k viswanath sound recordist
-
'అలా అయితే.. కె విశ్వనాథ్ సగం హైదరాబాద్ కొనేసేవారు'
కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రతి సినిమా ఆణిముత్యమే. అంతా దర్శక ప్రతిభతో సినిమాలు తెరకెక్కించారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి ఆయన తన సినిమాలకు తీసుకున్న పారితోషికం తీసుకునేవారు. అప్పట్లో ఆయన సినిమాలకు ఎంత పారితోషికం ఇచ్చేవారో ఓసారి పరిశీలిద్దాం. అలా అయితే కోట్ల బంగ్లా ఉండాల్సింది కె విశ్వనాథ్ మొదటి నుంచీ కొన్ని సిద్ధాంతాలకు పరిమితమైపోయారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోకుండా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమానే చేసేవారు. 'శంకరాభరణం' తర్వాతవచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని ఉంటే.. అప్పటికే సగం హైదరాబాద్ కొనేసేవాడినని ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ఆయన చేసినవన్నీ దాదాపు రిస్కీ ప్రాజెక్టులే. అందుకే ఏనాడూ భారీ పారితోషికాలు కావాలని డిమాండ్ చేసేవారు కాదట. వాళ్లు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకునేవారట. ఆయన జీవితం మొత్తం అలానే సాగిపోయింది. ఆయన సక్సెస్ రేటు, చేసిన సినిమాల సంఖ్యను బట్టి చూస్తే కచ్చితంగా ఫిల్మ్ నగర్లో కోట్లు విలువ చేసే బంగ్లా ఉండాల్సిందే. ఆ విషయంలో చాలా బాధ పడేవారు ఎందుకంటే ఇప్పుడున్నవాళ్లతో పోల్చు కుంటే చాలా బాధగా ఉంటుందని అనేవారు. అది మానవ నైజమని.. ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదు? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటూందని చెప్పేవారు. మళ్లీ వెంటనే మనసుకు సర్ది చెప్పుకునేవారు. ఒక్కసారి ఆ డబ్బు మాయలో పడిపోతే సృజతనాత్మకత పక్కకు వెళ్లిపోతుందని ఆయన అభిప్రాయం. అందుకే ఓసారి చిరంజీవి ఆయనతో ఇలా అన్నారట. మేమంతా అండగా ఉంటాం. సొంతంగా సినిమా చేసుకోండి అన్నారట. అప్పుడు కె విశ్వనాథ్ తన వల్ల కాదని చెప్పేశారు. ఆయన అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా? అప్పట్లో కె.విశ్వనాధ్ తీసుకున్న పారితోషికంపై అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. ఈ విషయంపై ఆయనను ప్రశ్నిస్తే.. అది మీరడగకూడదు. నేను చెప్పకూడదని నవ్వుతూ సమాధానమిచ్చేవారు. నిజంగానే ఆయన పారితోషికం ఎప్పుడే గానీ ఎక్కువగా తీసుకునేవారు కాదట. ఒక్కోసారి ఆయన సినిమాల్లో పాటలకు ఆయనే నృత్య దర్శకత్వం చేయాల్సి వచ్చేది. దానికి అదనంగా పారితోషికం తీసుకోవచ్చు కానీ ఎప్పుడే కానీ అలా చేయలేదట. అయితే అప్పుడు అడిగి ఉండాల్సిందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుందని ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. ఆయన తన అనుభవాలతో పరిశ్రమలో అడగకపోతే అడగనట్టే ఉంటుంది. తొమ్మిది గంటలకు రావాల్సిన కారు రాకపోతే వెంటనే ఆటోలో వెళ్లేవారట. నాతో పాటు ఉన్న దర్శకులు ఎంత తీసుకుంటున్నారో కూడా ఎప్పుడేగానీ ఆరా తీసేవారు కాదట. మనకు భగవంతుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడని గట్టిగా నమ్మేవారు కె విశ్వనాథ్. అందుకే ఆయన కళామతల్లి బిడ్డగా కళాతపస్వి బిరుదు పొందారని అనిపిస్తోంది. -
కె.విశ్వనాథ్‌కు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
