Karem
-
వారిద్దరూ దళిత ద్రోహులే...
కారెం, చంద్రబాబులపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం మధురపూడి : దళితుల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కారెం శివాజీలు.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం తగదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, రాజోలు నియోజవకర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలమునికుమారి అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కూడా మంజూరు చేయని చంద్రబాబును సన్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న కారెం శివాజీ వ్యూహాత్మకంగానే సన్మాన కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందారన్నారు. చంద్రబాబు దళితులకు చేసిన ద్రోహులను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఆత్మవిమర్శ చేసుకోకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని చంద్రబాబు, కారెంలకు హితవు పలికారు. లేకుంటే దళితులే తగిన బుద్ధి చెబుతారని నిర్మలకుమారి, రాజేశ్వరరావు, మునికుమారి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
హర్షకుమార్ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు -
హర్షకుమార్ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’ రిజర్వేషన్లూ సాధిద్దాం
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ అమలాపురం టౌన్ : దళితులు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగితే హక్కుల సాధనే కాదు..ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను సాధించుకోవచ్చని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ప్రైవేటు రిజర్వేషన్లకు కృషి చేద్దామని చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కోనసీమ ప్రాంత దళిత ముఖ్య నాయకులతో స్థానిక కాటన్ అతిథిగృహంలో బుధవారం ఉదయం నిర్వహించిన సభకు శివాజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని ఖచ్చితంగా అమలు పరిచేందుకు, దళిత గిరజనులకు ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని శివాజీ అన్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరంలోని ఆరŠట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దళిత గిరజనుల మహాగర్జన భారీ బహిరంగ సభకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందన సభను కూడా ఇదే వేదికపై ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే ఈ సభలో ఆయనను దళితులు, గిరిజనుల తరఫున సత్కరిస్తామని చెప్పారు. అనంతరం దళిత గిరజన మహాగర్జన సభ పోస్టర్లు, బ్రోచర్లను శివాజీ, దళిత నాయకులు విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, కోనసీమ దళిత నాయకులు జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, నాగాబత్తుల శ్రీనివాసరావు, బొంతు బాలరాజు, పెనుమాల చిట్టిబాబు, కుసుమ సూర్యమోహనరావు, దేవరపల్లి శాంతికుమార్, ఉండ్రు బుల్లియ్య, కాశి వెంకట్రావు ప్రసంగించారు. -
కులవ్యవస్థను నిర్మూలించాలి
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పిలుపు ఇచ్చారు. నన్నయ యూనివర్సిటీలో బుధవారం జాతీయ దళిత సదస్సును ఆయన ప్రారంభించారు. దళితుల సంక్షేమం కోసం 30 ఏళ్లు పోరాడినా, విదేశాలలో సన్మానాలు పొందినా, నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కి చైర్మన్ పదవి లభించినా ఏదో వెలితిగానే ఉందన్నారు. కుల వ్యవస్థను పోగొట్టలేకపోయానే వెలితి తనను వేధిస్తోందన్నారు. అమెరికాలో కంప్యూటర్లు ‘పాస్వర్డ్’ అడుగుతుంటే మన దేశంలో మాత్రం ‘కులం’ అడుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ పుట్టి ఉండకపోతే దళితులకు రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు. మహనీయులు గుర్రం జాషువా, భగత్‌సింగ్ పుట్టిన రోజున ఈ సదస్సు నిర్వహించడం హర్షణీయమని వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. కవులు మాత్రమే ఎల్లకాలం ప్రజల నాల్కలపై నిలిచి ఉంటారంటూ.. జాషువా, అంబేడ్కర్ రచనలను ప్రస్తావించారు. దేశంలో ఇప్పటికీ దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారని సదస్సు కో–కన్వీనర్, వర్సిటీ తెలుగు అధ్యాపకుడు డాక్టర్ టి.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కల్యాణి అన్నారు. 13 తీర్మానాలు ఆమోదం కన్వీనర్ డాక్టర్ ఎలీషాబాబు ప్రవేశపెట్టిన 13 తీర్మానాలను సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘కుల రహిత సమాజగా తీర్చిదిద్దాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, యూనివర్సిటీలో దళిత కవులు కుసుమ ధర్మన్న, బోయి భీమన్నల సాహిత్య పీఠాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లైబ్రరీకి అంబేడ్కర్, బాలికల వసతి గృహానికి సావిత్రీబాయి ఫూలే పేర్లు పెట్టాలని, యూనివర్సిటీకి 12–బి హోదాను ఇవ్వాలని, వర్సిటీలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానాలు ఆమోదించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు, ఈసీ మెంబర్ డాక్టర్ సువర్ణకుమార్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ కె. సుబ్బారావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జీవీ రత్నం, డాక్టర్ వి.