Karauli
-
రూ.11 కోట్ల చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో కరౌలీ జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మెహందీపూర్ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎస్బీఐ మెహందీపూర్ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. -
చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్‌కు ప్రమోషన్
మంటల్లో చిక్కుకున్న చోటు నుంచి ఓ పసికందును.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన కానిస్టేబుల్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ కరౌలీలో శనివారం మత ఘర్షణలు చెలరేగాయి. ఆ టైంలో పోలీస్ కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ Netresh Sharma చేసిన సాహసంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం రోజు ర్యాలీ సందర్భంగా.. కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైంది. ఆ టైంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నేత్రేష్ గాయపడ్డ వాళ్లకు సాయం చేశాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు నిప్పు అంటుకున్న రెండు షాపుల మధ్య ఇంటి నుంచి మహిళను, ఆమె చంటి బిడ్డను నేత్రేష్ ఆదుకోవడం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. "तम में प्रकाश हूँ, कठिन वक़्त की आस हूँ।" So proud of constable Netresh Sharma of Rajasthan Police for saving a precious life. This picture is in deed worth a thousand words.. pic.twitter.com/U2DMRE3EpR — Sukirti Madhav Mishra (@SukirtiMadhav) April 4, 2022 ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఈ రియల్ హీరో సింపుల్‌గా ‘అది నా బాధ్యత’ అంటూ చెప్పాడు. అయితే తమ కానిస్టేబుల్ తెగువను రాజస్థాన్ పోలీస్ శాఖ మాత్రం గర్వంగా భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దృష్టికి ఈ విషయం వెల్లడంతో స్వయంగా నేత్రేష్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాదు.. కానిస్టేబుల్‌గా ఉన్న నేత్రేష్‌ను హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. करौली में अपना कर्तव्य निभाते हुए 4 लोगों की जान बचाने वाले कांस्टेबल श्री नेत्रेश शर्मा से फोन पर बात कर उन्हें शाबासी दी। श्री नेत्रेश को हेड कांस्टेबल के पद पर पदोन्नत करने का निर्णय किया है। अपनी जान की परवाह ना कर कर्तव्य निभाने वाले श्री नेत्रेश का कार्य प्रशंसनीय है। pic.twitter.com/3p4ekYNYhn — Ashok Gehlot (@ashokgehlot51) April 4, 2022 ఘర్షణలు చెలరేగిన వెంటనే.. ఇంటర్నెట్పై పరిమిత ఆంక్షలు, 144 సెక్షన్ విధించిన పోలీసులు చాకచక్యంగా పరిస్థితిని అదుపు చేయగలిగారు. ఇక ఘర్షణలకు సంబంధించి 46 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముగ్గురు సభ్యుల కమిటీ ఒకటి ఘర్షణలకు సంబంధించి నిజనిర్ధారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్, రఫిక్ ఖాన్లు ఉన్నారు. एक मां को साथ लिए, सीने से मासूम को चिपकाए दौड़ते खाकी के कदम।#RajasthanPolice के कांस्टेबल नेत्रेश शर्मा के जज्बे को सलाम। करौली उपद्रव के बीच आमजन की सुरक्षा पुख्ता करने में जुटी पुलिस। @RajCMO @DIPRRajasthan @KarauliPolice pic.twitter.com/XtYcYWgZWs — Rajasthan Police (@PoliceRajasthan) April 3, 2022 -
ఆలయ పూజారి దారుణ హత్య
జైపూర్: రాజస్తాన్‌లో ఆలయ భూముల కబ్జాను అడ్డుకుంటున్న ఓ పూజారిని దారు ణంగా హత్య చేసిన ఘటన బుధవారం జరిగింది. కరౌలీ జిల్లాలోని బుక్నా గ్రామంలో ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. ఆలయ పూజారి బాబూలాల్ వైష్ణవ్ ఎప్పటికప్పుడు దాన్ని అడ్డుకునేవారు. ఆయన ఉంటే తమ ఆటలు సాగవనే కక్షతో కబ్జాదారులు పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. ఆలయ పూజారి హత్యకు గురికావడం దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పూజారి హత్యోదంతంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూర్ణియా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడం బదులు రాజస్తాన్‌లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో దారుణంగా విఫలమైందని జవదేకర్ విమర్శించారు. పూజారి ప్రాణాలను బలిగొన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై బీజేపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
వాజ్పేయినైనా మోడీ దూరంగా ఉంచేవారు: రాహుల్
కరౌలీ(రాజస్థాన్): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాజస్థాన్‌లోని కరౌలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, జస్వంత్ సింగ్ వంటి వారిని మోడీ పక్కకు నెట్టారని విమర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రజాజీవితంలో కొనసాగి ఉంటే ఆయనను కూడా దూరంగా ఉంచేవారన్నారు. దేశానికి వాచ్‌మేన్‌గా ఉంటానన్న మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన దేశానికి కాకుండా బడావ్యాపాస్తులకు మాత్రమే వాచ్‌మేన్‌గా ఉంటారని విమర్శించారు. గుజరాత్లో అభివృద్ధి మోడీ ఒక్కరి వల్ల జరగలేదని అక్కడి రైతులు, కార్మికుల శ్రమ ఫలితంగా అభివృద్ధి చెందిందన్నారు.