. హిందీ చిత్రం జూలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ నటించిన దృశ్యాలను తిలకిస్తే అందులో ఆమె దాదాపు అర్ధనగ్నానికి ఎక్కువగా, నగ్నానికి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాంటి అశ్లీల దృశ్యాలకు గ్లామర్ అనే పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపించక మానదు. గ్లామర్ విషయంలో నటి శ్రియ కూడా చాలా చిత్రాల్లో శృతి మించే నటించింది. అసలు అందానికి, అశ్లీలానికి తేడా ఏమిటన్న ప్రశ్నకు నటి శ్రియ ఆగ్రహంతో మండిపడింది. హీరోయిన్లు చీర కడితే వెంటనే పాత సంప్రదాయం అనేస్తారు. కాస్త మోడ్రన్ దుస్తులు ధరిస్తే అశ్లీలం, అసభ్యకరం అని విమర్శలు గుప్పిస్తారు. నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనూ దేనికదే అందం దాగుంటుంది. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. అయితే సమీపకాలంలో నెటిజన్లు మోడ్రన్ దుస్తులు ధరించిన హీరోయిన్ల గురించి చెడుగా రాసేస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తే చెడ్డవాళ్లా అంటూ విరుచుకుపడింది. చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా అందం అనే ఒక్కటే అని తనదైన బాణీలో అందానికి శ్రియ నిర్వచనం చెప్పింది. -
మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డాను: నటి
చెన్నై: ఓ బాలీవుడ్ మూవీ ఛాన్స్ వల్ల మంచి అవకాశం కోల్పోయానని చెప్పింది నాటి రాయ్‌లక్ష్మీ. ఆ మధ్య తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమాతో ‘రత్తాలు రత్తాలు..’ అంటూ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో కవ్వించింది. ప్రస్తుతం ఈ భామ ఇటీవల ఎక్కడా కనిపించడం లేదని ఆలోచిస్తుండగానే మరోసారి తానే సెల్ఫ్ పబ్లిసిటీకి రెడీ అయింది. ‘ఇటీవల మలయాళంలో సూపర్‌స్టార్ మమ్ముట్టితో రొమాన్స్ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నా. అందుకు కారణం బరువు పెరగడమే. నేను హిందీలో జూలీ -2 చిత్రంలో నటిస్తున్నాను. బాలీవుడ్లో చిత్రం చేయాలన్న ఆశతోనే ఈ చిత్రాన్ని అంగీకరించలేదు. జూలీ-2లో నాది కీలకపాత్ర. అందుకోసం ఏడాదిన్నరపాటు శ్రమించాను. ఈ పాత్ర కోసం దాదాపు 11 కిలోల బరువు తగ్గా, ఆపై 7 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. అలా బరువు పెరగడం, తగ్గడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులకు గురయ్యా. షూటింగ్ కూడా అందుకే ఆలస్యమైంది. అయితే నా ఫ్యామిలీ సహకారంతో ఆ బాధ నుంచి తేలిగ్గానే బయట పడ్డాను. దీంతో చాలా అవకాశాలు వదులుకున్నాను. స్టార్ హీరో మమ్ముట్టీకి జంటగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది. అందుకు కారణం నేను బరువు పెరగడమే. ఇకపై వైవిధ్యభరిత పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని’ పేర్కొంది. జూలీ-2 మూవీ అక్టోబరులో విడుదల కానుంది.