గంజాయి మొక్కలు స్వాధీనం
మంత్రాలయం :
మండల పరిధిలోని బూదూరులో గురువారం ఎక్సైజ్ అధికారులు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లి గొల్ల నరసన్న సాగు చేసిన మిరప పొలంలో 33 మొక్కలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను తగులబెట్టారు. వీటి విలువ రూ.12వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో తహశీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఎక్సైజ్ ఎస్ఐ సునీల్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ రఘురాముడు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.