మల్లన్న సేవలో జస్టిస్ సురేష్ ఖైత్
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ ఖైత్ గురువారం దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ నారాయణభరత్ గుప్త ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, ఈఓ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.