K L Rahul
-
CSK Vs LSG Photos: ధోని మెరుపులు వృథా.. లక్నో ‘సూపర్’ విజయం (ఫొటోలు)
-
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ బర్త్‌డే.. అరుదైన ఫొటోలు
-
కే ఎల్ రాహుల్ అవుట్...ఎల్ఎస్ జీ లోకి కొత్త ప్లేయర్
-
రాహుల్ వర్కౌట్లకు అతియా అదిరిపోయే రెస్పాన్స్..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా అపెండిసైటిస్‌తో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే కోలుకుని తేలికపాటి కసరత్తులు ప్రారంభించాడు. ఈ సందర్బంగా తాను తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కెటిల్ బాల్‌తో తేలికపాటి కసరత్తులు చేస్తున్న చిత్రంతో పాటు సేదతీరుతున్న క్యాండిడ్ చిత్రాలను షేర్ చేస్తూ.. And still, We Rise అనే క్యాప్షన్ ను జోడించాడు. ఈ పోస్ట్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గంటల వ్యవధిలో వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అయితే రాహుల్ పోస్ట్ కు అతని అంతరంగ స్నేహితురాలు అతియా శెట్టి పెట్టిన కామెంట్ నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షింది. ఆమె మరీ భిన్నంగా రెస్పాండ్ కాలేదు, కేవలం స్మైలీ ఏమోజీ పెట్టి వదిలేసింది. అయినప్పటికీ ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా, బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ బాహటంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా రాహుల్ పెట్టిన పోస్ట్‌కు అతియా స్పందించడంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ లో పర్యటించాల్సిన భారత జట్టులో కే ఎల్ రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియాతో పాటు అతను కూడా లండన్ ఫ్లైట్ ఎక్కాలంటే ఫిట్ నెస్ పరీక్షలో పాస్ కావాల్సి ఉంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: WTC FINAL: డ్రా అయితే ఆరో రోజు కూడా..? -
రాహుల్‌ను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో తెలుసా..?
ముంబై: గత మూడు ఐపీఎల్ సీజన్లలో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. నేడు ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో మరో 78 పరుగులు సాధిస్తే, పంజాబ్ తరఫున 2000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో షాన్ మార్ష్ మాత్రమే పంజాబ్ తరఫున 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2018 నుంచి 2020 వరకు జరిగిన ప్రతి సీజన్లో 500కుపైగా పరుగులు సాధించిన రాహుల్.. పంజాబ్ తరఫున 42 ఇన్నింగ్స్‌ల్లో 140.08 స్ట్రయిక్ రేట్‌తో 1922 పరుగులు సాధించాడు. 2018లో తొలిసారి పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. ఆ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 158.41 స్ట్రయిక్ రేట్‌తో 659 పరుగులు సాధించి, టోర్నీలో మూడో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 అర్ధసెంచరీలున్నాయి. అనంతరం జరిగిన 2019 సీజన్లో కూడా రాహుల్ తన హవాను కొనసాగించాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన అతను.. సెంచరీ, 6 అర్ధసెంచరీల సాయంతో 593 పరుగులు స్కోర్ చేశాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనూ రాహుల్ పరుగుల వరద పారించాడు. తాను ఆడిన 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 670 పరుగులు సాధించాడు. రాహుల్ ప్రస్తుత సీజన్లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి మరో 555 పరుగులు సాధిస్తే, ఐపీఎల్లో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలుస్తాడు. ఓవరాల్ టీ20 క్రికెట్లో రాహుల్ 139 ఇన్నింగ్స్‌ల్లో 137.51 స్ట్రయిక్ రేట్‌తో 4842 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్లో అతను మరో 158 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్లో యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్ తర్వాత 5000 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. రాహుల్ మరో 8 సిక్సర్లు బాదితే టీ20 ఫార్మాట్లో 200 సిక్సర్ల అరుదైన జాబితాలో చోటు సంపాదిస్తాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 2647 పరుగులు(72 ఇన్నింగ్స్) సాధించిన రాహుల్.. మరో 353 పరుగులు చేస్తే ఐపీఎల్ 3000 పరుగుల క్లబ్లో చేరతాడు. ఇదిలా ఉంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా రాహుల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో అతనాడిన 4 మ్యాచ్‌ల్లో 80.67 సగటుతో 242 పరుగులు సాధించాడు. ఈ వేదికపై శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు(105.5) మాత్రమే రాహుల్ కంటే ఉత్తమ సగటు ఉంది. -
