kakinada collectorate
-
తొలి సమీక్షలోనే నేతల మధ్య వార్
కాకినాడ సిటీ(తూర్పు గోదావరి) : వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన తొలి సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. పౌర సరఫరాలు, హౌసింగ్, డీఆర్డీఏ, వ్యవసాయంపై జరిగిన సమీక్షలో గత ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు, అడ్డగోలు వ్యవహారాలు చర్చకొచ్చాయి. గత ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎత్తిచూపినప్పుడల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు చుర్రుమంది. ఒకానొక దశలో వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి మధ్య ఆ వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దిగారు. సహనం కోల్పోయిన బుచ్చియ్య చౌదరి నాన్సెన్స్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని దూషణకు దిగారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. సోము వెర్సెస్ గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియచౌదరి రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తారా? గ్రామ వలంటీర్లను నియమించి డీలర్ల వ్యవస్థను తొలగిస్తారా? అంటూ మంత్రులను అడిగారు. ఈ సందర్భంగా చర్చ అంశం కాకుండా వివిధ పనుల బిల్లుల నిలుపుదల, హౌసింగ్ తదితర అంశాలపై గోరంట్ల ప్రశ్నిస్తుండగా సోము వీర్రాజు జోక్యం చేసుకుని నాటి ప్రభుత్వ విధానాలు, నిర్వాకాలు తప్పుబట్టారు. అంతేకాదు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, వీటిని చర్చించేందుకు చాలా సమయం ఉందని అనడంతో గోరంట్ల ఒక్కసారిగా సోము వీర్రాజుపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి అరుపులు, కేకలతో సమావేశం గందరగోళంగా మారింది. గోరంట్ల, సోములు వ్యక్తిగత దూషణలకు దిగారు. తొలుత ‘వాట్ ఆర్ యూ టాకింగ్’ అని గోరంట్ల అనగానే, ‘వాట్ ఆర్ యూ టాకింగ్’ అంటూ సోము ప్రతి స్పందించారు. ఆ తర్వాత నాన్సెన్స్ వాట్ ఆర్ యూ టాకింగ్ అంటూ గోరంట్ల అనడంతో అరుపులు, కేకలకు దారితీసింది. ఏకవచనంతో తిట్టుకోవడం కన్పించింది. దీంతో ఉపముఖ్యమంత్రి బోసు కలుగజేసుకోని ఇరువురికి నచ్చజెప్పడంతో గందరగోళం సద్దుమణిగింది. హౌసింగ్‌పై సమగ్ర చర్చ హౌసింగ్ చర్చకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఇళ్ల మంజూరులో వివక్ష చూపించారని మంత్రి కన్నబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా తుని, కొత్తపేటలో తీరని అన్యాయం చేశారని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్నారని అక్కడ అతి తక్కువ కేటాయించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా కూడా ప్రస్తావించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు చెందిన ఇళ్లు పాడైపోయాయని వీటిని తిరిగి నిర్మించుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు సడలించి రుణాలు అందించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రామచంద్రపురంలోని లెప్రసీ కాలనీలోని ఇళ్లు పడిపోతున్నాయని, వాటిని పరిశీలించి పునర్నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు గత ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల విషయంలో జరిగిన జాప్యంపై వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటాలు లేకుండా పేదల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,పెండెం దొరబాబు, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, జ్యోతుల చంటిబాబు, కొండేటి చిట్టిబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవానీ, జిల్లా ఫారెస్ట్ అధికారి నందినీ సలారియా, రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ సుమిత్‌కుమార్‌గాంధీ, ఎటపాక ఐటీడీఏ పీఓ అభిషిక్త్ కిశోర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏఎస్పీ ఎస్వీ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో రగడ టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన 640 హామీల్లో నాలుగైదు తప్ప మిగిలిన హామీలన్నీ అమలు చేయలేదని, తమ ప్రభుత్వం నవరత్నాల ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని వ్యవసాయశాఖామంత్రి కన్నబాబు అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు టీడీపీ పెట్టిన 640 హామీల మేనిఫెస్టో వివరాలను తమకు అందజేయాలని కోరారు. తాము కేవలం 274 హామీలు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, వాటన్నింటికి అమలు చేశామన్నారు. 640 హామీల విషయాన్ని ముందు తెలుసుకోవాలని, అవసరమైతే నాటి మేనిఫెస్టో ఇస్తామని కన్నబాబు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చియ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు మధ్యలో లేచి తామిచ్చిన హామీలు తమకు తెలియవా, అవన్నీ అమలు చేశామని చెబుతుండగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, జ్యోతుల చంటిబాబు జోక్యం చేసుకుని ఏవేవి చేయలేదో చెబుతామని, అవసరమైతే టీడీపీ మేనిఫెస్టో కాపీలను మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు జరిగాయి. మా ప్రభుత్వం రైతు పక్షపాతి: కురసాల కన్నబాబు రైతు, మహిళా సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షపాతి ప్రభుత్వంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని వ్యవసాయ, సహకార శాఖామంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రెండురోజులుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనేక సూచనలు చేశారని, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సేవాభావంతో ప్రజలకు పని చేయాలని సూచించారన్నారు. ఈ ఐదేళ్లు చాలా కీలకమని, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఒకే టీముగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పని చేద్దామని కన్నబాబు అన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అని విధాలుగా అభివృద్ది చేసేందుకు మేథావులు, ప్రజలు తమ, తమ సూచనలు, సలహాలు అందించవచ్చన్నారు. ఇంకా చంద్రబాబు ఫొటో ఏంటి? ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంకా చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించి ఉంచారని, వీటిని తక్షణం మార్పు చేసి, జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మీసేవ కేంద్రాలు, పింఛన్ల పుస్తకాలు, రేషన్‌కార్డులపై ఉన్న ఫొటోలు తక్షణం మార్చాలని కోరారు. -
ప్రత్యేక హోదా: కాకినాడ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ దీక్ష
-
ముట్టడి.. కట్టడి..
కాకినాడ రూరల్: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లాలన్న డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎమ్మార్పీస్ నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఆలమూరు మండల ఎమ్మార్పీస్ నేత కొమ్ము నారాయుడు స్పృహ తప్పిపడిపోయాడు. ఈ తోపులాటలో కాకినాడ డీఎస్పీ రవివర్మ కూడా ఉండడంతో ఆయన కూడా ఆందోళనకారుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. తమ నాయకుడు నారాయుడు అస్వస్థతకు గురి కావడంతో ఎమ్మార్పీస్ కార్తకర్తలు మరింత రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి చంద్రబాబు నశించాలి, మోసగాడు చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలిచ్చారు. మరోసారి కలెక్టర్ కార్యాలయపు గేటును ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అయితే డీఆర్ఓ జితేంద్ర నేరుగా ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడడంతో సద్దుమణిగింది. ఒకానొక దశలో ఆందోళనకారులు డీఆర్వో మాటను సైతం లెక్క చేయకుండా కలెక్టర్ బయటకురావాలంటూ నినాదాలిచ్చారు. అయితే ఆయన ఊరిలో లేరని కొందరు నాయకులు నిర్ధారించుకున్న తరువాత డీఆర్వో జితేంద్ర, డీఎస్పీ రవివర్మలతో చర్చించారు. ఆందోళనను విరమించారు. ఈ ఆందోళనలో గాయపడిన కొమ్ము నారాయుడిని ప్రత్యేక వాహనంలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మందా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పచ్చి మోసకారి, వెన్నుపోటుదారుడని, నమ్మిన వారిని మోసం చేయడంలో ఆయనకు ఆయనే సాటని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతానని బహిరంగంగా హామీ ఇచ్చి మాదిగలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఎస్సీ వర్గీకరణను సాధించే వరకు ఎమ్మార్పీస్ కార్యకర్తలు ఎంతటి త్యాగానికైనా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్పీస్ జిల్లా నాయకులు కొత్తపల్లి రఘు మాదిగ, వల్లూరి సత్తిబాబుమాదిగ, గంపల సత్యప్రసాద్, ముందేటి డేవిడ్‌రాజు, ఆకుమర్తి ఆశీర్వాదం, పలివెల నవీన్మాదిగ, యార్లగడ్డ సత్తిబాబు, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు భూపతి అప్పారావు, బంగారు మంగారావు, మోచీ కులం నాయకులు బి.భద్రం తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. అరెస్టు.. విడుదల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి చెందిన 60 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి కాకినాడ పోర్టు, సర్పవరం పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం ఐదు గంటల సమయంలో విడుదల చేశారు. -
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం
-
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం
సాక్షి, కాకినాడ: కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద బుధవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. కార్యాలయంలోని వెనుక గేటు సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమె చికిత్ప పొందుతూ మృతి చెందింది. సదరు మహిళ, సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం వీడియో వీక్షించండి -
పవన్ కల్యాణ్ కోసం ఎదురు చూశాం
కాపులను బీసీల్లో చేర్చాలంటూ బలిదానం కాకినాడ కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కాపు విద్యార్థులకు భవిష్యత్తు ఉండడం లేదని ఆవేదన పవన్ పార్టీ ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిందని ఆగ్రహం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని లేఖలో డిమాండ్ సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్ల ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. నిన్న తునిలో జరిగిన విధ్వంసకాండ మంటలు చల్లారకముందే ఓ కాపు సామాజిక వర్గీయుడు బలిదానం చేశాడు. న్యాయం కావాలి.. న్యాయం జరగాలి.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి... అంటూ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి (53) సినిమారోడ్డులోని డీజిల్ హౌస్‌లో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి, కుమారుడు రాజేష్ ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కావడం తో ఆమె వేరుగా ఉంటోంది. వెంకటరమణమూర్తి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని బెన్నెట్ క్లబ్ మేడపైకి ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన టీవీ డిష్‌కు నైలాన్ తాడు కట్టుకుని కిందికి దూకడంతో మెడకు తాడు బిగిసి అక్కడికక్కడే మృతి చెందారు. పవన్‌ది ప్రశ్నలు లేని పార్టీ.. సామాజిక, ఆర్థిక రంగాల్లో కాపులు ఎంతో వెనుకబడి ఉన్నారని, 90 శాతం మార్కులు సంపాదించినా కాపు విద్యార్థులకు భవిష్యత్తు ఉండడం లేదని వెంకటరమణమూర్తి తన ఆత్మహత్య లేఖలో రాశారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కాపులను ఉద్ధరిస్తాడనుకున్నామని... తమది ప్రశ్నించే పార్టీ అని స్థాపించి, ప్రశ్నలు లేని పార్టీగా మిగిల్చారని లేఖలో రాయడం చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్యే లు జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాం బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, కాకినాడ ఆర్డీఓ బీఆర్ అంబేడ్కర్ తదితరులు మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీఎస్పీలు సూర్యదేవర వెంకటేశ్వరరావు, పిట్టా సోమశేఖర్‌ల నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. సూసైడ్ నోట్లో వెంకటరమణ ప్రస్తావించిన అంశాలు.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి. సమాజంలో ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు కులంపై ఆధారపడి ఉండవని ప్రభుత్వం ఇకనైనా తెలుసుకోవాలి. కాపులు ఐదేళ్ల కోసారి ఓట్లు వేయడానికి తప్ప ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం పొందడానికి అర్హులు కారా! కాపు విద్యార్థి 90 శాతం మార్కులు సాధించినా సీట్లు సంపాదించడానికి పాట్లు పడుతున్నారు. 90 శాతం మార్కులు వచ్చిన అధిక ఫీజులు చెల్లించాలని వారి ఆశయాలను చంపుకుని తమ చదువును సగంలోనే నిలిపి వేస్తున్నారు. కాపు కులస్తులు 90 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. ఆర్థికంగా మిగిలిన కులస్తులుతో పోల్చినా కాపులు ప్రతీ రంగంలోను వెనుకబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపులకు ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురుచూశాం. చివరికి మాకు ఎదురు చూపు మాత్రమే మిగిలింది. మాది ప్రశ్నించే పార్టీ అని విన్నవించుకున్నారు. కాని చివరకు ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిపోయింది. ఈ కాపు సింహ గర్జన ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. -
కాపు రిజర్వేషన్ల కోసం వ్యక్తి ఆత్మహత్య
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో చిక్కాల వెంకట రమణమూర్తి (53) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కలెక్టరేట్లో వికాస కార్యాలయం వద్ద అతడు సోమవారం టీవీ డిష్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో సూసైడ్‌నోటును స్వాధీనం చేసుకున్నారు. రమణమూర్తి సూసైడ్ నోట్లో ... కాపులను బీసీల్లో చేర్చాలి. పవన్ కల్యాణ్ కాపులకు ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురు చూశా. చివరకు ఎదురు చూపులే మిగిలాయి. పవన్ కల్యాణ్ ప్రశ్నించే పార్టీ అన్నారు. కానీ ప్రశ్నల్లేని పార్టీగా మిగిలిపోయింది. కాపు గర్జన ద్వారా అయినా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా' అని పేర్కొన్నాడు. మృతుడు కాకినాడ డైయిరీ ఫాం సెంటర్ కు చెందిన డీజిల్ మెకానిక్. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డునపడ్డ ఆరోగ్యమిత్ర ఉద్యోగులు