భూమి గుల్ల.. భద్రత డొల్ల
చమురు సంస్థల తీరుతో కేజీ బేసి¯ŒS తీరానికి శాపం
నిత్య ప్రమాదాలతో భద్రతలేని జీవనం
అభివృద్ధికి అక్కరకు రాని సీఎస్సార్ నిధులు
మొండిచేయి చూపిస్తున్న చమురు సంస్థలు
పార్లమెంట్ కమిటీ సభ్యులూ...మీరైనా చేస్తారా న్యాయం
కృష్ణా – గోదావరి బేసి¯ŒS (కేజీ బేసి¯ŒS).. దేశ ఆదాయానికి అక్షయపాత్ర. అపార చమురు, సహజవాయువులు నిక్షిప్తమైన గని. తూర్పుతీరంలో ప్రపంచస్థాయిలో చమురు, సహజవాయుల పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసింది. వెలికితీసే కొద్దీ లక్షల కోట్ల రూపాయిల ఆదాయాన్ని అందించే కేజీ బేసి¯ŒS దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచింది. ఇదంతా నాణానికి ఓ వైపు ఉన్న వెలుగులు..
చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని రైతుల అపోహలు.. బ్లో అవుట్లు, గ్యాస్ పైపులైన్ల లీకేజ్‌లతో జీవనానికే భద్రతలేకుండా పోయిందనే భయాలు.. పచ్చని కోనసీమలో కాలుష్య కాసారంగా మార్చేశారనే ఆరోపణలు.. కోట్లు కొల్లగొడుతూ స్థానికాభివృద్ధిని గాలికి వదిలేసిందనే ఆవేదనలు... రహదారులను ఛిద్రం చేసేశారనే విమర్శలు.. ఇవన్నీ నాణానికి మరోవైపు అలముకున్న చీకట్లు... పార్లమెంటరీ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– అమలాపురం
కోనసీమ ఓ ‘మండు’పాతర..
పచ్చని కోనసీమ ఇప్పుడొక మందుపాతరగా మారింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజవాయువులను తరలించేందుకు కోనసీమలో వందల కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసుకుపోయారు. వీటి నాణ్యత విషయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)తోపాటు చమురు సంస్థలు రాజీపడడం అవి ఎప్పుడు? ఎక్కడ? లీవువుతాయో అనే భయం స్థానికులను వెన్నాడుతోంది. కోనసీమలో, మరీ ముఖ్యంగా రాజోలు దీవిలో గ్యాస్ లీకేజ్‌లు నిత్యకృత్యంగా మారిపోయాయి. నగరం దుర్ఘటనకు గ్యాస్పైల్లై¯ŒS పేలడం కారణం. ఇవి కాకుండా సిస్మిక్ సర్వేలపేరుతో నిరంతరం జరిగే బాంబింగ్‌లు కూడా కోనసీమవాసులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి.
కాలుష్యం ముప్పులో...
చమురు, సహజవాయువుల వెలికితీత వల్ల పచ్చని కోనసీమ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. సముద్రగర్భం (ఆఫ్‌షోర్)లోనే కాకుండా భూమి మీద (ఆ¯ŒSషోర్)లో ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పైప్లైన్ల ఏర్పాటుతో కొబ్బరితోట, పచ్చని చేలను తొలగిస్తోంది. దీనికితోడు చమురు శుద్ధి తరువాత వచ్చే చమురు మడ్డిని సముద్రంలోకి, కాలువల్లో వదలడం వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. అలాగే సంస్థల వద్ద వృథాగా ఉండే గ్యాస్ మండించడం వల్ల కూడా గాలిలో తేమ తగ్గి వేడిగా మారుతోంది. ఈ కారణంగా గడిచిన పదేళ్లకన్నా కోనసీమలో సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు శాతం పెరిగాయి.
