Karnataka Hindu Religious Institutions
-
‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’
శివాజీనగర: ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, తరువాత పెళ్లి చేసుకున్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. లైంగికదాడి కేసులో బాధితురాలిని నిందితుడు ఆ తరువాత పెళ్లాడాడు, వారికి బిడ్డ పుట్టింది. అంతమాత్రాన కేసు నుంచి నిందితునికి విముక్తి కల్పించలేమని కలబురిగిలోని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విజయపుర (బిజాపుర) జిల్లా బసవన బాగేవాడి తాలూకాకు చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన బాలికను అపహరించాడు. పోలీసులు అతడిని కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద అరెస్టు చేశారు. తరువాత బాలికను అతడు బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నాడు. కేసును కొట్టివేయాలని పిటిషన్ వేయగా, విచారణ కలబురిగి బెంచ్‌కు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్‌పీ సందేశ్ పైవిధంగా తీర్పు ఇచ్చారు. -
ఎస్... ఆ బిల్లు వెనక్కు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొప్పాళలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లును రూపొందించే విషయమై గత బీజేపీ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. అయితే చట్ట సభల్లో బిల్లుకు అనుమతి లభించిన తర్వాత రాజకీయ దురుద్దేశ్యంతో ఆ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకాలకు రూ.వెయ్యి కోట్లు గంగావతి : కొప్పళ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించినట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. కుష్టిగిలో పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు... కేటాయించిన నిధుల్లో రూ. 600 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కొప్పళ జిల్లా యలబుర్గా, కుష్టిగి, కొప్పళ తాలూకాలు పూర్తిగా నీటి పారుదలకు నోచుకోని డ్రై ఏరియా కావడం, గంగావతి తాలూకాలోని కనకగిరి అసెంబ్లీ క్షేత్రం పూర్తిగా నీటిపారుదల లేని భూములు ఉన్నాయని, నాలుగు తాలూకాలకు ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. వచ్చే ఏడాది కొప్పళ నగరంలో వైద్య కళాశాలను ప్రారంభించడం ఖాయమన్నారు. కుష్టిగి పట్టణంలో కనకదాసుల భవన నిర్మాణానికి కోటి రూపాయలు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్-కర్ణాటక అభివృద్ధికి తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి , గంగావతి ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారి, యలబుర్గా ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ పాటిల్, కొప్పళ జిల్లా ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, మాజీ ఎమ్మెల్యే కే.శరణప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఆ బిల్లు వెనక్కు
కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల బిల్లు ఉపసంహరణకు ప్రభుత్వం మొగ్గు బెంగళూరు: విపక్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ధార్మిక సంస్థల నుంచి పూర్తీ వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇటీవల శీతాకాల శాసనసభ సమావేశాల్లో అనుమతి పొందిన కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల (సవరణ) బిల్లు అమలు కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో ‘బిల్లు’ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో అందరు మంత్రులతో పాటు సీఎం సిద్ధరామయ్య కూడా ‘బిల్లు’ను అమల్లోకి తీసుకువస్తే ఎదుర్కొవాల్సిన పరిణామాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్రకు వివరించారు. సుప్రీం కోర్టు సూచనలమేరకే నూతన బిల్లును రూపొందించాల్సి వచ్చిందని టీ.బీ జయచంద్ర ఇచ్చిన వివరణతో ఎవరూ సంతృప్తి చెందలేదు. అంతేకాకుండా రాష్ట్రంలోని ధార్మిక సంస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రస్తుతం ఉన్న బిల్లు కాకుండా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి ఆ మేరకు ఏర్పాట్లు చూస్తానని టీ.బీ జయచంద్ర పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై టీ.బీ జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ... బిల్లు తేవడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అయితే సుప్రీం కోర్టు సూచనల మేరకే తాము నూతన బిల్లును తీసుకురావాల్సి వస్తోందన్నారు. ఈ విషయాలను పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని అన్ని ధార్మిక సంస్థల అధిపతులకు లేఖలు రాయనున్నారని తెలిపారు. -
మఠాల స్వయంప్రతిపత్తికి ప్రభుత్వం అడ్డురాదు
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర బెంగళూరు : ‘కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల (సవరణ) బిల్లు వెనక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర వెల్లడించారు. మఠాల స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం అడ్డురాబోదని, అంతేకాక మఠాల రోజువారీ చర్యల్లో కూడా జోక్యం చేసుకోబోమని అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును మాత్రమే ప్రవేశపెట్టామని, తరువాతి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరిపి అవసరమనుకుంటే సవరణలు చేస్తామని తెలిపారు. సూసలె మఠంతో పాటు రాష్ట్రంలోని మరో రెండు మఠాలకు సంబంధించి ఆస్తి వివాదాలు తలెత్తాయని, ఈ సందర్భంలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు సైతం వ్యక్తమయ్యాయని అన్నారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇలాంటి సందర్భాల్లో మఠం ఆస్తుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.