పోలీసుల 'లిమిట్' లొల్లి.. నలుగురు మృతి
హైదరాబాద్: పోలీసుల నిర్లక్ష్యం నలుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. చావుబతుకుల్లో ఉన్న వారిని కాపాడాల్సిందిపోయి పరిధుల పంచాయతీ పెట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాజధాని నగరంలోని తిరుమలగిరిలో ఆర్టీఏ ఆఫీసు ఎదురుగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
ప్రమాద సమాచారం తెలిసినా పట్టించుకోని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 40 నిమిషాల దాకా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారు తమ పరిధిలోకి రాదంటూ కార్ఖానా, తిరుమలగిరి పోలీసులు తాత్సారం చేశారని వాపోయారు.
'గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ఫోన్ చేస్తే పోలీసులు స్పందించలేదు. పబ్లిక్ కూడా సహాయం చేయలేదు. అటువైపు వచ్చిన మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ లోని వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని తరలించార'ని మృతుడి తరపు బంధువొకరు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తన సోదరుడు ఫోన్ చేసి కాపాడాలని అభ్యర్థించాడని మృతుడు అజార్ సోదరి తెలిపింది. ఫోన్ చేసి చచ్చిపోయాడని కన్నీటిపర్యంతమయింది.
సంబంధిత వార్త: