Justice Kurian
-
సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: నాలుగు వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కోర్టు కొలీజియం పంపిన సిఫార్సులకు 48 గంటల్లోనే కేంద్రం ఓకే చెప్పింది. జస్టిస్ హేమంత్ గుప్తా(మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగి(త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా(పట్నా హైకోర్టు), జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి(గుజరాత్ హైకోర్టు)లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జస్టిస్ సుభాష్‌రెడ్డి 2002లో ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిగా, 2016లో గుజరాత్ సీజేగా పదోన్నతి పొందారు. కొత్త జడ్జీలు బాధ్యతలు చేపట్టాక కోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరగనుంది. ప్రజల సందర్శనకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును సామాన్యప్రజలు కూడా సందర్శించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఇకపై సుప్రీంకోర్టు గదులు, జడ్జీల గ్రంథాలయాన్ని సెలవు దినాలు మినహాయించి ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని వర్గాల వారూ సందర్శించేందుకు వీలుంది. సందర్శకులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని, థింక్‌ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్’ను సీజేఐ ప్రారంభించారు. ‘ఈ కేంద్రం ఏర్పాటు కేవలం నాకు తట్టిన ఆలోచన మాత్రమే. మిమ్మల్ని సంప్రదించకుండా దీనిని ఏర్పాటు చేసినందుకు క్షమించాలని కోరుతున్నా’ ఆవిష్కరణ కార్యక్రమంలో సీజేఐ వ్యాఖ్యానించారు. -
లాయర్లు సమ్మె చేయరాదు
సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: న్యాయవాదులు సమ్మెకు దిగడం, కోర్టులు బహిష్కరించడం చేయరాదని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. జస్టిస్ కురియన్, జస్టిస్ అరుణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘సమ్మె ఓ బ్రహ్మాస్త్రం. ఎవరైనా దీన్ని విపత్కర పరిస్థితిలోనే ఉపయోగించాలి. కానీ తరుచుగా సమ్మె మంత్రం జపిస్తున్నారు. ఇది చాలా సీరియస్ సమస్య. న్యాయవాదులు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీన్ని పాటించాలి’ అని పేర్కొంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయవాదులు ఆస్తుల విచారణాధికార పరిధిపై సమ్మె చేయడంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా కామన్‌కాజ్ అనే ఎన్జీవో పిల్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. న్యాయవాదుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ దీనిపై స్పందిస్తూ సమ్మె చేయడమనేది కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని అన్నారు. ఈ విషయమై న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నా రు. బార్ అసోసియేషన్లు కూర్చొని చర్చించి నెలల వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం లభించేటట్టు చూడాలని కోరింది. ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ ధర్మాసనం తీర్పును భేఖాతరు చేసిన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ జిల్లా బార్ అసోసియేషన్ సమన్వయ కమిటీ చైర్మన్‌కు, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.