పాముకాటుతో యువకుడి మృతి
ఇల్లంతకుంట :మండలంలోని కందికట్కూర్కు చెందిన జంగిటి సంపత్(30) పాముకాటుతో మంగళవారం మృతిచెందాడు. వేకువజామున గేదె పాలు పితికి పాలకేంద్రంలో పోసివచ్చాడు. తర్వాత బహిర్భూమికి వెళ్లొచ్చి ఇంట్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు తెల్లవారాక చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. నోట్లో నుంచి నురుసులు రావడంతో పాముకాటుతో మృతిచెంది ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. సంపత్కు భార్య, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.