Kajalsarma
-
వీడియో: అంత బలుపెందుకు.. నువ్వు సెలబ్రెటీవా!
మూగ జీవాలను హింసించిన కేసుల్లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం లేదా హిట్స్ కోసం కొందరు మూగజీవాలను శారీరకంగా భాధివంచారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణమైన ఓ ఈ-సెలబ్రెటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మోజ్-ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్ కాజల్ అనుచితంగా ప్రవర్తించింది. అయితే, సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేయడం కోసం ఆమె.. ఓవర్‌గా బిహేవ్ చేసింది. కాగా, వీడియోలో కుక్కపై లేని ప్రేమను నటించి.. దాన్ని మచ్చిక చేసుకున్నట్టు ప్రవర్తించి.. చివరకు కుక్కను కాలితో తన్నింది. అనంతరం.. కాజల్ నువ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. How can you be so insensitive toward these voiceless souls If you cant love them dont hurt them #AnimalAbuse#DogsOnTwitter pic.twitter.com/8HaC2zD7Ea — Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) November 30, 2022 కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీడియోను యూపీ, నోయిడా పోలీసులకు రీట్వీట్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇన్ఫ్లుయెన్సర్ కాజల్‌కు మోజ్ యాప్‌లో దాదాపు 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో సంఖ్య 121K మంది ఫాలోవర్స్ కాజల్‌ను ఫాలో అవుతున్నారు. @Uppolice @noidapolice please take stringent action against this sadistic, violent "social media influencer" and "content creator" kajal something — for Aslan! پربھا آپا (@prabha_j) November 30, 2022 -
ఆన్లైన్లో అందాలను వర్ణిస్తూ..
సాక్షి, సిటీబ్యూరో: టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యభిచార దందా ముఠాలు హైటెక్ వ్యభిచారం మొదలుపెట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిల ఫొటోలను ఆయా వెబ్సైట్లలో అప్లోడ్ చేసి, వారి శరీరాకృతిని వర్ణిస్తూ పూర్తి వివరాలు నిక్షిప్తం చేయడంతో పాటు కాంటాక్ట్ నంబర్లు ఇస్తూ నిర్వాహకులు బిజినెస్ చేస్తున్నారు. ఈజీ పద్ధతిన డబ్బు సంపాదించే మార్గం కావడంతో నగరానికి చెందిన కొందరు నిర్వాహకులు ఆన్లైన్ వ్యభిచార దందాను భారీ స్థాయిలో ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఎస్ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఫోన్‌కాల్స్ ఆధారంగా ఉప్పల్ ఠాణా పరిధిలో ముగ్గురు నగరవాసులతో కూడిన ఓ వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. ఇద్దరు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. తాజాగా మంగళవారం న్యూఢిల్లీకి చెందిన నిర్వాహకురాలిని రామంతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు బాధిత మహిళలను వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. నిందితుల వద్ద 11 సెల్ఫోన్లు, ఒక కారు. రూ.32 వేలు స్వాధీనం చేసుకున్నారు. లొకంటో.కామ్ వేదికగా.. న్యూఢిల్లీకి చెందిన ప్రచిశర్మ, కాజల్‌శర్మలు లొకంటో.కామ్‌లో అందమైన ఫొటోలు అప్లోడ్ చేస్తూ ఈ దందా చేశారు. వీరు తమ బాయ్‌ఫ్రెండ్ ఢిల్లీకే చెందిన జావేద్ అన్సారీ సహాకారంతో నగరంలోనూ వ్యభిచార దందా ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి తనకున్న పరిచయాలతో ప్రాచీ శర్మ కాల్ గరల్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి వివిధ హోటళ్లలో వసతి కల్పించి దందా చేసేది. గంటలను బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది. ఇందులో 50 శాతం నగదు ఆమె తీసుకొని, హోటల్ ఖర్చులు మినహాయించి మిగతావి కాల్ గరల్స్‌కు కాల్ గరల్స్‌కు ఇచ్చేది. ఇదే విధంగా నగరానికి చెందిన రంజిత్, నగేశ్, రవివర్మ సహాకారంతో మెహిదీపట్నంలోని రేతిబౌలికి చెందిన డి.ప్రభాకర్ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రామాంతాపూర్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే ఢిల్లీకి చెందిన ప్రచిశర్మను మంగళవారం అరెస్టు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు.