కరౌలీలో సభావేదికపైన రాహుల గాంధీ, పక్కన ఆజ్మీర్ కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఆశోక్ గేహ్లాట్
కరౌలీ(రాజస్థాన్): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాజస్థాన్‌లోని కరౌలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి సీనియర్ నేతలు ఎల్కె అద్వానీ, జస్వంత్ సింగ్ వంటి వారిని మోడీ పక్కకు నెట్టారని విమర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రజాజీవితంలో కొనసాగి ఉంటే ఆయనను కూడా దూరంగా ఉంచేవారన్నారు.
దేశానికి వాచ్మేన్గా ఉంటానన్న మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన దేశానికి కాకుండా బడావ్యాపాస్తులకు మాత్రమే వాచ్మేన్గా ఉంటారని విమర్శించారు. గుజరాత్లో అభివృద్ధి మోడీ ఒక్కరి వల్ల జరగలేదని అక్కడి రైతులు, కార్మికుల శ్రమ ఫలితంగా అభివృద్ధి చెందిందన్నారు.