‘పాలమూరు’ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నవీన్‌రావు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై జరుగుతున్న విచారణ నుంచి జస్టిస్ పి.నవీన్‌రావు తప్పుకున్నారు. అయితే, ఇందుకు గల కారణాలు నిర్ధిష్టంగా తెలియరాలేదు.
ఈ వ్యాజ్యంపై ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. శనివారం ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందు విచారణకు రాగా జస్టిస్ నవీన్‌రావు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరో ధర్మాసనానికి నివేదిస్తామని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.