‘నన్నయ’ 12బి స్టేటస్‌కు కృషి చేస్తా | nanayya | Sakshi
Sakshi News home page

‘నన్నయ’ 12బి స్టేటస్‌కు కృషి చేస్తా

Published Mon, Sep 12 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

‘నన్నయ’ 12బి స్టేటస్‌కు కృషి చేస్తా

‘నన్నయ’ 12బి స్టేటస్‌కు కృషి చేస్తా

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శివాజీ
  • ముంపు మండలాల్లో వర్సిటీ సమాచారం ప్రచారం చేయాలని సూచన
  • రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
    ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 12బి స్థాయిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. వర్సిటీని సోమవారం సందర్శించిన ఆయన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేస్తున్న తీరుపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి రోస్టర్‌ను పాటిస్తూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని సూచించారు. సం» ంధిత రిజిస్టర్‌ను టా సోషల్‌ ఆడిట్‌ చేయించాలని, వర్సిటీలో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థుల కోసం ఒక లైజానింగ్‌ అధికారిని నియమించాలన్నారు. వర్సిటీ సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల వారికి కూడా తెలియజేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్, హ్యూమన్‌ రీసోర్స్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్‌ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుల వివక్ష చూపిన వారిని, ర్యాగింగ్‌కి పాల్పడిన వారిని ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలన్నారు.
    సాహిత్య పీఠాలను ఏర్పాటు చేయాలి 
    జిల్లాకు చెందిన మహాకవులు బోయి భీమన్న, కుసుమ ధర్మన్నల సాహిత్య పీఠాలను ఏర్పాటుచేయాలని శివాజీ సూచించారు. తక్కువ వయసులోనే లోక్‌సభ స్పీకర్‌ అయిన జీఎంసీ బాలయోగి గురించి పరిశోధన జరగాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. యూనివర్సిటీ అభివృద్ది విషయమై ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ.నరసింహరావు శివాజీతో చర్చించారు. 12 బి స్టేటస్‌ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి వీలుంటుందన్నారు. దీనిని సాధించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలిపారు. ఆ స్టేటస్‌ని సాధించడంలో తన వంతు కృషి చేస్తానని శివాజీ హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు మణిహారంగా ఉన్న నన్నయ వర్సిటీ అభివృద్ధికి, పీజీ, ఫార్మసీ తదితర కళాశాలల విలీనానికి సీఎం, విద్యా శాఖ మంత్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఎస్‌.లింగారెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ పి.సురేష్‌వర్మ, డాక్టర్‌ కేఎస్‌ రమేష్, డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, డాక్టర్‌ కె.సుబ్బారావు, డీన్లు డాక్టర్‌ ఎస్‌.టేకి, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కల్యాణి, ఫైనాన్స్‌ అధికారి కె.శ్యామల తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement