k keshav rao
-
ఆషాఢం తర్వాతే..! కేబినెట్ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్ పదవుల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. తాజా భేటీలోనూ తేలని సమీకరణలు రాష్ట్ర కేబినెట్లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది. ఇలాగైతే ఏం చేయాలి..? నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్‌కుమార్ గౌడ్, గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌ను కేబినెట్లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పీసీసీ సైతం వాయిదానే.. బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్‌ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్ అంశంపై హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ గూటికి కేకే – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే – కేకే అనుభవం కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కుపై రిట్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్‌గా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) వేసిన ఓటు చెల్లదని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజ్యసభ సభ్యుడిగా కేకేను.. ఏపీకి కేటాయించారని, ఆయన ఓటును రద్దు చేయాలని కోరుతూ బీజేపీకి చెందిన కౌన్సిలర్లు రిట్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ఎన్నికల అధికారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ బి.వెంకట్రెడ్డిలను పేర్కొన్నారు. కేకే ఓటు వేయడానికి అనుమతించిన ఎన్నికల అధికారి ఎస్.రాజేశ్వర్‌రెడ్డి అనుమతి ఇవ్వడాన్ని మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 (2), (3)కు వ్యతిరేకమని ప్రకటించాలని కోరతూ రాజుమోనిరాజు సహా ఎమిమిది మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. మధుమోహన్, వెంకట్‌రెడ్డి.. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నిక అయ్యేందుకు ఎక్స్అఫీషియో మెంబర్‌గా కేకే ఓటు కీలకమైందని, ఏపీకి చెందిన ఎంపీగా కేకే ఉన్నందున ఆయన తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎన్నికల అధికారి అనుమతించడం చెల్లదని ప్రకటించాలని కోరారు. -
టీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా కేకే
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా డాక్టర్ కె. కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు ఎన్నికయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రాజ్యసభలో టీఆర్ఎస్ నాయకుడిగా కేశవరావు వ్యవహరించనున్నారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ భేటీలో చర్చించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న 5వ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో హాజరయ్యేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశముంది. -
బాత్రూమ్లో జారిపడ్డ కేశవరావు
హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం కేశవరావు బాత్రూమ్లో జారిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది. కేశవరావు ఈ రోజంతా బిజీగా గడిపారు. ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్‌తో కలసి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. -
టీఆర్ఎస్ అభ్యర్థిగా కేకే నామినేషన్
పలు పార్టీల మద్దతు కోరిన టీఆర్ఎస్ సురవరానికి కేసీఆర్ కృతజ్ఞతలు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కే కేశవరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్, సీపీఐ శాసనసభ్యులు, ఎంపీ వివేక్, కాంగ్రెస్‌కు చెందిన మాజీమంత్రి పి.శంకర్రావుతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను కేకే కలిశారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డికి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. సురవరంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ వచ్చినప్పుడు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బర్దన్‌ను కూడా కలుస్తానని కేసీఆర్ ఆయనకు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు కూడా కేసీఆర్ ఫోన్లోనే కృతజ్ఞతలు చెప్పారు. కేకే నామినేషన్ అనంతరం టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వివిధ శాసనసభాపక్ష నాయకుల్ని కలిశారు. తమ అభ్యర్ధి గెలుపునకు సహకరించాల్సిందిగా వారిని కోరారు. టీ వాదులు కేకేను గెలిపిస్తారు మా పార్టీ తరఫున బరిలోకి దింపిన కె.కేశవరావును తెలంగాణవాదులంతా కలసి గెలిపిస్తారని భావిస్తున్నాం. మద్దతు కోసం బీజేపీ, ఎంఐఎంలను సంప్రదించాం. టీఆర్ఎస్కు మద్దతిచ్చినందుకు సీపీఐకి ధన్యవాదాలు. - ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు రాజ్యసభ ఎన్నికల్లో కేశవరావుకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ కోరారు. మద్దతు విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎవరికి మద్దతిచ్చేది ప్రకటిస్తాం. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వమే రెండుగా చీలింది కేశవరావుకు తెలంగాణ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది. మా పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు ఓటు వేస్తారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత, కాంగ్రెస్ అధిష్టానం నాటకాలతో రాష్ట్ర ప్రభుత్వమే రెండుగా చీలింది. రాష్ట్ర మంత్రులు సైతం స్పీకర్ పోడియం వద్దకెళ్లి ఆందోళన చేయాల్సిన దుస్థితి. - నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మా పార్టీ నాయకులను అడగండి రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతిచ్చిందని, మీరూ ఇవ్వాలని ఈటెల రాజేందర్ కోరారు. మా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని, పార్టీ నాయకత్వాన్ని సంప్రదించమని చెప్పాను. ఎవరికి మద్దతివ్వాలో మా పార్టీ కేంద్ర నాయకులే చెబుతారు. వారినే మద్దతు అడగండి. - జూలకంటి రంగారెడ్డి, సీపీఎం శాసనసభాపక్ష నేత -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి కేకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావును పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు ఆదివారం ప్రకటించారు. కేసీఆర్ శనివారం కేకేతో సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడుతున్న టీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్, టీడీపీల కంటే ముందే తన అభ్యర్థిని ప్రకటించింది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి ఎన్నిక కావాలంటే కనీసం 40 మంది ఎమ్మెల్యేల (కోటా ఓట్లు) తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కానీ, టీఆర్ ఎస్‌కు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరికి తోడు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇటీవలే పార్టీలో చేరడంతో పాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తుండడంతో పార్టీ బలం 22కు చేరింది. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం, సీపీఐ (నలుగురు), బీజేపీ (నలుగురు) మద్దతు లభిస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరముండగా.. కాంగ్రెస్, టీడీపీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కొందరి నుంచి స్పష్టమైన మద్దతు కూడగట్టిన తర్వాతనే పోటీ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుస్తామన్న ధీమాతోనే తమ పార్టీ అభ్యర్థిని నిలుపుతున్నట్టు పార్టీ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ చెప్పారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిస్తే పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని సీపీఐ, బీజేపీ నేతల్లో తర్జనభర్జన సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం నాలుగో స్థానం కోసం ఎవరినీ పోటీలోకి దింపకుండా చేయడానికే టీఆర్ఎస్ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించిందన్న కూడా వినిపిస్తోంది.