పాఠశాలలో ప్రసవించిన టెన్త్ విద్యార్థిని
నిజామాబాద్ : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనేమీదితండాలో బాలికలు లైంగిక దాడికి గురైన ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. తెలిసో తెలియకో తప్పటడుగు వేసింది. ఫలితంగా పదవ తరగతి విద్యార్థిని గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని ఇంతకాలం ఎలా దాచిందో తెలియదుగానీ .. మంగళవారం స్కూల్లోనే ప్రసవించింది. నిజమాబాద్ పిట్లం కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే శిశువు పుట్టడంతోనే ముళ్లపొదల్లో పారేసింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.