బిగ్‌బజార్‌లో చోరీ కేసు చేధించిన పోలీసులు
విజయవాడ: హైదరాబాద్ కాచిగూడలోని బిగ్‌బజార్‌లో జరిగిన చోరీ కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఆ చోరీకి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 30 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ వాహనంలో విలువైన వస్తువులతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి... తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్బంగా వస్తువుల గురించి వాహనంలో ప్రయాణిస్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు వెల్లడించారు. దాంతో పోలీసులు అనుమానించి సదరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దాంతో శుక్రవారం అర్థరాత్రి కాచిగూడ బిగ్జబార్ చోరీ చేసింది తామేనని అంగీకరించారు. దాంతో కాచిగూడ పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు. నిందితులంతా సెక్యూరిటీ గార్డులే కావడం గమనార్హం.