Karnataka HC Sensational Comments On Molestation Accused Marry Victim - Sakshi
Sakshi News home page

‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’

Published Wed, Nov 17 2021 8:51 AM | Last Updated on Wed, Nov 17 2021 12:42 PM

Karnataka HC Sensational Comments On Molestation Accused Marry Victim - Sakshi

శివాజీనగర: ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, తరువాత పెళ్లి చేసుకున్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. లైంగికదాడి కేసులో బాధితురాలిని నిందితుడు ఆ తరువాత పెళ్లాడాడు, వారికి బిడ్డ పుట్టింది. అంతమాత్రాన కేసు నుంచి నిందితునికి విముక్తి కల్పించలేమని కలబురిగిలోని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

విజయపుర (బిజాపుర) జిల్లా బసవన బాగేవాడి తాలూకాకు చెందిన అనిల్‌ అదే గ్రామానికి చెందిన బాలికను అపహరించాడు. పోలీసులు అతడిని కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద అరెస్టు చేశారు. తరువాత బాలికను అతడు బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నాడు. కేసును కొట్టివేయాలని పిటిషన్‌ వేయగా, విచారణ కలబురిగి బెంచ్‌కు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్‌ హెచ్‌పీ సందేశ్‌ పైవిధంగా తీర్పు ఇచ్చారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement