సీవీసీ ఎంపికలో పారదర్శకత ఏది?
కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), విజిలెన్స్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియులో పారదర్శకత కొరవడిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని వుందలించింది. పారదర్శకత లేకపోవడం వల్ల ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి పెరిగిపోతుందని కోర్టు చురక వేసింది. ఈ పోస్టులకు కేవలం బ్యూరోక్రాట్లనే ఎందుకు ఎంపిక చేస్తున్నారని నిలదీసింది. సావూన్యులకు ఎందుకు ఈ పోస్టులను ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీవీసీ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం ప్రవుుఖంగా ప్రకటనలు ఇవ్వకుండా నియూవుకాలు చేపడుతోందని ఆరోపిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయువుూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని, ప్రజలు పారదర్శకతను కోరుకుంటున్నారని ధర్మాసనం అభిప్రాయుపడింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వుుకుల్ రోహత్గి వాదిస్తూ, నిబంధనల ప్రకారం సావూన్యులనుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించలేదని, సీవీసీ, విజిలెన్స్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియును పూర్తి చేయుడానికి ఒక నెల సవుయుం పడుతుందని తెలిపారు. అక్టోబర్ 9 లోగా స్పందన తెలపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.