breaking news
Kantara: Chapter 1 Movie
-
ఏపీలో ‘కాంతార: చాప్టర్ 1’ టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే?
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా ఛాప్టర్-1’(Kantara : Chapter 1) సినిమా టికెట్ ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంపునకు అనుమతి ఇస్తూ ఉతర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ప్రీమియర్స్‌కి కూడా అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షో పడనుంది. దీనికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే అక్టోబర్ 2 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్లిప్లెక్స్లలో రూ. 100 పెంచుకునే వెలుసుబాటుని కల్పించింది.కాంతార: చాప్టర్ 1 విషయానికొస్తే.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. -
కాంతార మేకర్స్ ప్రకటన.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం కాంతార చాప్టర్-1. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో కాంతార మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ముంబయిలోనూ బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.(ఇది చదవండి: కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్)అయితే మంగళవారం చెన్నైలో కాంతార చాప్టర్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కరూర్ ఘటన నేపథ్యంలో కాంతార నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు చెన్నైలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలవడానికి మేము ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Due to the recent unfortunate incident, we are cancelling the #KantaraChapter1 promotional event in Chennai tomorrow.Our thoughts and prayers are with those affected. Thank you for your understanding, we look forward to meeting our audience in Tamil Nadu at a more appropriate… pic.twitter.com/ROhmiu6glR— Hombale Films (@hombalefilms) September 29, 2025 -
'బాయ్‌కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?
ఉన్నట్టుండి సడన్‌గా 'కాంతార ఛాప్టర్ 1' సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ కనిపిస్తోంది. 'బాయ్ కాట్ కాంతార' అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావుడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు మనమెందుకు ఆ చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగులో మాట్లాడలేదు ఇంత పొగరా? అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పనిచేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు?రిషభ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ అందుకున్న చిత్రానికి ఇది ప్రీక్వెల్. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి సడన్‌గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే దీని వెనక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)ఎందుకంటే మొన్నీమధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్‌ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలిరోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు చిత్రానికి ఏమంత చెప్పకోదగ్గ వసూళ్లు రావటం లేదు. తొలిరోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ.. రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తుంది. ఇప్పుడు గానీ 'కాంతార 1' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారంటీ!మరి కారణం ఇదేనో ఏమో తెలీదు గానీ 'బాయ్ కాట్ కాంతార' అని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కానీ అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకుని 'కాంతార'ని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది! చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా! కానీ ఈ మధ్య కాలంలో అలాంటివే కనిపించలేదు. మరి కేవలం 'కాంతార'నే ఎందుకు టార్గెట్ చేసినట్లు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం) -
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (ఫొటోలు)
-
నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్
కొన్నిరోజుల క్రితం ఈ యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే ప్రమాదం ఏం లేదని ఆయన టీమ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత పెద్దగా బయటకు రాని ఎన్టీఆర్.. ఇప్పుడు 'కాంతార 1' కోసం వచ్చాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు.రిషభ్ శెట్టి నటించిన ఈ సినిమా.. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బెంగళూరు, కొచ్చిలో ప్రెస్ మీట్స్ జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకకు సింపుల్‌గా వచ్చిన కూర్చునేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. భుజం దిగువన చేయి పెడుతూ నొప్పిని ఫీలవుతున్నట్లు కనిపించాడు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్) ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే 'కాంతార 1' చిత్రంలోనూ తారక్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని గతంలో రూమర్స్ లాంటివి వచ్చాయి. కాకపోతే ఇవి నిజమా లేదా అనేది తెలియదు. అలానే రిషభ్ శెట్టి అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. బహుశా ఆ కారణం వల్లనో ఏమో గానీ నొప్పి ఇబ్బంది పెడుతున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. దీన్ని త్వరగానే ముగించేశారు కూడా!2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ తీశారు. అప్పుడొచ్చిన సినిమాలో ప్రస్తుతం ఏం జరిగిందనే విషయాన్ని చూపించారు. ఈసారి మాత్రం గతంలో అసలేమేం జరిగింది? అనేది చూపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైంది. అయితే ట్రైలర్లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది కానీ స్టోరీ పరంగా పెద్దగా రివీల్ చేయలేదు. మరి థియేటర్లలో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి)Man of Masses @tarak9999 arrives at grand pre-release event of #KantaraChapter1 🔥 pic.twitter.com/FKJjIQwmFT— Telugu Film Producers Council (@tfpcin) September 28, 2025 -
కాంతార ప్రీక్వెల్.. 'వరాహరూపం' లాంటి సాంగ్ విడుదల
రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (kantara). ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే 'వరాహరూపం' సాంగ్ భారీగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఇదే చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార:చాప్టర్1' లో కూడా ఇలాంటి పాటనే మేకర్స్ చేర్చారు. 'బ్రహ్మ కలశ' అంటూ శివుడి గురించి భక్తితో ఆరాధించేలే సాంగ్ ఉంది. తాజాగా విడుదలైన ఈ పాటను కృష్ణకాంత్ రచించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. అబ్బి వి ఆలపించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
Kantara Chapter 1: కసరత్తుల నుంచి కలరియపట్టు దాకా...
గత 2022లో విడుదలైన కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి సినిమా విజయాలలో నటీనటుల భాగస్వామ్యానికి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. భారతీయ సంస్కృతి ఆచారాల ఆధారంగా ఆకర్షణీయమైన కథను ఎలా రూపొందించవచ్చో చెబుతూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఆయనే హీరో. రచయిత దర్శకుడు కూడా కావడం గమనార్హం. తాజాగా రిషబ్ తన శ్రమకు తగిన ఫలితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. మరోవైపు కాంతారా 2022లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా జాతీయ అవార్డును అందుకున్నాడు.చేసే పనిమీదే మనసును లగ్నం చేసేవారిని అపజయాలు మాత్రమే కాదు భారీ విజయాలు కూడా ఆపలేవు. అందుకే రిషబ్ అంకితభావం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ కాంతారా సీక్వెల్ రూపకల్పనలోనూ కనిపిస్తూనే ఉంది. కాంతారా చిత్రాల సాక్షిగా ఆ పాత్రలో ఇమిడిపోయేందుకు తనను తాను చెక్కుకున్న శిల్పిలా మారాడు.. రిషబ్. కాంతారా సిరీస్ కోసం ఆయన నేర్చుకున్న కొన్ని నైపుణ్యాలను పరిశీలిస్తే కళ కోసం ప్రాణం పెట్టడం అంటే ఏమిటో అర్ధమవుతుంది.భూత కోలాదక్షిణ కర్ణాటక, ఉడిపి సమీప ప్రాంతాల్లో తులు మాట్లాడే వారు సంప్రదాయంగా భూత కోలా, భూత ఆరాధన పేర్లతో తమను కాపాడే ఆత్మలను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా వస్త్రధారణతో పాటు వారు చేసే నృత్యం, అరుపులు కూడా సంక్లిష్టంగా ఉంటాయి. కాంతారా సినిమాలో రిషబ్ స్వయంగా భూత కోలా ను నేర్చుకుని మరీ ప్రదర్శించాడు. అందుకే ఆ సినిమాలో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా ఆ నృత్యం మారింది.బుల్ రేస్ (కంబాల)కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ ముగిశాక సంప్రదాయంగా నిర్వహించే కంబాల రేసు కూడా కాంతారాలో హైలెట్. చిత్రీకరణ సమయంలో రిషబ్ ఇరవై నాలుగు గంటలకు పైగా ఎద్దులతో పరుగెత్తుతూనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతని నటనలోని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.కలరిపయట్టుప్రపంచంలోని పురాతన యుద్ధ కళలలో ఒకటైన కేరళకు చెందిన కలరిపయట్టును కూడా రిషబ్ అభ్యసించాడు. తెరపై అతని రూపం, పోరాటాలు∙వాస్తవికంగాగా ఉండేలా చూసుకోవడానికి, ఆ పోరాట కళను నేర్చుకోవడానికి ఆయన ఒక సంవత్సరం పాటు కష్టతరమైన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు.ట్రాన్స్ఫార్మేషన్..జిమ్‌లో వర్కవుట్స్ చేస్తే వ్యాయామం అంటారు కానీ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంటే వ్యాయామ పరిభాషలో ట్రాన్స్‌ఫార్మేషన్‌గా పేర్కొంటారు. తదుపరి రానున్న కాంతారా చాప్టర్ 1 కోసం తన శరీరాన్ని కఠినమైన కసరత్తులతో చెక్కుకున్నాడు. తొలి భాగానికి పూర్తి విరుద్ధంగా అనూహ్యమైన రీతిలో రిషబ్ కనిపిస్తాడు.గుర్రపు స్వారీతన పాత్రను పండించేందుకు రిషబ్ మరో నైపుణ్యాన్ని జోడించాడు. రానున్న కాంతారా చాప్టర్ 1లోని యాక్షన్ సన్నివేశాలకు వాస్తవికత అద్దేందుకు ఆయన గుర్రపు స్వారీని నేర్చుకున్నాడు.సాంప్రదాయ ఆచారాలను నేర్చుకోవడం మరియు పురాతన యుద్ధ కళలను నేర్చుకోవడం వంటి రిషబ్ శెట్టి అంకితభావం, కాంతారా ఎందుకు ఒక సంచలనం అయ్యిందో మరియు కాంతారా చాప్టర్ 1 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలుగా ఎందుకు నిలిచిందో చూపిస్తుంది. రిషబ్ తన అసాధారణ ప్రతిభ మరియు సజనాత్మక విధానంతో కథను రీమేక్ చేస్తూనే ఉన్నాడు. -
కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్.. జోష్‌లో ఫ్యాన్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ట్రైలర్ దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు.కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేయనున్నారు. -
ఎప్పటికీ రుణపడి ఉంటా.. ఎల్లలు లేని ఆనందంలో రుక్మిణి
కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే మనసు ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతుంది. నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు అలాంటి ఆనందంలో తేలిపోతున్నారు. 2019లో మాతృభాషలో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత హిందీలో అప్‌స్టార్ట్స్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులోకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ దిగుమతి అయిన ఈమె తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఏస్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసీ చిత్రం విజయానందాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కన్నడంలో రిషబ్ శెట్టితో నటించిన కాంతార. చాప్టర్ 1 చిత్రం అక్టోబర్ 2న పాన్ ఇండియా చిత్రంగా తెరపైకి రానుంది. దీనితో పాటూ యష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్‌తో పాటు తెలుగులో ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో రుక్మిణి వసంత్ పేర్కొంటూ తనను నటిగా అంగీకరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. కాంతార చాప్టర్ 1 తనకు చాలా ముఖ్యమైన చిత్రం అన్నారు. తన నటనను చూసిన రిషబ్ శెట్టి అద్భుతం అన్న అభినందనను జీవితంలో మరిచిపోలేనన్నారు. అదే విధంగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తన మనసు ఎల్లలు లేని ఆనందంలో మునిగితేలుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నానని నటి రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడి కెరీర్ మంచి జోష్‌లో సాగుతోందన్నమాట. -
కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్!
ఈ ఏడాది సినీజనం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కాంతార ప్రీక్వెల్ ఒకటి. 2022లో వచ్చిన కాంతార మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్‌గా వస్తోంది కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie). రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది.కాంతార చూడాలంటే..అయితే కాంతార చూడాలంటే కొన్ని నియమాలు పాటించాలంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మద్యం సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు, మాంసం తినకూడదు. కాంతార చూసేవరకు వీటిని కచ్చితంగా ఫాలో అవండి అన్నది ఆ పోస్ట్ సారాంశం. అయితే అది ఫేక్ ప్రచారమని కొట్టిపాడేశాడు రిషబ్ శెట్టి (Rishab Shetty). బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకరి అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిష్టం వారిది. డిలీట్ చేశారుకొందరు ఫేక్ పోస్ట్ సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చింది. అది చూడగానే నేను షాకయ్యాను. వెంటనే దాన్ని నిర్మాతల గ్రూప్‌కు పంపించాను. ఆ పోస్ట్ చూశాక వెంటనే స్పందించలేకపోయాం. సినిమా పేరు ట్రెండింగ్‌లో ఉండటంతో పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ ఫేక్ పోస్ట్ చేసినవారు దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు అని రిషబ్ శెట్టి తెలిపాడు.చదవండి: బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు ట్రోలింగ్? -
'ఓజీ'ని డామినేట్ చేసిన రిషబ్‌శెట్టి
టాలీవుడ్లో కేవలం వారం గ్యాప్‌లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ, అక్టోబర్ 2న రిషబ్‌శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్‌శెట్టి నటించిన కాంతారనే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్‌ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే, కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్ ట్రైలర్ ఏకంగా 15 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్‌శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్ చేశారంటూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్‌కు కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్ దాటేసింది.'హరి హర వీరమల్లు' ట్రైలర్‌కు 48 మిలియన్ల వ్యూస్ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వ్యూస్ కోసం బాట్స్ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్‌కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
కాంతార ప్రీక్వెల్.. అంచనాలకు తగ్గట్లుగానే బిగ్ ప్లాన్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కాంతార చాప్టర్-1(Kantara Chapter 1). పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్)అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రీక్వెల్ మూవీ కోసం ఇప్పటికే బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. కాంతార ప్రీక్వెల్‌ను దేశవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ కానుంది. అంతే కాకుండా దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో.. ఇప్పుడు ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి పోస్ట్ ప్రొడక్షన్పనుల్లో బిజీగా ఉన్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. -
107 మిలియన్ వ్యూస్.. ‘కాంతార: చాప్టర్ 1’ ఖాతాలో సరికొత్త రికార్డు!
2022లో రికార్డు సృష్టించిన ‘కాంతర’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రాబోతున్న చిత్రం కాంతార: చాప్టర్ 1(Kantara Chapter 1 ). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్, మలయాళంతో పృ థ్విరాజ్, తమిళ్లో శివకార్తికేయన్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ మూవీలొ రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.𝟏𝟎𝟕𝐌+ 𝐕𝐢𝐞𝐰𝐬 & 𝟑.𝟒𝐌+ 𝐋𝐢𝐤𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐡𝐨𝐮𝐫𝐬…🔥The Trailer of #KantaraChapter1 takes the internet by storm, igniting massive excitement everywhere.Watch #KantaraChapter1Trailer now – https://t.co/YVnJsmn7VxIn cinemas #KantaraChapter1onOct2 ✨#Kantara… pic.twitter.com/WyjLETiGsX— Hombale Films (@hombalefilms) September 23, 2025 -
హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే టికెట్ రేట్ల విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్ర నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయించారు. గత కొన్నిరోజులుగా ఈ కేసు విషయమై వాదనలు నడిచాయి. ఇప్పుడు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.కర్ణాటకలోని టికెట్ రేట్లని ప్రభుత్వం నిర్ణయిస్తూ కొన్నిరోజుల క్రితం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏ థియేటర్లోనైనా సరే రూ.200 కంటే ఎక్కువ ధరకు టికెట్ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. 