kanpur train accident
-
ప్రతి రైల్వే ప్రమాదంలోనూ కుట్ర కోణం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన వరస రైలు ప్రమాదాల వెనక విధ్వంస కుట్ర దాగి ఉందా? అంటే అవుననే సమాధానం అనే సమాధానం వస్తోంది. 2019 నవంబర్ 20న జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదంపై పాకిస్తాన్ కుట్ర ఉందని ప్రధాని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన సుమారు 40 రైలు దుర్ఘటనల్లో విదేశీ శక్తుల పాత్ర ఉందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాలను ఎన్ఐఏ చేత సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హోం మంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో గత నవంబర్‌లో ఇండోర్–పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 150 మంది చనిపోగా వందల మంది గాయాలపాలయ్యారు. ఆ తరువాత డిసెంబర్లో సీల్డా–అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ 15 బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 62 మంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగి చోట్ల ఫిష్‌ప్లేట్లు తొలగించి ఉండటం, పట్టాలపై పెద్దపెద్ద విడిభాగాలు పడిఉండటంతో వాటి వెనక బాహ్య శక్తుల పాత్రను అనుమానిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇటీవలే పట్టుబడిన, కాన్పూర్ ప్రమాదానికి కారకునిగా భావిస్తున్న నేపాల్ జాతీయుడు ఐసిస్ కోసం పనిచేస్తున్నాడన్న విషయం వెల్లడవడం అనుమానాలను మరింత పెంచుతోంది. -
రైలు ప్రమాదాలు: ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు
-
రైలు ప్రమాదాలు: ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు
భారతదేశంలో వరుసపెట్టి మూడు రైలు ప్రమాదాలు సంభవించి పలువురు మరణించారు. ఈ మూడు ప్రమాదాలకు కారణం రైలు పట్టాల మీద పేలుడు పదార్థాలు పెట్టడమేనని అనుమానాలున్నాయి. సరిగ్గా ఇదే కేసులో ప్రధాన నిందితుడు, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంటు అయిన షమ్సుల్ హుడాను నేపాల్‌లో అరెస్టు చేశారు. దేశంలో జరిగిన వరుస రైలు ప్రమాదాల కేసులను విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇతడిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. నవంబర్ నెలలో కాన్పూర్‌లో జరిగిన రైలుప్రమాదంలో ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పడంతో 150 మంది మరణించారు. ఈ కేసులో హుడా హస్తం ఉందని భావిస్తున్నారు. అతడి ఆదేశాల మేరకే ఈ రైలు వెళ్లే మార్గంలో పట్టాల మీద బాంబులు పెట్టారని, గ్యాస్ కట్టర్లతో పట్టాలు కోవారని అంటున్నారు. ఇటీవల జరిగిన అన్ని రైలు ప్రమాదాల వెనక ఐఎస్ఐ హస్తం ఉందని చెబుతున్నారు. బిహార్‌లో మోతీ పాశ్వాన్, ఉమాశంకర్ పటేల్, ముఖేష్ యాదవ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, విచారించగా అప్పుడు షమ్సుల్ హుడా పాత్ర బయటపడింది. బిహార్‌లోని మోతిహారీ ప్రాంతంలో జరిగిన ఇద్దరు యువకుల హత్యకేసులో వాళ్లను విచారించగా, రైలు ప్రమాదాల కోణం అనుకోకుండా బయటకు వచ్చింది. నేపాల్‌కు చెందిన బ్రిజ్ కిశోర్ గిరి అనే వ్యక్తి కూడా రైలు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్నాడు. హుడా అతడికి చెప్పి, ఇద్దరు యువకులతో బాంబులు పెట్టించాడని అంటున్నారు. వాళ్లు బాంబులు పెడుతూ దొరికిపోవడంతో బిహార్‌కు చెందిన ముగ్గురితో ఆ ఇద్దరిని హుడా చంపించాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా బిహారీల అరెస్టుతో బయటపడింది. -
‘కాన్పూర్ రైలు’ మృతులు 146
-
‘కాన్పూర్ రైలు’ మృతులు 146
- 83 మందికి కొనసాగుతున్న చికిత్స - ప్రమాదంపై రైల్వే విచారణ షురూ - వేగంగా పాత బోగీల తొలగింపు: మంత్రి సురేశ్ ప్రభు పుఖ్రాయా(యూపీ): ఇండోర్-పట్నా రైలు ప్రమాద మృతుల సంఖ్య సోమవారం 146కు పెరిగిందని కాన్పూర్ రేంజ్ ఐజీ జకీ అహ్మద్ చెప్పారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 79 మంది పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు. కాన్పూరు సమీపంలో పట్టాలు తప్పిన 14 రైలు బోగీలను తొలగించారు. సుమారు 133 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు కాన్పూర్ ముఖ్య ఆరోగ్యాధికారి రామాయణ్ ప్రసాద్ వెల్లడించారు. 24 శరీరాలను బిహార్‌కు, 25 మధ్యప్రదేశ్‌కు, 56 మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌కు పంపినట్లు చెప్పారు. గాయపడిన 202 మందిలో 83 మందికి కాన్పూర్‌లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రైలు ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు రైల్వే భద్రతా కమిషనర్(తూర్పు సర్కిల్) పీకే ఆచార్య నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. సోమవారం ఆయన ప్రమాదం జరిగిన చోటును సందర్శించి విరిగిన పట్టాలు, దెబ్బతిన్న బోగీలను పరిశీలించి వీడియో తీశారు. బాధ్యులకు కఠిన శిక్ష : సురేశ్ ప్రభు కాన్పూర్ సమీపంలో ఆదివారం రైలు ప్రమాదానికి కారకులైన వారికి కఠిన శిక్ష తప్పదని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హెచ్చరించారు. ఈ దుర్ఘటనపై అధునాతన సాంకేతికత, ఫోరెన్సిక్ విశ్లేషణల సాయంతో ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని ఆయన సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. గత రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా ప్రమాదాలను తట్టుకోలేని పాత బోగీలను తొలగించే ప్రక్రియను త్వరితగతిన చేపడతామని చెప్పారు. సహాయ మంత్రి ప్రకటనపై రాజ్యసభలో అభ్యంతరం రైలు ప్రమాదంపై రాజ్యసభలో రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెరుున్ ప్రకటన చేయగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారుు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుయే దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారుు. గొహెరుున్ కేబినెట్ మంత్రి కారని, లోక్‌సభలో రైల్వే మంత్రి ప్రకటన చేసి రాజ్యసభకు సమాధానం ఇవ్వకపోవడం సభను అగౌరవపరచడమేనని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ విమర్శించారు. కుటుంబాన్ని కాపాడిన చేతి కర్ర ఇండోర్-పట్నా రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఓ వృద్ధురాలి చేతికర్ర కుటుంబంలోని ఏడుగురిని కాపాడింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ చౌరాసియా కుటుంబం పట్నాకు బయల్దేరుతూ ఇండోర్‌లో రెలైక్కింది. ప్రమాదం జరిగిన తరువాత తామంతా బీఎస్1 బోగీలో చిక్కుకున్నామని తన తల్లి చేతికర్రే తమను కాపాడిందని చౌరాసియా చెప్పారు. ఆ కర్ర సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి గంట తరువాత సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. తమ బోగీలోని సహాయకుడు, మరి కొందరు ప్రయాణికులు చనిపోగా మృత్యువు తమకు అతి సమీపం నుంచి వెళ్లిందని చౌరాసియా భార్య నందిని చెప్పారు. -
రైలు ప్రమాదం: బీమా అందేది ఎందరికి?
ఇండోర్- పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించిన వారి వారసుల్లో చాలామందికి రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన బీమా పథకంలో సొమ్ము అందే అవకాశాలు కష్టమని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 145 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే శాఖ ఇటీవల చేపట్టిన పథకంలో భాగంగా.. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే 92 పైసల ప్రీమియం కడితే.. ప్రయాణంలో ఏదైనా ప్రమాదం సంభవించి ప్రయాణికుడు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా వాళ్ల వారసులకు రూ. 10 లక్షల మొత్తం బీమా రూపంలో అందుతుంది. అయితే.. ఇందుకోసం ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే తాము చాలాసార్లు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపుతామని.. అయినా కూడా దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోకుండా నామినేషన్ విషయాన్ని చాలామంది పట్టించుకలేదని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి జగన్నాథన్ అన్నామలై చెప్పారు. బీమా క్లెయిమ్ విషయంలో నామినీ లేనప్పుడు బీమా సంస్థలు 'లీగల్ హెయిర్ సర్టిఫికెట్' అడుగుతాయి. దాన్ని స్థానిక ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు చాలా తతంగమే ఉంటుంది. కేవలం 92 పైసల ప్రీమియం కడుతుండటంతో చాలామంది నామినీ పేరు రాయాలన్న విషయాన్ని పట్టించుకోరని.. అదే ఇప్పుడు క్లెయిములు సెటిల్ చేయడంలో పెద్ద అడ్డంకి అవుతుందని చెప్పారు. పైగా, ఈ రైల్వే బీమా విషయంలో ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోగానే క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లెయిమ్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండదు. (92 పైసలకే రూ.10 లక్షల బీమా) ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 695 మంది ప్రయాణికులు రిజర్వేషన్ కంపార్టుమెంట్లలో ప్రయాణిస్తున్నారని భారతీయ రైల్వేల సీపీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. వాళ్లలో కేవలం 128 మంది మాత్రమే టికెట్ బుకింగ్ సమయంలో బీమా కావాలని, దాని ప్రీమియం కట్టారు. వారిలో 78 మంది ప్రమాద సమయానికి రైల్లోనే ఉన్నారు. మిగిలిన వారు తర్వాత స్టేషన్లలో ఎక్కాల్సి ఉంది. అయితే.. మృతుల్లో ఇలా బీమా ప్రీమియం కట్టినవాళ్లు ఎంతమంది అనే విషయం కూడా ఇంకా లెక్కతీయాల్సి ఉంది. (రైలు టికెట్‌తోపాటే బీమా.. అనూహ్య స్పందన) అయితే.. నామినీ లేనంత మాత్రాన బీమా కంపెనీలు వారసులకు డబ్బు ఇవ్వబోమంటే ప్రభుత్వం ఒప్పుకొనే పరిస్థితి ఉండదు. ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని ప్రీమియం కట్టినవారిలో మృతులుంటే వారందరికీ వీలైనంత త్వరలోనే బీమా సొమ్ము ఇప్పించే ప్రయత్నం చేస్తారు. నామినీ పేరు రాయని వాళ్లకు కొంత ఆలస్యం కావచ్చు గానీ.. అసలు అందకపోయే ప్రసక్తి ఉండదని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారులు చెప్పారు. ఇక నుంచి ప్రమాద బీమాను ఐచ్ఛికం కాకుండా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అలాగే, బీమా ప్రీమియం కడుతున్నప్పుడే నామినీ పేరు కూడా రాయించాలని చెబుతున్నారు. 92 పైసలు ప్రీమియం కట్టిన తర్వాత.. ప్రయాణంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ. 10 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షలు, ఆస్పత్రి పాలైతే రూ. 2 లక్షలు, మృతదేహం తరలింపు ఖర్చుల కింద రూ. 10వేలు చెల్లిస్తారు.