వన్‌ప్లస్ 5 లాంచింగ్: భలే ఆఫర్, ధర ఎంతంటే?
ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్ ప్లస్ 5'ను జూన్ 22న విడుదల చేయనుంది. న్యూయార్క్‌లో జూన్ 20న లాంచ్ అవుతుండగా భారత్‌లో 22న విడుదల. హై-ఎండ్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలో అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్, సరికొత్తగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. దీని ధర 6జీబీ, 64జీబీ స్టోరేజ్ (బేస్ వేరియంట్) ధర రూ. 37,999గాను, 8జీబీ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ ఫౌండర్, సీఈవో పీటే లా దీన్ని ఆవిష్కరించనున్నారు.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికర ఆఫర్ ఉంది. జూన్ 22న ముంబైలో జరిగే లాంచింగ్ ఈవెంట్‌కు హాజరు కావాలనుకుంటే ఓ బంపర్ ఆఫర్ కూడా ఉంది. దీనికి జూన్ 12న వన్‌ప్లస్ అధికారిక సైట్ లో ఒక వెల్కం ప్యాక్‌ను కొనుగోలు చేయాలి. టీ షర్ట్ సహా కాంబో ఆఫర్ తో అందించే ఇన్వైట్ బాక్స్‌ను కస్టమర్లు రూ.999 లకు కొనుగోలు చేయాలి. ఇందులో దాదాపు పదివేల రూపాయల విలువ చేసే వస్తువులను ఉచితంగా అందిస్తోంది.
1. రూ.3990 విలువ చేసే బ్రాండ్-న్యూ స్పెషల్ బ్యాక్‌ప్యాక్ విలువ
2. యునిప్లోస్ సన్ గ్లాసెస్ , వీటి విలువ రూ. 6000
3. టీ -షర్టు
ఈ బాక్స్‌ను వెంటనే కస్లమర్ల ఇంటికి వెంటనే రవాణా చేయబడుతుంది.దీన్ని స్వీకరించిన తర్వాత, కస్టమర్ల వన్ ప్లస్ ఖాతాకు రూ. 999 క్రెడిట్ అవుతుంది. ఈ కోడ్‌ను ప్లన్ ప్లస్ 5 కొనుగోలు సమయంలో వాడుకోవచ్చు. దీన్ని మూడు రోజుల్లోపు ఉపయోగించు కోవాలి. దీంతో పాటు మరొకరిని ఆహ్వానించేందుకు వీలుగా ఒక కోడ్ కూడా అందుతుంది. దీన్ని మన స్నేహితులకు షేర్ చేయవచ్చు. ఈకోడ్ ద్వారా డైరెక్ట్ గా ఫోన్ కొనుగోలు చేయవచ్చన్నమాట.
మరోవైపు జూన్ 22వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానున్ను వన్ ప్లస్ 5 అదే రోజున ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ వేరియెంట్ విక్రయించనుంది. రెండు కెమెరాలు ఖాయం అని తెలసినప్పటికీ ఎంపీ ఎంత అనేది స్పష్టం కాలేదు. ట్విట్టర్ ఉంచిన ఇమేజ్ ప్రకారం బ్లాక్ కలర్ లో వస్తున్న వన్ ప్లస్ 5 లో రెండు రియర్ కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిన్న టీజర్‌ను కూడా వన్‌ప్లస్ ట్విట్టర్లో విడుదల చేసింది.
వన్ ప్లస్ 5 ఫీచర్లు
స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే,
128 జీబీ
3300 ఎంఏహెచ్‌బ్యాటరీ
Coming Soon. #OnePlus5 https://t.co/XWfMtBbOFg pic.twitter.com/HULFUiW6EB
— OnePlus (@oneplus) June 9, 2017