July 15
-
వీరే... ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ !
వెబ్‌డెస్క్: జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం... ఎగుడుదిగుడు గగనం మేమేరా పిడుగులం అంటూ యూత్‌ని వర్ణించాడు ఓ సినీ కవి. నిజమే ! ఆ యుత్‌లో ఉన్న ఎనర్జీకి స్కిల్‌ను జోడించి వారి భవిష్యత్తుతో పాటు మానవాళి మనుగడకు కొత్త బాటలు వేయడం లక్క్ష్యంగా ప్రతీ ఏడు జులై 15న వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబరు 18న తీర్మాణించింది. దీని ప్రకారం మొదటిసారి 2015లో జులై 15న తొలిసారి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం యువతకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంచడం ద్వారా భవిష్యతత్తులో వారు ఎంట్రప్యూనర్లుగా, ఉద్యోగస్తులుగా రూపొందించడం వరల్డ్ యూత్ స్కిల్ డే ముఖ్య ఉద్దేశం. ఈ విషయానికి సంబంధించి ప్రజా ప్రతినిథులు, యాజమాన్యాలు, ఉద్యోగస్తులు, నైపుణ్యం కలిగిన యువత అందరినీ ఒకతాటిపైకి తెచ్చి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయడం ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా తర్వాత యువతలో మిగిలి ఉన్న నైపుణ్యాలు అనే థీమ్‌తో ఈసారి వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొవడంలో యువత చూపించిన నైపుణ్యాలు అనే అంశం ప్రధానంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తీవ్ర ఒత్తిడి కరోనా రక్కసి దాడికి తీవ్రంగా గురయ్యారు యువత. సమాజంలో అన్ని వర్గాలపైన కరోనా ప్రభావం ఉన్నా.. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు చాలా ప్రభావానికి లోనయ్యారు. మానసికంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఇటు చిన్న వాళ్లలా ఉండలేక అటు పెద్ద వాళ్లతో పోటీ పడలేక నలిగిపోయారు. ఐక్యరాజ్య సమితి గణాంకాలు సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. కరోనా కల్లోలం కరోనా కారణంగా గడిచిన ఇంచు మించు ఏడాదిగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా మూత పడి ఉన్నాయి. 2021 జూన్ వరకు 19 దేశాల్లో ఏడాదిగా పాఠశాలలు తెరుచుకోలేదు. పాఠశాలలు మూత పడటం వల్ల 15.7 కోట్ల మంది యువత నష్టపోతుండగా పాక్షింగా మూతపడటం వల్ల 76.8 కోట్ల మంది నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి. - 15 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు వారు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులకు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు - 2020లో కరోనా సంక్షోభం కారణంగా 8.7 శాతం యూత్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇదే సమయంలో 25 ప్లస్ వయస్సు వారు 3.7 శాతమే ఉద్యోగాలు కోల్పోయారు. - యువతలో మగవారితో పోల్చినప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
15లోగా చెల్లించండి
న్యూఢిల్లీ/గుర్గావ్:జనవరి నుంచి జూన్ వరకూ పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఈ నెల 15వ తేదీలోగా చెల్లించాలని బీఎస్ఈఎస్ యుమునా సంస్థను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. మే ఆరో తేదీన తాము ఇచ్చిన ఆదేశాలకు లోబడి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించాలని తన ఆదేశాల్లో అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గత నెల 30వ తేదీవరకూ ఉన్న బకాయిలను బీఎస్ఈఎస్ యమునా సంస్థ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బీఎస్ఈఎస్ సంస్థ అందజేసిన ఖాతాల తాలూకూ వివరాలపట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. బీఎస్ఈఎస్ రాజధాని సంస్థ తన బకాయిలో 94 శాతం మేర చెల్లించిందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను మరో రెండు నెలలపాటు వాయిదా వేసింది. కాగా బీఎస్ఈఎస్ రాజధాని సంస్థకు తూర్పు, మధ్య ఢిల్లీ పరిధిలో మొత్తం 13.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. చాందినీచౌక్, దర్యాగంజ్, పత ్పర్గంజ్, శంకర్రోడ్, పటేల్‌నగర్, కృష్ణానగర్, లక్ష్మీనగర్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలకు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇక బీఎస్ఈఎస్ రాజధాని సంస్థ దక్షిణ, పశ్చిమఢిల్లీ పరిధిలోని అలకానంద, వసంత్‌కుంజ్, సాకేత్, నెహ్రూ ప్లేస్, నిజాముద్దీన్, సరితా విహార్, హౌజ్‌ఖాస్, ఆర్కేపురం, జనక్‌పురి, ద్వారకా తదితర ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఫేజ్‌త్రీ వాసులకు త్వరలో ఊరట గుర్గావ్లోని ఫేజ్‌త్రీ పరిసర వాసులకు శుభవార్త. విద్యుత్ సరఫరాలో కోతలనుంచి వీరికి త్వరలో విముక్తి కలగనుంది. ఇందుకు కారణం నాలుగు ఫీడర్లను దక్షిణ హర్యానా బిజిలీ వితరణ్ సంస్థ (డీహెచ్‌బీవీఎన్) త్వరలో ఫేజ్త్రీకి అనుసంధానం చేయనుండడమే. రింగ్ విధానంలో వీటిని కలపనుంది. ఇందువల్ల నాలుగు ఫీడర్లలో ఏదో ఒకదానిపై భారం పడితే దానిని మిగతా వాటికి బదిలీ చేయడానికి వీలవుతుంది. దీంతో ఏ ఒక్క ఫీడర్పైనా భారం పడే అవకాశమే ఉండదు. అయితే ఇదంతా సాకారమయ్యేందుకు కొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఫేజ్ త్రీలో కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో కోత సర్వసాధారణంగా మారిన సంగతి విదితమే.