Juvva Movie
-
‘జువ్వ’ మూవీ రివ్యూ
టైటిల్ : జువ్వ జానర్ : కమర్షియల్ ఎంటర్టైనర్ తారాగణం : రంజిత్, పాలక్ లల్వాని, అర్జున్, పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి దర్శకత్వం : త్రికోటి.పి నిర్మాత : డా. భరత్ సోమి నువ్వు నేను ఒకటవుదాం సినిమాతో హీరోగా పరిచయం అయిన రంజిత్ సోమి, లాంగ్ గ్యాప్ తరువాత హీరోగా నటించిన సినిమా జువ్వ. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన త్రికోటి రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమాలో పాలక్ లల్వాణీ హీరోయిన్గా నటించింది. రంజిత్ అన్న భరత్ నిర్మాణంలో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన జువ్వ.. రంజిత్‌ను హీరోగా నిలబెట్టిందా..? త్రికోటికి దర్శకుడిగా సక్సెస్ అందించిందా..? కథ : 14 ఏళ్ల వయసులో బసవరాజు పాటిల్ (మలయాళ నటుడు అర్జున్) తన క్లాస్మేట్ శృతి(పాలక్ లల్వాణి)ని ప్రేమిస్తున్నాని వేధిస్తాడు. తప్పని మందలించిన స్కూల్ ప్రిన్సిపల్‌ను చంపేస్తాడు. ఈ కేసులో బసవరాజుకు 14 ఏళ్ల శిక్ష పడుతుంది. జైలుకు వెళ్లేప్పుడు కూడా శృతితో నీ కోసం తిరిగొస్తా అనటంతో శృతి కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తుంది. తన పేరును కూడా ఆధ్యగా మార్చుకొని ప్రశాంతంగా ఉంటుంది. రానా జనాలను మోసం చేస్తూ డబ్బులు సంపాందించే అల్లరి కుర్రాడు. (సాక్షి రివ్యూస్) ఆధ్యను చూసిన రానా తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అదే సమయంలో 14 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలైన బసవరాజు శృతి కోసం వెతుకుతున్నాడని తెలిసి ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. రానా... బసవరాజు నుంచి శృతిని ఎలా కాపాడాడు..? ఈ ప్రయత్నంలో రానాకు ఎవరెవరు సాయం చేశారు..? చివరకు బసవరాజు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా నటించిన రంజిత్ తొలి సినిమాతో పోలిస్తే మంచి పరిణతి చూపించాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్గా పాలక్ లల్వాణీ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా కనిపించిన మలయాళ నటుడు అర్జున్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. (సాక్షి రివ్యూస్) సైకో ప్రేమికుడి పాత్రలో అర్జున్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. ఫస్ట్‌హాఫ్ లో సప్తగిరి, భద్రం నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ, సన, అలీ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : రంజిత్‌ను హీరోగా రీ లాంచ్ చేసేందుకు దర్శకుడు త్రికోటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్నాడు. రత్నం అందించిన కథ ఆకట్టుకునేలా ఉన్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కిచటంలో దర్శకుడు తడబడ్డాడు. తొలి భాగం అంతా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి కేటాయించిన దర్శకుడు ఇంటర్వెల్ సమయానికి గానీ అసలు కథలోకి ఎంటర్ కాలేదు. ద్వితీయార్థంలో హీరో, విలన్ల మధ్య జరిగే సన్నివేశాలను ఆసక్తికరంగా రూపొందించాడు.(సాక్షి రివ్యూస్) సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి నిరాశపరిచాడు. పాటలు పరవాలేదనిపించినా కీరవాణి స్థాయిలో మాత్రం లేవు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాత భరత్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : కథ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
చిరంజీవిగారి అభినందన మరచిపోలేను
‘‘నాది వైజాగ్. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నన్ను నేను హీరోగా చూసుకోవాలనేది నా కోరిక. అందుకు చాలాకాలం ట్రై చేశా’’ అని హీరో రంజిత్ అన్నారు. రంజిత్, పాలక్ లల్వాని జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి పి. దర్శకత్వంలో భరత్ సోమి నిర్మించిన ‘జువ్వ’ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి చిత్రం ‘నువ్వు నేను ఒకటవుదాం’. రెండో సినిమా ‘జువ్వ’ని మా అన్నయ్య డా. భరత్ చాలా ఇష్టపడి నిర్మించారు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. రొమాన్స్, యాక్షన్, మంచి పాటలు, ఫన్ అన్నీ ఉంటాయి. ఇందులో నా పాత్ర పేరు రానా. ఎప్పుడూ జాలీగా, సరదాగా ఉండే కుర్రాడి పాత్ర. ఫైట్స్, రొమాన్స్, ఫన్.. ఇలా అన్ని సమయాల్లోనూ జాలీగానే ఉండే క్యారెక్టర్. త్రికోటిగారికి నాలెడ్జ్ ఎక్కువ. షూటింగ్ సమయంలో ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను. కీరవాణిగారు వంటి పెద్ద సంగీత దర్శకుడు నా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవిగారు అడగ్గానే టీజర్ రిలీజ్ చేసి, ‘నీది ఫొటోజెనిక్ ఫేస్’ అని మెచ్చుకున్నారు. ఆయన అభినందన మరచిపోలేను. ఫ్రెష్ లవ్‌స్టోరీ, స్పోర్ట్ప్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించాలని ఉంది. నెక్ట్స్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
