juvenile age
-
అన్వి... అన్నీ విశేషాలే!
ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్‌తో ఏకంగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి. భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది. ‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్‌ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది. ‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
వయసు 16..కేసులు 23
అతని వయసు 16 ఏళ్లు.. నేర చరిత్రేమో ఘరానా దొంగకు ఏ మాత్రం తీసిపోదు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ ల్లో అతనిపై 23 కేసులు నమోదై ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇతనితో పాటు ఓ మేజర్ బి.గణేష్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ముషీరాబాద్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన పి.వెంకటేశ్వర్లు భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం నగరంలోని అశోక్‌నగర్‌కు వచ్చాడు. హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. అతని కుమారుడు పి.వీరబాబు అలియాస్ వినోద్ అలియాస్ వీరా నాల్గవ తరగతి చదువుతున్న సమయంలో పక్క విద్యార్థి చెయ్యి విరిచాడు. దీనితో పాఠశాల యాజమాన్యం వీరబాబుకు టీసీ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతన్ని కూకట్‌పల్లిలోని పెద్దమ్మ దగ్గరకు పంపించగా, చోరీలకు పాల్పడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో బాచుపల్లి పీఎస్‌లో 2 కేసులు, మియాపూర్‌లో 11 కేసులు, కూకట్‌పల్లిలో 1 కేసు, సనత్‌నగర్‌లో 1 కేసు, సైదాబాద్‌లో 1 కేసు.. మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఇతనితో వేగలేక తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరబాబు నాలుగుసార్లు అరెస్టై జైలు (జువైనల్ హోం)కు వెళ్లాడు. రెండుసార్లు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తాజాగా హోంలో తోటి బాల నేరస్తున్ని విపరీతంగా కొట్టి తప్పించుకున్నాడు. జువైనల్ హోంలో పరిచయమైన బాకారానికి చెందిన బుషిపాక గణేష్ దగ్గరకు వెళ్లాడు. వీరిద్దరు రాంనగర్ లక్ష్మమ్మ పార్కు వద్ద ఉండే బాల నేరస్తుడు మద్దెల సిద్దార్థ అలియాస్ సిద్దూ, హరినగర్‌కు చెందిన విద్యార్థి నాంపల్లి సాల్మ¯Œ రాజులతో కలసి చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. ఈ క్రమంలో ముషీరాబాద్, నల్లకుంట, చిక్కడపల్లి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 7 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గోల్కొండ క్రాస్ రోడ్స్‌లో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని పోలీసులు పట్టుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను, సెల్ఫోన్లను, బంగారు గొలుసులను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.1.70 వేల రెండు యాక్టివాలు, 2 సెల్ఫోన్లు, ఒక్క ముత్యాల దండ, 25 తులాల వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, చిక్కడపల్లి ఏసీపీ నర్సింహారెడ్డి, ముషీరాబాద్ డీఎస్పీ గంగాధర్, డీఐ వెంకన్న, డీఎస్ఐ బాలరాజు తెలిపారు. -
16 దాటితే.. ఇక పెద్దోళ్లే!
బాల నేరస్థులకు సంబంధించిన చట్టాన్ని లోక్‌సభ ఆమోదించింది. 16-18 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు దారుణమైన నేరాలకు పాల్పడినా కూడా వాళ్లను బాల నేరస్థులుగానే చూడాల్సి రావడం, దానివల్ల వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడం లాంటి ఘటనల నేపథ్యంలో కేంద్రం బాల నేరస్థుల చట్టం సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది. ఇక దీన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి. అలా అయితే ఇక మీదట చట్టాన్ని సవరించి, 16 ఏళ్లు దాటినవాళ్లంతా పెద్దవాళ్లేనని భావిస్తారు. ఇందులో సాధారణ నేరాలు, తీవ్రమైన నేరాలు, హేయమైన నేరాలు అనే మూడు విభాగాలుగా నేరాలను వర్గీకరించారు. ప్రతి విభాగానికి వేర్వేరుగా విధానాలను అందులో నిర్వచించారు. నిర్భయ ఘటనలో అందరికంటే ఘోరంగా ప్రవర్తించినది ఒక మైనర్ కావడంతో అప్పటి నుంచి బాల నేరస్థుల వయసు మీద చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2000 నాటి బాల నేరస్థుల చట్టానికి దాదాపు 40 సవరణలు రాగా, అన్నింటినీ లోక్‌సభ ఆమోదించింది. 2013 సంవత్సరంలో మొత్తం 28 వేల కేసుల్లో బాల నేరస్థులు ఉండగా, వాటిలో 3887 అత్యంత హేయమైనవని జాతీయ నేర రికార్డుల బ్యూరో కూడా వెల్లడించిందని ఈ బిల్లు మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.