Kainat Imtiaz
-
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి!
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది. పాకిస్తాన్‌కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్, కైనత్ ఇంతియాజ్‌కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్ ప్రోత్సాహంతో సలీమా అంపైర్‌గా ఎదగగా.. క్రికెటర్ కావాలన్న తమ కూతురు కైనత్ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు. ఇక తండ్రిలాగే భర్త వకార్ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్ పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 41 ఏళ్ల వయసులో కల సాకారం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా భారత్- శ్రీలంక మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్ పాకిస్తాన్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడంతో ఇంతియాజ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. భర్తతో కైనత్(PC: Kainat Imtiaz Instagram) నాకు గర్వకారణం.. కైనత్ భావోద్వేగం ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకుంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్ -2022లో అంపైర్‌గా మా మామ్! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్. వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్‌లకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్ తండ్రి ఖవాజా స్పో టీచర్‌గా పనిచేశాడు. ఇక పాక్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన కైనత్.. భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్‌కప్ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆడిన పాకిస్తాన్ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. View this post on Instagram A post shared by Kainat Waqar (@kainatimtiaz23) -
నేను... నా స్ఫూర్తి!
పాక్ మహిళా క్రికెటర్ కైనత్ ఆనందం డెర్బీ: క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఎంత వైరం ఉన్నా ఒక్కసారి ఆట ముగిశాక వారి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉంటాయి. పురుషుల క్రికెట్లో ఇది చాలాసార్లు కనిపించింది. మహిళల క్రికెట్లో కూడా ఇదే క్రీడా స్ఫూర్తి ఉందనేదానికి తాజా ఉదాహరణ ఇది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్ కైనత్ ఇంతియాజ్, భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిని కలిసింది. ఆమెతో ఫొటో దిగి తన పాత జ్ఞాపకాన్ని పంచుకుంది. జులన్ స్ఫూర్తితోనే తాను పేసర్‌గా ఎదిగినట్లు ఈ పాక్ క్రీడాకారిణి చెప్పింది. ‘2005లో పాకిస్తాన్లో జరిగిన ఆసియా కప్‌లో తొలిసారి భారత్ పాల్గొంది. ఆ టోర్నీలో నేను బాల్ గర్ల్‌గా పని చేశాను. ఆ సమయంలో ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న జులన్ గోస్వామిని చూశాను. ఆమె బౌలింగ్ నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే క్రికెట్‌నే కెరీర్‌గా మార్చుకోవాలని, అదీ ఫాస్ట్ బౌలర్‌ను కావాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నాకు స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణితో కలిసి ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఆడుతున్నాను. ఇది నాకు మరింత స్ఫూర్తినిచ్చే అంశం’ అని కైనత్ వెల్లడించడం విశేషం. ఫుట్‌బాల్ జట్టుకు కూడా.. వరల్డ్ కప్‌లో ఆడుతున్న పాక్ జట్టులో మరో పేసర్ దియానా బేగ్‌ది కూడా ఆసక్తికర నేపథ్యం. మొత్తం టోర్నీలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. 21 ఏళ్ల దియానా గత ఏడాది వరకు పాకిస్తాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. జట్టు తరఫున డిఫెండర్‌గా ఆమె బరిలోకి దిగింది. అయితే చివరకు రెండు ఆటల్లో ఒకదానిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె క్రికెట్ వైపు మొగ్గింది. భారత్‌లో మ్యాచ్‌లో కీలకమైన స్మృతి మంధన వికెట్ తీసినప్పుడు ఆమె బంతి వేగానికి బిషప్లాంటి కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. పాయింట్ వద్ద దియానా మెరుపు ఫీల్డింగ్‌కు కారణం ఆమె ఫుట్‌బాల్ నైపుణ్యమేనని సహచరులు చెబుతారు. జాంటీ రోడ్స్ వీడియోలు ఆమె ఫీల్డింగ్ మెరుగుపడేందుకు స్ఫూర్తిగా నిలిచాయి. ‘నాకైతే అన్ని ఆటలూ ఇష్టమే. వీరంతా అడ్డుకుంటున్నారు గానీ లేదంటే వాలీబాల్, అథ్లెటిక్స్ కూడా ఆడేసేదాన్ని’ అని 21 ఏళ్ల దియానా తన ఆసక్తి గురించి నవ్వుతూ చెబుతోంది. -
భారత క్రికెటర్‌కు వీరాభిమానిని: పాక్ ప్లేయర్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల క్రికెట్ పోరు అంటే చాలు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దాయాది జట్టులో తమ అభిమాన క్రికెటర్ ఉన్నా.. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అని వారిపై నోరు మెదిపేందుకు ఆలోచిస్తారు. కానీ పాక్ యువ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ మాత్రం భిన్నంగా తన మనసులో మాటను బయటపెట్టింది. ఓవైపు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 95 పరుగులతో పాక్‌పై విజయం సాధించగా.. మరోవైపు తన ఆరాధ్య క్రికెటర్ ఝులన్ గోస్వామి(భారత్)ని కలుసుకున్నానంటూ కైరత్ హర్షం వ్యక్తం చేసింది. దాయాదుల పోరులో ఓడిన జట్టుకు నెగ్గిన జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించడం తరచుగా చూస్తుంటాం. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత వెటరన్ ప్లేయర్ గోస్వామిపై ఆమెకున్న అభిమానాన్ని కైరత్ చాటుకుంది. '2005లో పాకిస్తాన్లో జరిగిన ఆసియాకప్‌లో తొలిసారిగా ఝులన్‌ను చూశాను. ఆ సమయంలో ప్రపంచలోనే ఫాస్టెస్ట్ బౌలర్ ఆమె. భారత ఆల్‌రౌండర్ ఝులన్‌ను చూసి ప్రభావితురాలినై ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ కెరీర్ ఎంచుకున్నాను. పాక్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ద్వారా.. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత నాకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆరాధ్య క్రికెటర్ ఝులన్‌తో మ్యాచ్ ఆడాను. నా కల నిజమైందని' పేర్కొంటూ భారత పేసర్ ఝులన్ గోస్వామితో కలిసి దిగిన ఫొటోను పాక్ ప్లేయర్ కైనత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.