అక్కరకు రాని సీఎస్ఆర్ నిధులు
ఓఎన్జీసీ ఏటా దాదాపు రూ.600 కోట్ల్ల లాభాన్ని ఆర్జిస్తోంది. లాభంలో రెండు శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పా¯Œ్సబులిటీ (సీఎస్ఆర్)కి విధిగా కేటాయించాలి. అంటే కేజీ బేసి¯ŒSలో ఆ సంçస్థ రూ.12 కోట్ల వరకూ సీఎస్ఆర్ నిధులు కేటాయించాల్సి ఉంది.
గెయిల్ పైపులైన్లు అధికంగా కోనసీమలోనే ఉన్నాయి. 1998లో వేసిన ఈ పైపులైన్లను గెయిల్ ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగిస్తోంది. నగరంలో గ్యాస్ పైపులైను విస్ఫోటం తర్వాత కూడా ఆ సంస్థ పైపులైన్ల పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం.
గైయిల్ పైపులైన్లు కోనసీమలో అధికంగా ఉంటే ఆ సంస్థ విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి రూ.50 లక్షలు సీఎస్ఆర్ కింద ఇచ్చింది. అదే కోనసీమలో పైపులైను పేలిపోయి నగరంలో 29 మంది చనిపోయిన పరిస్థితుల్లో ఆ సంస్థ స్థానికంగా ఆస్పత్రి నిర్మాణానికి నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తోంది.
మామిడికుదురు మండలం నగరంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ కార్యరూపం లేదు.
గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేష¯ŒS తన ప్రాజెక్టు కాస్ట్లో ఒక శాతం నిధులు సీఎస్సార్గా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు కాస్ట్లో ఒక శాతం అంటే రూ.40 కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో 60 శాతం కోనసీమకు, 40 శాతం పాండిచ్ఛేరి పుదుచ్ఛేరి యానానికి ఇవ్వాల్సి ఉంది. అవి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు.
రిలయి¯Œ్స చమురు సంస్థ 2008లో అమలాపురం పార్లమెంట నియోజకవర్గ పరిధిలోని భైరవపాలెం, గాడిమొగ ప్రాంతాలను దత్తత తీసుకుంది. చిత్రమేమిటంటే గాడిమొగ ప్లాంట్‌కు రిలయ¯Œ్స వారి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రూ.22 కోట్లతో రోడ్డు నిర్మించుకుని ఆ నిధులను సీఎస్ఆర్ నిధులుగా చూపించి నయవంచన చేసిందనే ఆరోపణలున్నాయి.
రూ.45 వేల కోట్ల ప్రాజెక్టైన రిలయ¯Œ్స భైరవపాలెంలో రూ.75 లక్షలతో కల్యాణ మండపం, గాడిమొగలో రూ.మూడు కోట్లతో పీహెచ్‌సీని సీఎస్ఆర్తో నిర్మిస్తామన్నారు. పూర్తి చేయలేదు.
ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో కెయిర్న్ ఎనర్జీ సంస్థ గ్రామంలో 200 ఎకరాల్లో గ్రీ¯ŒS బెల్ట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా... 23 ఏళ్లుగా దానిని పట్టించుకోవటంలేదు. గ్రామంలో డ్రైన్ల నిర్మించకుండా రోడ్లు వేయడం వల్ల వర్షాకాలం ముంపులో ఉండిపోతున్నాయి.
1995 నుంచి ఏడాదికి రూ.కోటి సీఎస్ఆర్ ఎస్.యానాం గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వాల్సి ఉండగా ఏ ఏడాదికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు.
విషాదాలకు ముగింపు ఎప్పుడు?
l చమరు సంస్థల కార్యకలాపాలు ఆరంభమైన తరువాత జరిగిన అది పెద్ద ఘటన పాశర్లపూడి బ్లోఅవుట్. ఈ ప్రమాదం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1995లో జరిగిన ఈ ఘటన కోనసీమవాసులకు ఇక్కడ జీవనం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసింది. సుమారు రూ.వంద కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దేవర్లంకతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్లు బీటలు వారి నష్టపోయారు.
∙ అమలాపురం మండలం తాండవపల్లిలో 2006లో బ్లో అవుట్ జరిగింది. ఒక రోజులోనే మంటలు అదుపులోకి వచ్చినా పాశర్లపూడి బ్లో అవుట్ స్థాయిలో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఓఎన్జీసీకి సుమారు రూ.50 కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది.