'కాంతార'కి ఇదే అమలు చేస్తే పెట్టిన బడ్జెట్ తిరిగి రావడం కష్టమవుతుంది. దీంతో నిర్మాతలు హైకోర్ట్‌కు వెళ్లారు. టికెట్ ధరల్లో వెసులుబాటు కల్పించాలని పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వ రూల్‌ని తాత్కాలికంగా హోల్ట్‌లో పెట్టింది. టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు నిర్మాతలకు కల్పించింది.(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)ఈ క్రమంలోనే 'కాంతార' టికెట్ రేట్ల విషయంలో లైన్ క్లియర్ అయింది. ఫలితంగా కర్ణాటకలో భారీ రేట్లు ఉండబోతున్నాయి. తమిళనాడులో ఎలానూ రూ.200 లోపే టికెట్ ధర ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి పెంపు ఏమైనా తీసుకొస్తారా? లేదంటే ఉన్న రేట్లకు టికెట్స్ అమ్ముతారా అనేది చూడాలి?'కాంతార' తొలి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమాని తీశారు. ఈసారి భారీ ఎత్తున మూవీని తెరకెక్కించారు. ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, భక్తి, యుద్ధాలు తదితర అంశాలు ఉన్నాయి. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. ఇతడికి జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.(ఇదీ చదవండి: ఈ హీరోలు అసలెక్కడున్నారు? సినిమాలు ఎందుకు చేయట్లేదు?) -
'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి
కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సినిమా గురించి మాట్లాడాడు. అలానే 'కాంతార 1' చూడాలంటే మందు, సిగరెట్, మద్యం సేవించకుండా రావాలని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్‌పైన స్పందించాడు.'కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ. తొలి భాగానికి రెండేళ్లు, ప్రీక్వెల్ కోసం మూడేళ్లు. ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను. అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది. మా టీమ్‌కి గత మూడు నెలలుగా సరైన నిద్ర లేదు. ఎందుకంటే పని జరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు. చెప్పాలంటే షూటింగ్లో నేను కూడా 4-5 సార్లు చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దైవమే నన్ను రక్షించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)'కాంతార' తొలి భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు. స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది. అలానే శివ(రిషభ్) తండ్రి కాంతార, అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ డ్రాప్‌తో ప్రీక్వెల్ తీశారు. ఈసారి స్నేహం, నమ్మకద్రోహం, యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్లో చూపించారు. బ్యౌక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసారి రిషభ్ శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.ఇకపోతే 'కాంతార 1' సరికొత్త రికార్డ్ సృష్టించింది. 12 గంటల్లోపే అన్ని భాషాలు కలిపి 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం మధ్యాహ్నం వస్తే 24 గంటలు పూర్తవుతుంది. అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్‌తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా చూడాలంటే మందు, సిగరెట్, మద్యం తాగకుండా రావాలని వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని రిషభ్ శెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. తొలుత ఇది చూసి షాకయ్యానని, నిర్మాణ సంస్థని అడిగితే అది ఫేక్ పోస్టర్ అని క్లారిటీ ఇచ్చారని, దాని గురించి మాట్లాడలనుకోవట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)"#KantaraChapter1: We haven't slept properly for 3 months because of continuous work🫡👏. Everyone supported it as like their own film♥️. In fact, if I count, I was about to die 4 or 5 times during shoot, the divinity we trust saved me🛐♥️"- #RishabShetty pic.twitter.com/8pufSUj7ZI— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025"#KantaraChapter1: I got shocked when I saw no smoking, no alcohol, and no meat Poster😳. In fact I cross checked with the production too🤝. Someone has fakely posted it to get popularity, we don't even want to react for that fake poster❌"- #RishabShettypic.twitter.com/I89jj7y7GP— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025 -
'కాంతార' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?
కాంతార ప్రపంచంలోకి వెళ్లేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇదే క్రమంలో ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. 2022లో విడుదలైన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్1' తెరకెక్కింది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.కాంతార చాప్టర్1 చిత్రానికి U/A 16+సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్‌తో ఉన్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అయితే, సెన్సార్‌లో 16 ప్లస్ మాత్రమే అని మెన్షన్ చేయడంతో చిన్నపిల్లలకు ఈ సినిమా చూసే అవకాశం లేదని చెప్పవచ్చు. ఐనాక్స్, పీవీఆర్ వంటి మల్టిఫ్లెక్స్‌లలో చిన్నపిల్లలకు ఎంట్రీ కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పవచ్చు.