నీచుడు: భార్యను స్నేహితులతో కలిసి..
హైదరాబాద్: పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనైన ఓ భర్త భార్యతో పైశాచికంగా ప్రవర్తించాడు. కంచన్బాగ్ బాబా నగర్లో దారుణం జరిగింది. ఓ మహిళను కట్టుకున్న భర్తే స్నేహితులకు సుఖం పంచాలని కోరాడు. వివరాల్లోకి వెలితే.. ఈ ప్రాంతానికి చెందిన ఎండీ సలీంకు 2016లో వివాహమయ్యింది. అనంతరం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే నగరంలో ఉంటున్న తన భార్యకు రోజూ వీడియో కాల్ చేసేవాడు.
ఈ సందర్భంగా భార్యను నగ్నంగా ఉండమనేవాడు. భర్త చెప్పడంతో కాదనలేక ఆమె అలాగే చేసింది. కానీ ఆ వీడియో సంభాషణను రికార్డు చేసి తన మిత్రులతో షేర్ చేసి ఆనందించేవాడు. అంతే కాకుండా కొన్ని రోజుల కిందట స్వదేశానికి వచ్చిన సలీం భార్యకు నిద్రమాత్రలు ఇచ్చి తన మిత్రుడు చాంద్తో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు కంచన్బాగ్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేయగా చాంద్ పరారీలో ఉన్నాడు.