మరోసారి కేఎల్ రాహుల్ విధ్వంసం ఖాయం: పంజాబ్ కోచ్
ముంబై: గతేడాది ఐపీఎల్లో పరుగుల వరద(14 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 670 పరుగులు) పారించి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీమ్ జాఫర్ జోస్యం చెప్పాడు. అయితే గత సీజన్లో తన సామర్థ్యానికి భిన్నంగా 129.35 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడంతో విమర్శలపాలైన రాహుల్.. ఈ సీజన్లో దానిపై దృష్టిసారిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్లో మాక్స్వెల్ ఫామ్‌లేమి, ఐదో నంబర్ తర్వాత విధ్వంసకర ఆటగాడు లేకపోవడం వంటి సమస్యలతో రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందని, ఈ సీజన్లో అలాంటి సమస్యలేవీ లేకపోవడంతో రాహుల్ విధ్వంసం ఖాయమని జాఫర్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు ఒడిదుడుకులు ఎదుర్కోవడం సాధారణమేనని, ఏ ఆటగాడికైనా ఇలా జరుగుతుందని జాఫర్ వివరించాడు. రాహుల్ మూడు ఫార్మాట్లలో మంచి స్ట్రయిక్‌రేట్‌తో శతకాలు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో విఫలమైనా వన్డేల్లో దూకుడుగా ఆడాడని, అది పంజాబ్ కింగ్స్‌కు శుభసూచకమని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబై వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీకొంటాయి. చదవండి: ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం.. -
ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్
-
రాజస్తాన్ రాయల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపు
-
సన్‌రైజర్స్ పై పంజాబ్ విజయం
-
సెంచరీ భాగస్వామ్యం టీమిండియాకు కీలకం
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయ సెంచరీ భాగస్వామ్యం జట్టుకు చాలా కీలకమని భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ పేర్కొన్నాడు. 126/5 తో ఉన్న భారత్‌ను అశ్విన్, సాహా విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారని, బ్యాట్స్ మన్ ఇప్పుడైనా బాధ్యతాయుతంగా క్రీజులో నిలవాలని సూచించాడు. 180-200 పరుగుల లోపే టీమిండియా ఆలౌట్ అవుతుందని తాను భావించానని, అయితే అశ్విన్, సాహా ఆరో వికెట్ కు అజేయ సెంచరీ(108) భాగస్వామ్యంతో భారత్ తిరిగి కోలుకుందన్నాడు. 'బ్యాటింగ్ కు దిగిన వెంటనే పిచ్ పరిస్థితి అర్థం చేసుకున్నాను. పరుగులు చేయడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ విండీస్ పై ఒత్తిడి పెంచాలనుకున్నాను. విండీస్ బౌలర్లు రాణించారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో ఇబ్బందిపెట్టారు' అని రాహుల్ వివరించాడు. ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా చివరికి తొలిరోజు ఆటతో చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. లోకేష్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. -
కొత్త బాధ్యత
జింబాబ్వేతో సిరీస్‌కు ధోనియే కెప్టెన్ ► తొలిసారి జట్టులోకి ఆరుగురు ► ఫైజ్ ఫజల్‌కు అనూహ్య అవకాశం దాదాపు తొమ్మిదేళ్ల కెప్టెన్సీలో దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన సమకాలికులతోనూ, జూనియర్లతోనూ జట్లను నడిపించి అద్భుత విజయాలు సాధించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. కెరీర్ చివర్లో ఇప్పుడు మరింత మంది కొత్త కుర్రాళ్లకు మార్గదర్శనం చేసే బాధ్యతను అతనిపై బీసీసీఐ పెట్టింది. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటించనున్న ‘యంగ్ బ్రిగేడ్’ను అతను నడిపించనున్నాడు. ఈ బృందంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తొలిసారి ఎంపికైనవారు ఆరుగురు ఉండటం విశేషం. ముంబై: వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచి కుర్రాళ్లను గుర్తించి, తీర్చిదిద్దాలని బీసీసీఐ నిర్ణయించిందా...లేక రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువగా టెస్టులు మాత్రమే ఆడనుంది కాబట్టి విరామం వద్దంటూ ధోని తానే సిద్ధమయ్యాడా...