karuna sagar
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్‌కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్‌రెడ్డి అందజేసిన అఫిడవిట్‌ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. -
రాజాసింగ్ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో రాజాసింగ్ కేసు వాదించిన లాయర్ కరుణాసాగర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెయిల్ ఇప్పించినందుకు చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు లాయర్ కరుణాసాగర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘న్యాయవాద వృత్తిని నేను నెరవేర్చాను. పోలీసుల వైఫల్యంతోనే రిమాండ్ రిజెక్ట్ అయింది. నిన్నటి నుంచి గుర్తు తెలియని ఆగంతకులు నాకు కాల్స్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. దుబాయ్ నుంచి కొందరు కాల్స్‌చేసి బెదిరిస్తున్నారు. బెదిరింపులకు నేను భయపడను. దీనిపై పోలీసులు స్పందించాలి’ అని లాయర్ కరుణాసాగర్ కోరారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఎమ్మెల్యే రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. చదవండి: (హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర.. ఇది ముమ్మాటికీ నిజం: బండి సంజయ్) -
తెలంగాణ కళాకారుడి ఆత్మహత్య
చొప్పదండి మండలం రాగంపేట గ్రామ శివారులో కరుణాసాగర్(26) అనే తెలంగాణ కళాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కళాకారుల కోటాలో తనకు ఉద్యోగం లభించలేదని మనస్థాపం చెందిన కరుణా సాగర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో సాగర్ పలు ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రులు గుడ్డివారు. పెళ్లికాని ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘చవితి’ భద్రతపై సమీక్ష
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. హిందూ సంఘాల నేతృత్వంలో ప్రతి ఏటా వాడవాడల్లో రోడ్ల మీద బొజ్జగణపయ్య విగ్రహాలను కొలువు దీర్చి పూజలు చేస్తారు. ఈ ఏడాది వినాయక చవితి పర్వదినానికి తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. 29వ తేదీన పండుగ కావడంతో విగ్రహాల కొలువు మీద హిందూ సంఘాలు దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారుు. అదే సమయంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన భద్రతపై ఆయా జిల్లా యంత్రాంగాలు సమీక్షిస్తున్నారుు. డీజీపీ రామానుజం ఆదేశాలతో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, ఎన్ని విగ్రహాలకు అనుమతులు ఇవ్వాలి, చేపట్టాల్సిన భద్రతపై జిల్లా పోలీసు అధికారులు కసరత్తుల్లో ఉన్నారు. ఏడాది కాలంగా హిందూ సంఘాల నాయకులపై దాడులు పేట్రేగుతుండడంతో, ఎక్కడ వినాయక చవితి పర్వదినాన్ని అస్త్రంగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతాయోనన్న ఆందోళన మొదలైంది. ఈ దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భద్రతతో పాటుగా గణపయ్యల విగ్రహాల కొలువుకు ప్రత్యేక ఆంక్షల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. సమీక్ష : రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో ప్రతి ఏటా వెయ్యి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. గత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరిగింది. 1800 చోట్ల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ఈ ఏడాది అంతకన్నా, ఎక్కువ చోట్ల విగ్రహాల ఏర్పాటుకు హిందూ సంఘాలు కసరత్తు చేస్తున్నారుు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఎక్కడెక్కడ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి, భద్రతపై సమీక్షకు చెన్నై పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉదయం ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని వివరాల్ని ఆయా ప్రాంత ఇన్స్పెక్టర్ల నుంచి సేకరించారు. అనంతరం ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై అదనపు కమిషనర్లు కరుణా సాగర్, అమాష్కుమార్ల నేతృత్వంలో జరిగిన సమీక్షకు జాయింట్, డెప్యూటీ కమిషనర్లు హాజరయ్యారు. భద్రతా అంశాలపై సమీక్షించారు. కొత్త నిబంధనలపై సమీక్షించి, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి నిర్ణయించారు. గురువారం చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ నేతృత్వంలో జరిగే సమావేశం అనంతరం ఎక్కడెక్కడ విగ్రహాలకు అనుమతి, ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు, విగ్రహ నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు రూట్లు, భద్రతకు సంబంధించిన వివరాలు, ఆంక్షల చిట్టాను ప్రకటించనున్నారు.