‘గురుకుల’ లెక్చరర్ డిస్మిస్
జోగిపేట, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా అందోల్‌లోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశా ల జూనియర్ లెక్చరర్ మధుసూదన్‌ను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తు లు కలిగి ఉన్నట్లు అభియోగాల నేపథ్యంలో 2009లో ఆయనపై ఏసీబీ కేసు నమోదైంది. విచారణ పూర్తికావడంతో తాజాగా అతని ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని గోపాల్‌పేట్‌కు చెందిన మధుసూదన్ గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
ఈయన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటతో పాటు మెదక్ జిల్లాలోని హత్నూరలో పనిచేసి గత మే నెలలో అందోల్ గురుకుల పాఠశాలకు బదిలీపై వచ్చారు. 2009లో అచ్చంపేటలో పనిచేస్తున్న సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులుచేశారు. హైదరాబాద్‌లో ఆస్తులతోపాటు వాటర్‌ట్యాంకర్లు, అత్యంత సమీప బంధువులకు ఆరుకార్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును అప్పట్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకట్‌రెడ్డి విచారణ చేపట్టారు.
కేసు విచారణలో మధుసూదన్ సహకరించకపోగా, తనపై నమోదైన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు చూపలేదని సమాచారం. విచారణ అనంత రం ఏసీబీ నివేదికను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యద ర్శి ప్రవీణ్‌కుమార్ జూనియర్ లెక్చరర్ మధుసూదన్‌ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
వాటిని మంగళవారం అందోల్ గు రుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాధురీదేవికి గురుకుల పాఠశాలల కన్వీనర్ సుదర్శన్ అందజేశారు. మరో ప్రతిని మధుసూదన్‌కు కూడా ఇచ్చారు. మంగళవారం నేరుగా ఉత్తర్వులు అందుకున్న ఆ యన పాఠశాల నుంచి నిష్ర్కమించారు. కాగా, డి స్మిస్కు గురైన జూనియల్ లెక్చరర్ మధుసూదన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం.