Jyotikasri
-
నాన్నకు మెడల్ గిఫ్ట్ గా ఇవ్వాలని..
అమ్మాయి అని వెనకడుగు వేయలేదు. తండ్రి కల నెరవేర్చాలనే తపనతో 11 ఏళ్లుగా కఠోర శ్రమ చేసింది. రన్నింగ్ ట్రాక్‌లో చీతాలా పరుగు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఒలింపిక్స్ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది దండి జ్యోతిక శ్రీ. ఉమెన్స్ 400 మీటర్ల రిలే జట్టులో భారత్ తరఫున పోటీ పడటానికి పారిస్ పయనమైంది. తను పుట్టిన తణుకు ప్రాంతానికి ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు సిద్ధమైంది. తణుకు అర్బన్: అథ్లెటిక్స్‌లో రాణించి అందరి మన్ననలు పొందుతున్న దండి జ్యోతికశ్రీ ఈ నెల 26 నుంచి పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పోటీ పడుతోంది. ఆగస్టు తొమ్మిదిన జరిగే మహిళల 400 మీటర్ల రిలేలో జ్యోతికశ్రీ సత్తా చాటనుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జ్యోతికశ్రీ అసామాన్య ప్రతిభతో ఒలింపిక్స్ వరకూ ఎదగడం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. తమ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళ్లడంతో తణుకు ప్రాంతంలోని ప్రజల ఆనందానికి అవధుల్లేవు. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి పేరు తీసుకువస్తుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు. ఇక ఒలింపిక్స్‌కు ఎంపికైన వెంటనే ఆమెకు రాష్ట్రం నలుమూలల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. ప్రస్థానమిలా.. బాడీ బిల్డర్‌గా రాణించాలనుకున్న జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు కోరిక అప్పట్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నెరవేరలేదు. తనకు కుమారుడు జన్మిస్తే మిస్టర్ ఇండియాగా తీర్చి దిద్దాలని అనుకున్నారు. అయితే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె కీర్తి సత్యశ్రీ చదువు పట్ల ఆసక్తి చూపగా.. చిన్న కుమార్తె జ్యోతికశ్రీ చదువు పట్ల మక్కువ చూపిస్తూనే తండ్రి కోరిక మేరకు పాఠశాల స్థాయిలోనే అథ్లెట్‌గా మారింది. 13 సంవత్సరాల వయసులో తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది.అక్కడ కీర్తిశ్రీ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ కట్లపర్తి సీతారామయ్య తరీ్ఫదులో రాటుదేలింది. స్థానిక మాంటిస్సోరీ స్కూలులో 10వ తరగతి పూర్తిచేసేలోగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించింది. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతూ అప్పటి ఆంధ్ర చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ కోచింగ్‌లో అండర్–18 జాతీయ చాంపియన్íÙప్ పోటీల్లో పాల్గొంది. కెన్యాలో నిర్వహించిన యూత్ వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్íÙప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2020లో హైదరాబాద్‌లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ కోచింగ్‌లో బ్యాంకాక్, కెన్యాల్లో జరిగిన పోటీలతో పాటు భారతదేశ పలు ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటి పలు స్వర్ణ, రజత పతకాలు సాధించింది. 2022లో ఇండియన్ క్యాంప్‌లో తర్ఫీదు పొందేలా అర్హత సాధించింది. తాజాగా 2024 మే నెలలో బహమాస్‌లో నిర్వహించిన వరల్డ్ ఉమెన్స్ రిలేలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా ఒలింపిక్స్‌కి అర్హత సాధించి యావత్ దేశాన్ని తన వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 34 మెడల్స్ సాధించగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 50 వరకు మెడల్స్ సాధించింది.నాన్న కోసమే నా పరుగు.. నాన్న కల నెరవేర్చేందుకే నా పరుగు మొదలుపెట్టాను. ఒక కొడుకు ఉంటే తనను క్రీడాకారుడిగా తీర్చిదిద్దేవాడిని అనే నాన్న మాటలు నాలో పట్టుదలను పెంచాయి. దీంతో అథ్లెట్‌గా ఎదగాలనే దృఢ నిశ్చయంతో సాధన చేశాను. నాన్నతో పాటు మా అమ్మ, అక్క ఇచ్చిన సహకారం, కోచ్‌లు అందించిన అత్యున్నతమైన సూచనలు, సలహాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాను. ఈ క్రమంలో ఎప్పటికైనా ఒలింపిక్స్‌కి అర్హత సాధించాలనే సంకల్పంతో ప్రయత్నించాను. భారతదేశం తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సాధించాననే ప్రకటన నాకు చాలా సంతోషాన్నిచ్చి0ది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి నాన్నకు గిఫ్ట్‌గా ఇవ్వాలని సిద్ధమవుతున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ నా కల నెరవేరింది.. నేను సాధించలేకపోయిన గుర్తింపును నా కుమార్తె సాధించాలనే కృషి, పట్టుదల నాలో పెరిగింది. జ్యోతికశ్రీకి ఐఏఎస్, ఐపీఎస్ వైపు వెళ్లాలని చిన్ననాటి నుంచి ఆశ పడింది. నాకు ఇష్టమైన క్రీడారంగంలోకి వచ్చి నా కోరిక నెరవేర్చేందుకు పట్టుదలతో కృషి చేసింది. దేశం మెచ్చే క్రీడాకారిణిలా తనను తీర్చిదిద్దే క్రమంలో నాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నేనెప్పుడూ బెదరలేదు. ఆర్థిక సమస్యలను జయిస్తూ ముందుకు వెళ్లాను. నా కుమార్తె ప్రపంచంతో పోటీపడే స్థాయికి వెళ్లడం ద్వారా నేను కన్న కలలు నిజమయ్యాయి. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలి. – దండి శ్రీనివాసరావు, జ్యోతికశ్రీ తండ్రి -
కాంస్య పతకం సాధించిన జ్యోతిక శ్రీ
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండి జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. కాలికట్లో జరుగుతున్న ఈ మీట్లో జ్యోతిక శ్రీ 53.90 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. కోచ్ నాగపురి రమేశ్ వద్ద జ్యోతిక శ్రీ శిక్షణ తీసుకుంటోంది. -
పట్టుదలే పెట్టుబడిగా...
అథ్లెటిక్స్‌లో కొత్త ఆశాకిరణం జ్యోతికశ్రీ సౌకర్యాలు అంతంత మాత్రం. ఆర్థిక పరిస్థితి నామమాత్రం. ప్రాక్టీస్ కోసం సింథటిక్ ట్రాక్ కూడా లేదు. రోల్ మోడల్‌గా తీసుకోవాలంటే ఆ స్థాయిలో విజయాలు సాధించిన వారు కూడా లేరు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన ప్రతిభనే నమ్ముకుంది. పట్టుదలే పెట్టుబడిగా తన నైపుణ్యానికి పదును పెట్టింది. ఆమె కృషికు సరైన మార్గదర్శకుడు కూడా లభించాడు. ఇంకేం ప్రతికూలతలను అధిగమిస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తూ తన లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఆ అమ్మాయే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల అథ్లెట్ దండి జ్యోతికశ్రీ. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ జ్యోతికశ్రీ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విజయంతో ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించింది. విజయవాడ స్పోర్ట్స్: అథ్లెటిక్స్‌లో తమ ప్రతిభకు తోడు కొన్ని అరుదైన శారీరక లక్షణాలు కూడా ఆటగాళ్లను ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటిదే ‘హార్స్ నీ’. గుర్రాలకు ఉండే తరహా మోకాలుతో అథ్లెట్లకు పరుగెత్తడంలో అదనపు ప్రయోజనం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ దీనిని సమర్థంగా ఉపయోగించుకొని సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 14వ యూత్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 16 ఏళ్ల ఈ అమ్మాయి 400 మీటర్ల పరుగులో (56.7సెకన్లు) స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. దీంతో బ్యాంకాక్‌లో మే 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఆసియా యూత్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జ్యోతిక తండ్రి శ్రీనివాసరావుకు తణుకులో ఇనుప బీరువాలు, కప్‌బోర్డులు తయారు చేసే చిన్న కార్ఖానా ఉంది. తల్లి లక్ష్మీనాగ వెంకటేశ్వరి గృహిణి. బాడీ బిల్డింగ్‌లో ఒకప్పుడు రాణించిన తండ్రి అథ్లెటిక్స్‌లో జ్యోతిక ఆసక్తిని చూసి ప్రోత్సహించారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సీతారామయ్య ఈ సమయంలో తగిన శిక్షణ అందించారు. వరుస విజయాలు... అథ్లెటిక్స్‌లో ప్రాథమికాంశాలు నేర్చుకున్న తర్వాత ముుందుగా జూనియర్ స్టేట్ మీట్లో 200, 400 మీటర్ల విభాగాల్లో జ్యోతిక స్వర్ణపతకాలు సాధించింది. అనంతరం గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో కూడా అదే జోరును కొనసాగించి మరో రెండు స్వర్ణాలు అందుకుంది. 2015లో విశాఖపట్నంలో జరిగిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో 1000 మీటర్ల పరుగులో కాంస్య పతకం పొందింది. 2015లో కాకినాడలో జరిగిన సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో అండర్–16 విభాగంలో 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకం, అదే ఏడాది కృష్ణా జిల్లా గుడివాడలో ‘పైకా’ నేషనల్స్‌లో 400 మీటర్లలో స్వర్ణపతకం కైవసం చేసుంది. 2015–16లో కేరళలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో కూడా రజత పతకం సాధించింది. అనంతరం టర్కీలో జరిగిన వరల్డ్ స్కూల్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్లో సెమీస్ వరకు చేరుకుంది. 2016లో కరీంనగర్లో జరిగిన సౌత్‌జోన్ నేషనల్స్‌లో 400 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం, రిలేలో కాంస్య పతకం సాధించింది. మరింత సాధన... నిలకడైన విజయాలతో రాణిం చిన జ్యోతికశ్రీ రెండు వారా ల పాటు జంషెడ్‌పూర్‌లోని టాటా స్పోర్ట్స్ అకాడమీలో ప్రత్యే క శిక్షణ పొందింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి విజయవాడలోని ‘సాయ్’ అథ్లెటిక్స్ కోచ్ డీఎన్వీ వినాయక ప్రసాద్‌ను సంప్రదించారు. ఇక్కడినుంచి శిక్షణతో పాటు ఆమె చదువు కూడా కొనసాగింది. అథ్లెటిక్స్‌లో ప్రాక్టీస్‌తో పాటు చదువుకు కూడా ఆటంకం కలగకుండా ఆమె సాధన చేసింది. మార్చి లో పరీక్షల అనంతరం వెంటనే ఏప్రిల్‌లో యూత్ నేషనల్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం జ్యోతిక పట్టుదలకు నిదర్శనం. ప్రాక్టీస్‌తో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ఆమె ప్రత్యేక దృష్టి పెట్టింది. సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ ప్రసాద్ ఈ దశలో ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఆసియా యూత్ అథ్లెటిక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, అక్కడ కూడా కచ్చితంగా పతకం గెలుచుకుంటానని జ్యోతిక ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని ఆమె చెప్పింది. జ్యోతికది తీవ్రంగా కష్టపడే స్వభావం. ఇదే ఆమెకు వరుస విజయాలు అందిస్తోంది. యూత్ అథ్లెటిక్స్‌లో విజయం పెద్ద ఘనతగా భావిస్తున్నాం. ఏపీ రాష్ట్రంలో ఒక్క సింథటిక్ ట్రాక్ లేకపోయినా మట్టిలో, రోడ్లుపై సాధన చేసి మరీ జ్యోతిక తన సత్తాను చాటింది. ఆమె ఆటలో చిన్న చిన్న లోపాలు సరిదిద్ది అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. –కోచ్ డీఎన్వీ వినాయక ప్రసాద్