ఈ సిరీస్‌తో అతని కెప్టెన్సీ ముగుస్తుందా... కారణమేదైనా వన్డే, టి20 సిరీస్‌ల కోసం 16 మంది సభ్యుల జట్టు ప్రకటన కాస్త ఆశ్చర్యపరిచింది. గత ఆస్ట్రేలియా పర్యటననుంచి టి20 ప్రపంచ కప్ వరకు భారత వన్డే, టి20 జట్టులో సభ్యులుగా ఉన్న 17 మందిని ఈ సిరీస్‌కు పక్కన పెట్టడం విశేషం! సీనియర్లలో ధోని ఒక్కడే ఇప్పుడు జింబాబ్వేకు వెళుతున్నాడు. జూన్ 11నుంచి 22 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 3 టి20ల్లో జింబాబ్వేతో తలపడుతుంది. ధోనిలో మూడో వంతు ఈ టూర్ కోసం ఎంపికైన జట్టులో ధోని ఒక్కడే 275 వన్డేలు, 68 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 వన్డేలు, 28 టి20లు మాత్రమే. ఈ జట్టుకు ఎంత అనుభవం ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. ‘మేం ఎవరికీ విశ్రాంతి ఇవ్వలేదు. ఏ ఆటగాడు కూడా తాను అందుబాటులో ఉండనని, తనను ఎంపిక చేయవద్దని కోరలేదు కూడా. జింబాబ్వేకు యువ జట్టును, విండీస్‌కు మరో జట్టును ఎంపిక చేయడమనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయమే’ అని కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. అయితే వన్డేలు, టి20లు రెగ్యులర్‌గా ఆడుతున్న కోహ్లి, రోహిత్, అశ్విన్, ధావన్‌లాంటి ఆటగాళ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా క్రికెట్ ఆడని రైనా, యువరాజ్, జడేజా, భువనేశ్వర్‌లను ఎందుకు పక్కన పెట్టినట్లో! పైగా వరల్డ్ కప్ మొత్తం కూర్చున్నా ఒక్క మ్యాచ్ ఆడని హర్భజన్, నేగి, ఇంకా కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్ పాండ్యాలను కూడా తప్పించి సెలక్టర్లు ఏం చెప్పదల్చుకున్నారు? అటు విశ్రాంతి కాకుండా ఇటు వేటు వేయకుండా 17 మందిని పక్కన పెట్టడం నిజంగా ఆశ్చర్యకరం. ఎలా వచ్చారంటే..? జట్టు సభ్యులలో కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో రెగ్యులర్ కాగా, వన్డేలకు మాత్రం ఇప్పుడే ఎంపికయ్యాడు. ఐపీఎల్లో చెలరేగడం అతనికి కలిసొచ్చింది. కరుణ్ నాయర్ గత ఏడాది శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా, మ్యాచ్ లభించలేదు. ఇతనూ ఐపీఎల్ ప్రదర్శనతోనే వచ్చాడు. మిగతా నలుగురు మన్దీప్ సింగ్, యజువేంద్ర చహల్, జయంత్ యాదవ్, ఫైజ్ ఫజల్లకు భారత జట్టు పిలుపు రావడం ఇదే తొలిసారి. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలవడం మన్‌దీప్‌కు, ఐపీఎల్లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండటం చహల్ ఎంపికకు కారణమయ్యాయి. టి20ల్లో 6కంటే తక్కువ ఎకానమీ ఉన్న హర్యానా ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌కు మొదటి అవకాశం దక్కింది. 2011 తర్వాత ఐపీఎల్లో ఏ జట్టుకూ ఆడని 30 ఏళ్ల ఫైజ్ ఫజల్‌కు తొలిసారి టీమిండియా చాన్స్ రావడం విశేషం. విదర్భ జట్టుకు చెందిన ఫజల్ ఈ ఏడాది నాలుగు దేశవాళీ టోర్నీలు ఇరానీ, దేవధర్, విజయ్‌హజారే, ముస్తాక్ అలీలో నిలకడగా రాణించాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్‌లో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. జింబాబ్వేతో వన్డే, టి20లకు జట్టు ఎంఎస్ ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, మనీశ్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనాద్కట్, యజువేంద్ర చహల్. ► జింబాబ్వే సిరీస్ షెడ్యూల్ జూన్ 11: తొలి వన్డే, జూన్ 13: రెండో వ న్డే జూన్ 15: మూడో వన్డే, జూన్ 18: తొలి టి20 జూన్ 20: రెండో టి20, జూన్ 22: మూడో టి20 8 అన్ని మ్యాచ్ లు హరారేలో జరుగుతాయి. 8 వన్డేలు మ. 12.30 నుంచి, టి20లు సా. 4.30 నుంచి. దేశవాళీ ప్రతిభకు గుర్తింపు: గవాస్కర్ న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన కోసం భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లను జాతీయ సెలక్షన్ కమిటీ గుర్తించడం అభినందనీయమని అన్నారు. ‘దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లను ఎంపిక చేయడం సంతోషం కలిగించింది. ఐపీఎల్ కూడా దేశవాళీయే అని వాదిస్తారు. కానీ రంజీ, ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో చూపిన ప్రదర్శనను జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలి’ అని అన్నారు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ, శార్దూల్ ఠాకూర్. ► వెస్టిండీస్‌లో టెస్టులు జూలై-ఆగస్టులో జరుగుతాయి. ఇంకా తేదీలు, వేదికలు ఖరారు కాలేదు.