పెళ్లై వారం కాకముందే...
పంజాగుట్ట: పెళ్లి చేసుకున్న వారం రోజులకే తన భర్త తనను కాదని పోయాడని ఓ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన వివరాల్లోకి వెలితే మెదక్ జిల్లాకు చెందిన యువతి (25) సోమాజిగూడలోని వివేకానంద ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుంది. ఈమెకు పార్క్ హోటల్లో విధులు నిర్వహించే హర్యానాకు చెందిన కపిల్ రోహిరా (26)తో పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారి గత సంవత్సరం నవంబర్ 28వ తేదీన వీరు వివాహం చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న కేవలం వారం రోజులకే కపిల్ కనిపించకుండా పోయాడు. అప్పటినుండి అతని ఫోన్ కూడా ఆఫ్‌లో ఉంది. కాగా సుమారు 10 నెలల తర్వాత కపిల్ సోమాజిగూడ ప్రాంతంలో సదరు యువతికి కనిపించగా ఆమె అతన్ని కలిసి తనను ఎందుకు వదిలి వెల్లావు అని ప్రశ్నించగా నీవంటే నాకు ఇష్టంలేదని అందుకే వెల్లిపోయానని సమాధానం చెప్పాడు. సదరు యువతి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు కపిల్ కోసం గాలిస్తున్నారు.