కిషోర్, కో కన్వీనర్లు డాక్టర్ జానకిరావు, డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆర్వీఎస్ దొర, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తీరు మారకుంటే కఠిన చర్యలు కోటగుమ్మం : ఎస్సీ, ఎస్టీల విషయంలో రెవెన్యూ శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వ్యాఖ్యానించారు. రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ్య విశ్వ విద్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు జిల్లాకు వచ్చిన ఆయన రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 13 జిల్లాల్లో పర్యటించడంతో పాటు 70 శాతం విశ్వ విద్యాలయాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ దళిత, గిరిజనుల నుంచి వినతులు అందుతున్నాయని, వాటిని సంబంధిత శాఖలకు బదలాయించి 15 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఇప్పటి వరకూ 3 వేల వినతులు వచ్చినట్టు తెలిపారు. దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు 24 గంటల్లో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. -
‘నన్నయ’ 12బి స్టేటస్‌కు కృషి చేస్తా
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ ముంపు మండలాల్లో వర్సిటీ సమాచారం ప్రచారం చేయాలని సూచన రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 12బి స్థాయిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. వర్సిటీని సోమవారం సందర్శించిన ఆయన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేస్తున్న తీరుపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి రోస్టర్‌ను పాటిస్తూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని సూచించారు. సం» ంధిత రిజిస్టర్‌ను టా సోషల్ ఆడిట్ చేయించాలని, వర్సిటీలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థుల కోసం ఒక లైజానింగ్ అధికారిని నియమించాలన్నారు. వర్సిటీ సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల వారికి కూడా తెలియజేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుల వివక్ష చూపిన వారిని, ర్యాగింగ్‌కి పాల్పడిన వారిని ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలన్నారు. సాహిత్య పీఠాలను ఏర్పాటు చేయాలి జిల్లాకు చెందిన మహాకవులు బోయి భీమన్న, కుసుమ ధర్మన్నల సాహిత్య పీఠాలను ఏర్పాటుచేయాలని శివాజీ సూచించారు. తక్కువ వయసులోనే లోక్‌సభ స్పీకర్ అయిన జీఎంసీ బాలయోగి గురించి పరిశోధన జరగాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. యూనివర్సిటీ అభివృద్ది విషయమై ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు శివాజీతో చర్చించారు. 12 బి స్టేటస్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి వీలుంటుందన్నారు. దీనిని సాధించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలిపారు. ఆ స్టేటస్‌ని సాధించడంలో తన వంతు కృషి చేస్తానని శివాజీ హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు మణిహారంగా ఉన్న నన్నయ వర్సిటీ అభివృద్ధికి, పీజీ, ఫార్మసీ తదితర కళాశాలల విలీనానికి సీఎం, విద్యా శాఖ మంత్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ కె.సుబ్బారావు, డీన్లు డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ కల్యాణి, ఫైనాన్స్ అధికారి కె.శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
'జూపూడి, కారెం చంద్రబాబుకు దళారీలు'
నెల్లూరు (సెంట్రల్) : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కారెం శివాజిలు సీఎం చంద్రబాబుకు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. నెల్లూరులోని ఒక హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూపూడి, కారెం శివాజికి ఆ పదవులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరూ కోరుకోరు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం ఆయన నియంత పాలనకు నిదర్శనమన్నారు. సీఎం వ్యాఖ్యలకు రాష్ర్ట వ్యాప్తంగా దళితులు నిరసనలు చేపడుతుంటే కారెం, జూపూడిలు బాబుకు వత్తాసు పలకడం దళితులకు ద్రోహం చేయడమేనన్నారు. దళితుల ముసుగులో అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్న కారెం శివాజిని ఉన్నతమైన పదవిలో కూర్చోపెట్టడం ఎంత వరకు సబబన్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా వారం రోజుల పాటు ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 23న ప్రభుత్వ కార్యాలయాల ముందు చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు.