బాత్రూమ్లో జారిపడ్డ కేశవరావు
హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం కేశవరావు బాత్రూమ్లో జారిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.
కేశవరావు ఈ రోజంతా బిజీగా గడిపారు. ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్తో కలసి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.