ఇన్‌స్టాలో పరిచయం.. మద్యం తాగించి అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పుర: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికతో ప్రేమాయణం సాగించిన ఓ వ్యక్తి లాడ్జికి పిలిచి, మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన ఇద్దరు స్నేహి తులతోనూ అఘాయిత్యం చేయిం చాడు. ఈ వీడియోలు తన వద్ద ఉన్నాయని భయపెట్టి మళ్లీ ఓయో రూమ్‌కు రప్పించి దారుణానికి పాల్పడ్డాడు.
మానసిక వైద్యుడి కౌన్సెలింగ్ ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు కార్ఖానా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసిన అధికా రులు నిందితులపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో అత్యాచారం జరిగిన హోటల్, లాడ్జి యజమానులనూ నిందితులుగా చేర్చారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ పేరుతో వలవేసి...
కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే పదో తరగతి విద్యార్థిని(బాలిక)కి సైదా బాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థితో (మైనర్) కొన్నాళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. కొన్ని రోజులు ఆమెతో చాటింగ్ చేసిన ఇతను ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దింపాడు. ఈ క్రమంలో మార్చి నెలల్లో కలుద్దామంటూ ప్రతిపాదించాడు. ఇతడి మాటలు నమ్మిన బాలిక అంగీకరించింది.
కొత్తపేటలోని సింధూర హోటల్లో రూమ్ బుక్ చేసిన బాలుడు.. ఆమెను అందులోకి తీసుకువెళ్లాడు. బాలికతో మద్యం తాగించి మత్తులో ఉండగా అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడైన వనస్థలిపురానికి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థితో (మైనర్) పాటు డిగ్రీ చదువుతున్న రిషిత్‌ను (19) పిలిపించాడు. స్పృహలేని స్థితిలో ఉన్న బాలికపై వీరిద్దరూ సైతం అత్యాచారం చేశారు. ఆపై బాలికను ఆమె ఇంటి సమీపంలో దింపి వచ్చారు.
వీడియోలు ఉన్నాయంటూ మరోసారి
రెండు రోజుల తర్వాత టెన్త్ విద్యార్థి బాలికకు మళ్లీ ఫోన్ చేశాడు. ఆ రోజు జరిగినదంతా తన స్నేహితులు వీడియో రికార్డు చేశారని చెప్పి భయపెట్టాడు. అవి డిలీట్ చేయడానికి ఇద్దరం కలిసి మాట్లాడ దామని చెప్పి ఎల్బీనగర్కు రప్పించాడు. అక్కడి ఓయో రాజ్‌స్టే లాడ్డిలో రూమ్ బుక్ చేసి బాలికను తీసుకువెళ్లాడు. అక్కడ మరో సారి ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు.
మరో ఇద్దరు స్నేహితులైన బీఈఎల్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థి సాయి చైతన్య (20), బీబీఏ విద్యార్థి శౌర్యలను (20) అక్కడకు పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న బాలికపై వీళ్లూ అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు తెల్లవారుజామున బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వచ్చారు. ఈ ఉదంతం మార్చి 3న చోటు చేసుకుంది.
మానసిక వైద్యుడి కౌన్సెలింగ్‌తో...
రెండుసార్లు సామూహిక అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర షాక్‌కు లోనైంది. అర్ధరాత్రి దాటే వరకు బయట ఉండి వచ్చిన ఆమెను తల్లిదండ్రులు మందలించడంతో ముభావంగా ఉంటూ తరచూ భయ పడుతోంది. బాలికలో వచ్చిన మార్పుల్ని గమనించిన తల్లిదండ్రులు ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల పాటు ఆయన కౌన్సెలింగ్ చేయడంతో నోరు విప్పిన బాలిక తనపై జరిగిన అఘాయి త్యాలను బయటపెట్టింది. బాలిక తండ్రి గత నెల 30న కార్ఖానా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
నిందితులుగా ఆ ఇద్దరూ సైతం...
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ బి.రవీందర్ నేతృత్వంలోని బృందం ఇద్దరు మైనర్ల సహా ముగ్గురు నిందితులను ఈ నెల 1న పట్టుకున్నారు. మరుసటి రోజు మేజర్లను జైలుకు, మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించారు. బాలికను తీసుకెళ్ల డానికి వినియోగించిన రిషిత్ కారును స్వాధీనం చేసుకున్నారు.
అలాగే సింధూర హోటల్ యజమాని రాహుల్, ఓయో రాజ్ స్టే యజమాని హరీశ్‌ను కూడా నిందితు లుగా చేర్చారు. ఈ అత్యాచారాలను పరో క్షంగా ప్రేరేపించినట్లు వారిపై ఆరోపణలు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి..