Karwaan
-
బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్న కార్వాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి(74) శనివారం సాయంత్రం ఇక్కడి కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా చిన్నపేగు కేన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఈ నెల 10న కుటుంబసభ్యులు ఆయనను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 12న ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అప్పటికే కేన్సర్ కణాలు కాలేయంసహా ఇతర ముఖ్యమైన భాగాలకు విస్తరించడం, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడం, శ్వాస సరిగా తీసుకోలేకపోతుండటంతో రెండురోజుల క్రితం మళ్లీ ఐసీయూకు తరలించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న బాల్‌రెడ్డిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సలు అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకుని ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 1945 మార్చి 7న పాతబస్తీలోని అలియాబాద్‌లో జన్మించిన బద్దం బాల్రెడ్డికి భార్య యాదమ్మసహా కుమార్తె అరుణ, కుమారులు గోపాల్‌రెడ్డి, శివపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని అశ్రునయనాల మధ్య ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బద్దం పార్థివదేహం బాల్‌రెడ్డి పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఆదివారం 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారని పార్టీ నేతలు తెలిపారు. తర్వాత పార్టీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. బాల్‌రెడ్డి మృతి పట్ల సీఎం సంతాపం బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో బాల్‌రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని ఒక ప్రకటనలో కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధాంతపరమై రాజకీయాలకు అంకితమయ్యారు: దత్తాత్రేయ బాల్‌రెడ్డి మరణం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు తీరనిలోటని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ భావజాలాన్ని పునికి పుచ్చుకొని జీవితమంతా సిద్ధాంతపరమైన రాజకీయాలకు అంకితమై పనిచేశారన్నారు. క్రమశిక్షణ కలిగిన నేత: లక్ష్మణ్ బాల్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకునిగా అనేక ప్రధాన సమస్యలను సభలో లేవనెత్తారని పేర్కొన్నారు. బాల్‌రెడ్డి మరణం బీజేపీకి తీరని లోటని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు బద్ధం బాల్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గోపిశెట్టి నిరంజన్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన నాయకుడు బాల్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతున్ని ప్రార్థించారు. -
భాష ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటా
‘‘యాక్టర్‌గా వేరే వేరే భాషల్లో సినిమాలు చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ‘మహానటి’ సినిమాలో నన్ను తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు’’ అని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. దుల్కర్ సల్మాన్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ‘కార్వాన్’. ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు ఆకర్ష్ కురానా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘మలయాళంలో హీరోగా చేస్తున్నాను కాబట్టి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సినిమాలోనూ నేనే లీడ్ రోల్ చేయాలి అనుకోలేదు. కథతో పాటు క్యారెక్టర్ ఉండాలి అనుకుంటాను. ఇర్ఫాన్ సార్ ఓకే అన్నారంటే స్క్రిప్ట్ కచ్చితంగా బావుంటుందని అనుకున్నాను. ఏ భాషలో సినిమా చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను’’ అన్నారు. దర్శకుడు ఆకర్ష్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి కీలకంగా నిలిచే ఓ పాత్రకు దుల్కర్ సరిపోతాడని మా క్యాస్టింగ్ డైరెక్టర్ చెప్పారు. అప్పుడే దుల్కర్ సినిమాలు చూశాను. అవినాష్ అనే పాత్రకు అతనే సరిపోతాడని ఫిక్స్ అయ్యాను. కథ చెప్పినప్పుడు దుల్కర్ కూడా బాగా ఎగై్జట్ అయ్యారు. స్క్రిప్ట్ నచ్చి ఒప్పుకున్నారు. 34 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. అలా అయితే యాక్టర్స్ అందరూ క్యారెక్టర్స్‌కు స్టిక్ అయ్యి ఉంటారు. ఎనర్జీస్ సేమ్‌గా ఉంటాయి అని నా నమ్మకం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇర్ఫాన్ ఖాన్‌గారు బాగానే ఉన్నారు. ఫస్ట్ కాపీ కూడా చూశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనకు కేన్సర్ వ్యాధి ఉందని బయటపడింది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు. మిథిలా పాల్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ షూటింగ్ అంతా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. ఇర్ఫాన్, దుల్కర్ వంటి యాక్టర్స్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. కేవలం సినిమాలే అని నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోను. యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, సినిమాలు, థియేటర్... ఎక్కడ ఎగై్జటింగ్ కాన్సెప్ట్ ఉంటే అక్కడ చేస్తాను’’ అన్నారు. -
బర్త్‌డేకి బండొచ్చింది
ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే. 28 రాకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా నుంచి అడ్వాన్స్ బర్త్‌డే ప్రజెంట్ అందుకున్నారట దుల్కర్. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్ బేస్డ్ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్. ఇప్పుడు అదే వ్యాన్‌ను దుల్కర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్. ‘‘సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఈ వ్యాన్లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్‌తో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్ మీద దుల్కర్‌కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్ పేర్కొన్నారు. -
కార్వాన్ ట్రైలర్ విడుదల
-
వినోదాత్మక ప్రయాణం.. కార్వాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సౌత్ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కార్వాన్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ట్రావెల్ డ్రామాతో దుల్కర్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేసిన చిత్రయూనిట్ సినిమా థీమ్ ఏంటో రివీల్ చేశారు. తన తండ్రి మరణవార్త విన్న దుల్కర్ డెడ్ బాడీ కోసం వెళ్లటం.., అక్కడ అనుకోని పరిస్థితుల్లో బాడీ మారిపోయిందని తెలిసుకోని ఇర్ఫాన్ తో కలిసి రోడ్‌ట్రిప్‌కు వెళ్లాల్సి రావటం లాంటి అంశాలు సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ఇర్ఫాన్ ఖాన్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 3న విడుదలకానుంది.