తాజాగా విడుదలైన ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌తో ‘సలార్’ మూవీ చేసిన ప్రభాస్ ఇప్పుడు కాంతార కోసం తనవంతుగా చేతులు కలిపారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను డార్లింగ్ విడుదల చేశారు. తమిళ్ శివ కార్తికేయన్, హిందీలో హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ట్రైలర్ లాంచ్ చేయించి పాన్ ఇండియా మార్కెట్‌ను ఆకర్షించారు. ‘కాంతార’ సినిమా లాగే ఈ కథ కూడా అడవిని నమ్ముకుని జీవించే గిరిజన తెగ చుట్టూ తిరుగుతుంది. మట్టిపై వాళ్లకున్న మమకారంతో పాటు వాళ్ల సంప్రదాయాలు కనిపించనున్నాయి. అక్కడి తెగను అణగదొక్కి వాళ్ల సంపదను దోచుకోవాలనుకునే దురాశపరుడైన రాజును ఎలా ఎదొర్కొన్నారనే అంశాలు ట్రైలర్లో కనిపించాయి. -
ప్రభాస్ చేతుల మీదుగా 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ విడుదల
-
'కాంతార' ట్రైలర్ రిలీజ్.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్
2022లో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకున్న సినిమా 'కాంతార'. దీని ప్రీక్వెల్‌ని 'కాంతార ఛాప్టర్ 1' పేరుతో తీశారు. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అక్టోబరు 02న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చిన్నారి పెళ్లికూతురు'కి ఇప్పుడు నిజంగానే పెళ్లి)ట్రైలర్ చూస్తుంటే ఈసారి భారీతనం కనిపిస్తోంది కానీ ఓకే ఓకే అనిపించింది. రిషభ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్.. రుక్మిణి వసంత్ అందం ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునేలా కనిపించాడు. 'కాంతార' తొలి భాగంలో ప్రస్తుతం ఏం జరిగిందా అనే డ్రామాని సింపుల్‌గా చూపించారు. ఈసారి మాత్రం రాజులు, యుద్ధాలు, రాజకుమారితో హీరో ప్రేమలో పడటం ఇలా అన్ని కూడా భారీగానే సెటప్ చేశారు. మరి 'కాంతార' ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు) -
కాంతారా 2 ప్రమోషన్స్ షురూ..! రిషబ్ కోసం రంగంలోకి ప్రభాస్
-
ట్రైలర్ రెడీ
రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (సెప్టెంబరు 22) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్, హిందీ ట్రైలర్‌ను హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివకార్తికేయన్, మలయాలం ట్రైలర్‌ను పృథ్వీరాజ్ సుకు మారన్లు డిజిటల్‌గా విడుదల చేయనున్నారు.‘‘ఈ సినిమా కోసం 3వేలమంది ప్రజలు, 500 మంది యోధులు పాల్గొన్న ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందుకోసం 25 ఎకరాల స్థలంలో ఓ పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఈ యుద్ధ సన్నివేశం ఒకటిగా నిలుస్తుంది.‘కాంతార’ (‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది) విజయాన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ రాజీ పడటం లేదు. ఆడియన్స్‌కు థియేటర్స్‌లో గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. -
కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?
మరో రెండు వారాల్లో 'కాంతార' కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మిగతా అన్నీ పనులు పూర్తయినప్పటికీ సొంత రాష్ట్రంలోనే ఓ సమస్య ఇబ్బందిగా మారింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారని టాక్. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్‌గానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా టికెట్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించేసింది. మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ టికెట్ ధర రూ.236 మాత్రమే ఉంది. ఇంతకంటే పెంచడానికి వీలు లేదని తీర్మానించింది. దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. చిన్న బడ్జెట్ మూవీస్‌కి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 'కాంతార' లాంటి చిత్రానికి పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయమై నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అరుంధతి రీమేక్‌లో శ్రీలీల.. 'మెగా' డైరెక్టర్!)టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని 'కాంతార' నిర్మాతలు రిట్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే.. వీళ్లతో పాటు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు మార్గం సుగమమం అవుతుంది. లేదంటే 'కేజీఎఫ్' రికార్డులు కాదుకదా రూ.1000 కోట్ల మార్క్ కూడా దాటడం కష్టమైపోతుంది. అలానే కర్ణాటకలో తక్కువ రేట్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర పెడితే మాత్రం కచ్చితంగా విమర్శలు వస్తాయి. మరి ఈ పిటిషన్‌పై ఫలితం ఏమొస్తుందో చూడాలి?దసరా కానుకగా అక్టోబరు 2న 'కాంతార: ఛాప్టర్ 1' థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ సింపుల్‌గా రూ.15-20 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో రెండో భాగాన్ని కళ్లు చెదిరే బడ్జెట్ పెట్టారు. అలానే రుక్మిణి వసంత్ లాంటి నటుల్ని సినిమాలో భాగం చేశారు. మరి ఈసారి 'కాంతార' ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో?(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!)