గర్భగుళ్లో అభిషేకం చేస్తున్నంత పవిత్రంగా.. అమ్మ ఒళ్లో పసిపాపను లాలిస్తున్నంత ప్రేమగా.. సముద్రంలో కలిసిపోతున్న నదీమతల్లంత పరవశంగా.. వెండితెరపై సినిమాను సాకాడాయన.. అందుకే మనకిన్ని కళాఖండాలు.. కలకండలు.. పనినే తపస్సుగా ఆచరించిన ఈ కళాతపస్వి ప్రతి ప్రయత్నం సుందరం.. సుమధురం.. సున్నితం.. సమున్నతం.. సముద్రం.. ఇంతటి కీర్తి గడించిన ఆయన కెరీర్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం. కళా తపస్వి కె విశ్వనాథ్‌కు సంగీతమంటే చాలా ఇష్టం. అది నేర్చుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. ఆయన ఇంట్లో వాళ్లు ఇంజినీర్ చేయాలనుకున్నారే కానీ.. ఆయనలోని సంగీత తపనను మాత్రం గుర్తించలేకపోయారు. అప్పట్లో బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ప్రారంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్ మేనేజర్‌గా విశ్వనాథ్ తండ్రి పనిచేసేవారు. కానీ ఆయన సినిమాల్లో రావడానికి అది కారణం కాదు. అప్పట్లోనే మద్రాసులో కొత్తగా వాహినీ స్టూడియోస్ ప్రారంభించారు. అందులో యంగ్ గ్రాడ్యుయేట్స్‌ని ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీసుకునేవారు. ఆ విషయం గురించి తెలిసిన అంకుల్ ఒకరు.. మనవాడిని ఎందుకు చేర్చకూడదని విశ్వనాథ్ తండ్రితో చెప్పారట. ఆ తర్వాత విశ్వనాథ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నాన్న చెప్పగానే సౌండ్ డిపార్ట్మెంట్లో చేరారు కె. విశ్వనాథ్ ఆ రోజుల్లో ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్లకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్ట్ డైలాగ్స్ చెప్పలేకపోతే సౌండ్ రికార్డిస్ట్ సాయం తీసుకునేవాళ్లని చెప్పేవారు. నీకేం తెలుసు.. నువ్వెవరు చెప్పడానికి అని గర్వం ఉండేది కాదు. అందుకని అప్పట్లో ఎదైనా చెప్పడానికి చాలా స్వేచ్ఛ ఉండేదని.. రకరకాల సన్నివేశాలు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు లాంటి అనుభవం పొందడానికి మంచి అవకాశం దొరికేదని విశ్వనాథ్ చెప్పేవారు. సినీరంగంలో మొదట కె.విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్గానే ప్రారంభమైంది. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతిభ, ఆసక్తిని గమనించి అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావులు సౌండ్ రికార్డింగ్కే ఎందుకు పరిమితం అవుతారు. క్రియేటివ్ సైడ్ ఎందుకు రాకూడదు అడిగారట. ఆ తర్వాతే మూగమనసులుతో పాటు కొన్ని చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సౌండ్ రికార్డిస్ట్‌గా చేరినప్పుడు డైరెక్టర్ అవుతానని ఎప్పుడు కూడా అనుకోలేదనట విశ్వనాథ్. -
నిత్యకృషీవలురు
అపురూపం అనుకోవడం వేరు... సాధించడం వేరు... అనుకున్నది సాధించడం తేలికా కాదు... అందరివల్లా కాదు! రాత్రికి రాత్రి సాధించడం సాధ్యమూ కాదు... గట్టి పట్టు పట్టాలి. ఒక్కో మెట్టు ఎక్కాలి. శిఖరాన్ని చేరాలి. చేరిన తర్వాత నిలుపుకోవాలి! ఇవన్నీ చేసినవారు కె.విశ్వనాథ్, ఇళయరాజా! ఒకరు దర్శక దిగ్గజం. ఇంకొకరు సంగీత శిఖరం! కె.విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కినేని ప్రోత్సాహంతో దర్శకత్వ శాఖలోకి వచ్చారు. నాటి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్ని చిత్రాలకు పనిచేశారు. అలా ‘మూగమనసులు’ చిత్రానికీ పనిచేశారు. అందులో అక్కినేని, సావిత్రిపై ‘ఈనాటి ఈ బంధమేనాటిదో...’ పాట చిత్రీకరణప్పుడు అక్కినేని పడకుండా ఆయన చేయిని ఒకవైపు దర్శకుడు ఆదుర్తి పట్టుకుంటే... సావిత్రి కొంగు ఎగురుతున్నట్లు కనపడటానికి ఆమె పైటను కె.విశ్వనాథ్ పట్టుకుంటారు. తర్వాత కాలంలో నిర్మాతల కొంగు బంగారమయ్యారు విశ్వనాథ్. ఇళయరాజాకి చిన్నతనం నుండే సంగీతమంటే ప్రాణం! సంగీత దర్శకుడు కాకముందు కొన్ని సంవత్సరాల పాటు సంగీత కార్యక్రమాలకు, సినిమాలకు కీ-బోర్డ్ ప్లేయర్‌గా పనిచేశారు. అలా ఓ తమిళ సినీసంగీత కార్యక్రమంలో అప్పట్లో టాప్ సింగర్‌గా వెలుగుతున్న పి.సుశీల పాడుతుంటే, యువ ఇళయరాజా కీబోర్డ్ వాయిస్తున్నారు. అలా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఉత్తమ సంగీతానికి పర్యాయపదంలా ఎదిగారు లయరాజా ఇళయరాజా! ఇద్దరూ చిన్నగా మొదలయ్యారు! పెద్దగా ఎదిగారు! చరిత్ర సృష్టించారు! బతుకును ధన్యం చేసుకున్నారు! నిర్వహణ: సంజయ్ కిషోర్