మామిడికుదురు మండలం నగరంలో 2014 జూ¯ŒS 27న గ్యాస్పైప్లై¯ŒS పేలుడు ఘటన 29 మందిని పొట్టనబెట్టుకుంది. కోనసీమలో ఇదే అత్యంత విషాదకరమైన ఘటన. ఇందుకు చమురు సంస్థల నిర్లక్ష్యమే కారణం.
ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు
చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ముందుగా నష్టపోయిదే మత్స్యకారులే. సముద్రగర్భంలో రిగ్గింగ్, భారీ ఓడలు, పడవులు రాకపోకలకు వీలుగా సముద్రతీరం, గోదావరి నదీపాయల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల అపార మత్స్యసంపద లేకుండా పోతోంది. వారం వేటాడినా గతంలో వచ్చే మత్ససంపదలో సగం కూడా రావడం లేదని, జీవనం గగనంగా మారిందని మత్స్యకారులు వాపోతున్నారు. ఆయా చమురు సంస్థలు తమ కార్యకలాపాలు ఆరంభించిన రోజుల్లో కొద్ది నెలల పాటు మత్స్యకారులకు పరిహారం చెల్లించినా తరువాత పట్టించుకున్న పాపానపోలేదు.
భూమి కుంగిపోతుందా?
ఓఎన్జీసీ, ఇతర చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని, భవిష్యత్తులో తీరంలో భూములు లేకుండా పోతాయని కోనసీమ వాసుల ప్రధాన ఆరోపణ. భూమి కుంగిన కారణంగా కొద్దిపాటి వర్షానికే తమ చేలు ముంపుబారిన పడడం, తుపాన్ల సమయంలో సముద్రం పోటెత్తి ఉప్పునీరు చేలను ముంచెత్తుతోందంటున్నారు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వరిచేలు ఉప్పుబారిన పడుతున్నాయి. వీటిలో రెండు వేల ఎకరాల్లో రైతులు రెండుపంటల సాగును వదిలేశారు. చమురు, సహజవాయువుల వెలికితీసే సమయంలో భూమి అగాధంగా మారుతోంది. దీనిని వాటర్ ఇంజెక్ష¯ŒS విధానంలో ఇసుకను నింపాల్సి ఉన్నా చమురు సంస్థలు సొమ్ములు మిగుల్చుకునే ఉద్దేశంతో చేయడం లేదని రైతుల ఆరోపణ. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని ఇటీవల కోనసీమలో పర్యటించిన పర్యావరణ, భూగర్భ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించడం, ఇందుకు పలు ఉదాహరణలు చూపడం విశేషం.
ఈ చిత్రం చూశారా? ఎస్.యానాంలో చమురు, సహజ వాయువుల ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీ çకమ్యూనిటీ సోషల్ రెస్పా¯Œ్సబులిటీ (సీఎస్ఆర్) నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన ఆస్పత్రి ఇది. నిర్మించి ఆరేళ్లు పూర్తవుతున్నా ఈ ఆస్పత్రి ప్రారంభం కాలేదు. వైద్యులు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి నిర్మాణం వరకే తమ బాధ్యతని వైద్యం తమకు సంబంధంలేదని చమురు సంస్థ చేతులు దులుపుకొంది. చమురు సంస్థల వల్ల స్థానికులకు కలుగుతున్న ప్రయోజనాన్ని ఈ భవనం తేటతెల్లం చేస్తోంది.
ధ్వంసమవుతున్న రోడ్లు
ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల గ్రామీణ, ఆర్అండ్బీ రహదారులు ధ్వంసమవుతున్నాయ. అమలాపురం–ఎస్.యానాం, అమలాపురం– ఓడలరేవులతోపాటు కాట్రేనికోన, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో పలు రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. కనీసం తమ సంస్థ వాహనాలు తిరిగే రహదారులను సైతం చమురు సంస్థలు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.