Kailash Mansarovar yatra
-
మళ్లీ మానస సరోవర యాత్ర
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని కీలక అడుగులు పడ్డాయి. ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ వెళ్లిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వెయ్డాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు జరిగాయి. ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ నదుల విషయమై పరస్పరం మరింతగా సహకరించుకునేందుకు, జల వనరులకు సంబంధిత డేటాను పూర్తిస్థాయిలో ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి. భారత్–చైనా నిపుణుల స్థాయి బృందం దీనిపై వీలైనంత త్వరగా చర్చలు జరపనుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ మంత్రి లియూ జియాంచవోలతోనూ మిస్రీ సమావేశ మయ్యారు. పలు కీలకాంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఉన్నతస్థాయిలో చర్చలు జరపాలని గత అక్టోబర్‌లో కజాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో నిర్ణయించడం తెలిసిందే. తాజా చర్చలు అందులో భాగమే’’ అని వివరించింది. ‘‘ఇరుదేశాల దౌత్య బంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా విశ్వాస కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆర్థిక, వర్తక రంగాల్లో ఇరుదేశాల్లో నెలకొన్న పరస్పర ఆందోళనలు, సందేహాలు కూడా సన్–మిస్రీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన విధాన పారదర్శకత, విశ్వసనీయతే గీటురాళ్లుగా ముందుకు సాగాలని అంగీకారం కుదిరింది’’ అని వెల్లడించింది. మానస సరోవర యాత్ర, చైనాకు నేరుగా విమాన సర్వీసులు 2020లో రద్దయ్యాయి. -
మానస సరోవర్ జలాలు ఎంతో స్వచ్చంగా ఉన్నాయి
-
మానస సరోవర్‌లో విద్వేషం లేదు: రాహుల్
న్యూఢిల్లీ: కైలాస మానససరోవర్ యాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం మానససరోవర్ సరస్సు ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. ‘మానససరోవర్ సరస్సులోని నీళ్లు ఎంతో స్వచ్ఛమైనవి, ప్రశాంతమైనవి. ఈ నీటిని ఎవరైనా తాగవచ్చు. ఇక్కడ ఎలాంటి ద్వేషభావమూ లేదు. అందుకే ఈ నీటిని భారత్‌లో మేం పూజిస్తాం‘ అని రాహుల్ ట్వీట్ చేశారు. మానససరోవర్ సరస్సుతో పాటు అక్కడి పరిసరాలకు సంబంధించి రెండు ఫొటోలను రాహుల్ తన ట్వీట్‌కు జతచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఢిల్లీ నుంచి హుబ్లీకి బయలుదేరిన రాహుల్ విమానానికి పెనుప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఈ విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఎడమవైపుకు ఒరిగిపోయి వందల అడుగులు కిందకు వచ్చేసినా, పైలెట్లు చాకచక్యంగా దాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగలిగారు. ఈ నేపథ్యంలో కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లాలని తన మనసులో బలంగా అన్పించిందని రాహుల్ అప్పట్లో చెప్పారు. -
మానస్ సరోవర్‌లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్
-
యాత్రకు వేళాయె!
-
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వరదలు
న్యూఢిల్లీ: భారీ వరదలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు రాష్ట్రాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటం క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బిహార్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. సితామర్హి జిల్లాలో బాగ్మతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అసాధారణ వరద పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక గోపాల్‌గంజ్ జిల్లాలోనూ గందక్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. బిహార్‌లో మొత్తం 12 జిల్లాలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయని, ఇప్పటికే 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగగా, మరో బృందాలు సోమవారం రాష్ట్రానికి రానున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్లో రాప్తి నది, బుదౌన్‌లో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రకటించింది. హిమాలయ రాష్ట్రమైన అసోంలోనూ బ్రహ్మపుత్ర, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భారీ వరదలు సంభవించాయి. నిలిచిపోయిన మానస సరోవరం యాత్ర కాళీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో ఉత్తరాఖండ్‌లో కైలాస్ మానవ సరోవరం యాత్ర నిలిచిపోయింది. కాళీ నది వరదల ఉధృతికి మంగ్తిలో రెండు వంతెనలు, సింఖోలాలో ఒక వంతెన దెబ్బతిన్నాయి. ఐలాగాడ్లో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు యాత్రికులు తప్పిపోయారు. ఇందులో నలుగురి మృతదేహాలను మానస సరోవరం యాత్రమార్గమైన మల్పా వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నాలుగు దుకాణాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. -
కొత్త దారిలో మానససరోవర్ యాత్ర
జెండా ఊపి ప్రారంభించిన సుష్మ న్యూఢిల్లీ: కొత్త మార్గంలో మొదటి బ్యాచ్ కైలాస్ మానససరోవర్ యాత్రను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. గత సెప్టెంబర్‌లో భారత్ పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ కొత్త మార్గాన్ని(వయా నాథులా పాస్) ప్రకటించారు. టిబెట్‌లోని మానససరోవర్‌ను బస్సులో చేరుకునేందుకు ఈ కొత్త రోడ్డు మార్గం వీలు కల్పిస్తుంది. దీంతో భారతీయ యాత్రికులు ముఖ్యంగా వయో వృద్ధులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గంలో మానససరోవర్‌కు వెళుతున్నారు. వృద్ధులకు సైతం ఈ యాత్రను అందుబాటులోకి తీసుకువస్తానని గత ఏడాది తాను ఇచ్చిన హామీ నెరవేరినందుకు, యాత్రకు వెళుతున్నవారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని సుష్మ అన్నారు. కొత్త మార్గం ప్రారంభించనట్టైతే వీరు ఈ యాత్రను చేపట్టగలిగేవారు కాదన్నారు. సిక్కింలోని నాథులా పాస్ సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఐపీఎస్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి సంబంధించిన వివాదంలో చిక్కుకున్న తర్వాత సుష్మ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. వయా లిపులేఖ్ పాస్ మార్గంలో మానససరోవర్ యాత్రను ఆమె ఈ నెల 11న ప్రారంభించారు. -
కైలాష్-మానస సరోవర్ యాత్ర ప్రారంభం
-
జూన్ 8న కైలాస్ మానస సరోవర్ యాత్ర షురూ
డెహ్రాడూన్: ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక 'కైలాస్ మానససరోవరం యాత్ర' జూన్ 8న ప్రారంభంకానుంది. ఢిల్లీలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ధ్రువీకరణ పొందిన ప్రయాణికులను గ్రూపులుగా పంపుతారు. ఢిల్లీలోని భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) బేస్ ఆస్పత్రిలో పరీక్షించిన అనంతరం ప్రయాణికులను జూన్ 12న ఉత్తరాఖండ్‌కు పంపిస్తారు. ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రయాణికులు ఫీజు, ఇతర ఖర్చులను చెల్లించాలని అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులతో కూడిన 18 గ్రూపులకు విదేశీ వ్యవహరాల శాఖ అనుమతిచ్చింది. ఉత్తరాఖండ్‌లో కూడా ప్రయాణికులకు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. యాత్ర ఏర్పాట్లను ఐటీబీపీ ఏడో బెటాలియన్ పర్యవేక్షిస్తుంది. వారి వెంట వైద్య బృందం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 9న సరోవరం యాత్ర పూర్తవుతుంది. ఈ పర్వతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల పూర్తిగా ఆరోగ్యం ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.