అనుష్కలా సినిమాలు చేయాలనుంది
‘‘అనుష్క, సాయి పల్లవి చేస్తున్నట్లుగా డిఫరెంట్, స్ట్రాంగ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి దర్శకులను నమ్మి సినిమాలు చేస్తాను. ఆ తర్వాత నా ఛాయిస్‌కి తగ్గ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటాను’’ అన్నారు హీరోయిన్ పాలక్ లల్వానీ. రంజిత్, పాలక్ లల్వానీ జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి దర్శకత్వంలో భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. కీరవాణి స్వరకర్త. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాలక్ లల్వానీ మాట్లాడుతూ – ‘‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలో నా నటన చూసి దర్శకుడు త్రికోటì గారు ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశారు. ఈ సినిమా కథ బాగా నచ్చింది. రంజిత్ మంచి కో–స్టార్. అతను చాలా బాగా చేశాడు. నా ఫస్ట్ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. కానీ అది నన్ను అంతగా ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే సినిమా రిజల్ట్ హీరోయిన్లను అంతగా ఎఫెక్ట్ చేయవని అనుకుంటున్నాను. ప్రస్తుతం తమిళంలో జీవీ ప్రకాష్‌తో ఓ సినిమా, ‘కేరింత’ ఫేమ్ విశ్వాంత్ సరసన ఓ సినిమా చేశాను. అవి రెండూ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఫ్యూచర్లోనూ మంచి రోల్స్ సెలెక్ట్ చేసుకుంటాను’’ అన్నారు. -
విందు భోజనంలా ఉంటుంది – కీరవాణి
‘‘ఈ సినిమాకు కీరవాణిగారు సంగీతం అందించటం చాలా గొప్ప విషయం. సినిమా బావుంటుంది అనుకుంటేనే ఆయన సంగీతం అందిస్తారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. నటుడిగా రంజిత్‌కు మంచి గుర్తింపు రావాలి’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్. రంజిత్, పాలక్ లల్వాని జంటగా త్రికోటి దర్శకత్వంలో భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినాయక్ మాట్లాడుతూ –‘‘మా కుటుంబానికి ఆప్త మిత్రులు బొత్స సత్యనారాయణ గారు. వారి అల్లుడు, ఈ సినిమా నిర్మాత భరత్ సోమిగారికి శుభాకాంక్షలు. తమ్ముడి మీద ప్రేమతో రంజిత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘త్రికోటì మొదటి సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’కి మ్యూజిక్ నేనే చేశా. ఈ సినిమా విందు భోజనంలా ఉంటుంది. రంజిత్ ఫ్యూచర్లో పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కీరవాణి. ‘‘నాలాంటి కొత్తవాడి సినిమాకు సంగీతం ఇచ్చిన కీర వాణిగారు నాకు దేవుడితో సమానం. బడ్జెట్ విషయంలో భరత్‌గారు వెనకాడలేదు’’ అన్నారు త్రికోటి. రంజిత్ మాట్లాడుతూ –‘‘నా మెదటి సినిమాకు కీరవాణిగారు మ్యుజిక్ ఇవ్వడం నా లక్. మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘ముఖ్య అతిథిగా వచ్చిన వినాయక్‌గారికి, బొత్స సత్యనారాయణ గారికి, అతిథులందరికి కృతజ్ఞతలు. రత్నం గారి డైలాగ్స్ బాగుంటాయి. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత భరత్. -
'జువ్వ' ఆడియో విడుదల
-
కీరవాణి మార్క్ మెలోడి ‘ఓ కల’
‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేం త్రికోటి దర్శకత్వంలో రంజిత్, పలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న సినిమా జువ్వ. ఇటీవల ఈ సినిమా పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. భరత్ సోమి నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతమందించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ మేకింగ్ వీడియోతో పాటు ‘ఓ కల’ అంటూ సాగే మెలోడి సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వశిష్ట్ వర్మ సాహిత్య మందించిన ఈ పాటను కీరవాణి తనయుడు కాలభైరవతో కలిసి దామిని ఆలపించారు. -
‘జువ్వ’ ఫస్ట్‌లుక్ లాంచ్