kasturba schools
-
‘ఇంగ్లిష్’ బోధించలేం!
నల్లగొండ : కస్తూర్బా విద్యాలయాల్లో తాము ఇంగ్లిష్ మీడియం చెప్పలేమని టీచర్లు చేతులెత్తేశారు. దీంతో ఈ ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేనట్లే. ప్రభుత్వం కార్మికుల, ఇతర అనాథ పిల్లలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మధ్యలో బడి మానేసిన పిల్లల కోసం ప్రభుత్వం కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించింది. అవన్నీ తెలుగు మీడియంలోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కస్తూర్బా పాఠశాలల్లో తెలుగు మీడియం నడుస్తున్నప్పటికీ కార్పొరేట్ తరహాలో విద్యాబోధన జరగడంతో పాటు నాణ్యమైన భోజన వసతి కల్పిస్తున్నారు. మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు. పేద విద్యార్థులకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కస్తూర్బాలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలన్న ఉద్దేశంతో రెండేళ్లుగా ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఆయా జిల్లాల కస్తూర్బాల నుంచి ప్రతి పాదనలు కోరుతోంది. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా ఎవరైతే కస్తూర్బా పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలో బో«ధిస్తామని ముందుకు వస్తారో ఆయా పాఠశాలలు ప్రతిపాదనలు పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖకు లేఖలు రాశారు. దీంతో కొన్ని జిల్లాలు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తామని ప్రతిపాదనలు పంపాయి. కానీ నల్లగొండ జిల్లా నుంచి బోధించేందుకు టీచర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా విద్యాశాఖ ప్రతిపాదనలు పంపలేదు. దీంతో ఈ సంవత్సరం ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు జిల్లా నుంచి ఒక్క పాఠశాల కూడా ముందుకు రాకపోవడంతో విద్యార్థినులకు నష్టం జరిగే అవకాశం ఉంది. జిల్లాలో 27 కేజీబీవీలు జిల్లాలో మొత్తం 27 కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 5పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కొనసాగుతున్నాయి. పాత పాఠశాలలన్నీ తెలుగు మాద్యమంలోనే నిర్వహిస్తున్నారు. ముందుకు రాని ఉపాధ్యాయులు జిల్లాలో 22 కస్తూర్బా తెలుగు మీడియం పాఠశాలల్లోని అధ్యాపక బృందాలు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చేందుకు సుముఖంగా ఉన్నారు. అందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతామని చెప్పినా బోధకులే ముందుకు రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. దీంతో జిల్లా విద్యాశాఖ కూడా వారిని ఏమీ అనలేకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపలేదు. ఉపాధ్యాయులు విల్లింగ్‌లో లేకపోవడంతో ప్రతిపాదనలు పంపలేదు జిల్లాలో 27 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. 5 ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సంవత్సరం కూడా ప్రతిపాదనలు పంపాలని కోరింది. కానీ అధ్యాపకులు ఎవరూ ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు విల్లింగ్‌లో లేకపోవడం వల్ల ప్రతిపాదనలు పంపలేదు. కస్తూర్బాలో నూటికి నూరుశాతం ఎన్రోల్మెంట్ ఉంది. పిల్లలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన చేస్తే ఎన్రోల్మెంట్ పెరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశం. 5వేల మంది విద్యార్థినులు ఉండాల్సి ఉండగా 83 మంది అధికంగానే ఉన్నారు. కొత్త మండలాల్లో ఇంగ్లిష్ బోధన జరుగుతుంది. – అరుణ శ్రీ, సెక్టోరియల్ అధికారి -
ఈ తండ్రి నాకొద్దు!
జమ్మికుంట: కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కర్కశత్వంగా మారాడు. తాగుడుకు బానిసై.. విచక్షణ కోల్పోయి శరీరం కమిలిపోయేలా చిత్రహింసలకు గురిచేశాడు. తండ్రి అనే మమకారం లేకుండా పసి హృదయాన్ని గాయపరిచాడు. తండ్రి బాధలు భరించలేక 11 ఏళ్ల బాలుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. ‘ఈ తండ్రి నాకొద్దు.. జైల్లో పెట్టండి’అని ఫిర్యాదు చేశాడు. జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన మొలుగూరు శ్రీనివాస్ తాగుడుకు బానిసగా మారాడు. మేస్త్రీ పని చేస్తూ చేతికి వచ్చిన డబ్బులతో తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, కుమారుడిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం శ్రీనివాస్ భార్య రమ్య, పట్టణంలోని ఓ రెస్టారెంట్లో కూలి పని చేసేందుకు వెళ్లింది. కుమారుడు శశికుమార్ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికే నిషాలో ఉన్న తండ్రి.. కొడుకును చూసి కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న రూ.3 వేలు తీశావా అంటూ కర్రకు కారం రాసి విపరీతంగా చితక్కొట్టాడు. దీంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. తాను డబ్బులు తీయలేదని కొడుకు ఎంత చెప్పినా వినకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతున్న శశికుమార్‌ను పెద్దమ్మ వచ్చి విడిపించింది. రాత్రి ఇంటికొచ్చిన తల్లికి విషయం విలపించాడు. అనంతరం జమ్మికుంట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. మా నాన్నతో ఎప్పటికైనా అమ్మకు, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తాగి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటామని విలపిస్తూ చెప్పాడు. పోలీసులు బాలుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి చలించిపోయారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తన అక్క శ్వేత కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతోందని, తానూ అక్కడే ఉండి చదువుకుంటానని శశికుమార్ చెప్పాడు. కాగా, నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. -
సర్వ‘శిక్ష’ బదిలీలు
- సర్వశిక్ష అభియాన్‌లో బదిలీలు - పాఠశాలలు పునఃప్రారంభంలో తగదని ఫిర్యాదు - సీఆర్టీలకు పాయింట్ల కేటాయింపులో కొందరికి పెద్దపీట - ఎస్ఓల బదిలీల్లో అక్రమాలంటూ ఆరోపణలు కర్నూలు సిటీ: సర్వశిక్ష అభియాన్‌లో బదిలీలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. కస్తూర్బా స్కూళ్లలో ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లు పని చేస్తున్నారు. గతంలో వీరి బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నాడు బదిలీలు చేయక పోవడంతో ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసి పునఃప్రారంభానికి రెండు రోజుల గడువు ఉన్న సమయంలో బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎస్ఓలు, సీఆర్టీలు శనివారం ఉదయం 8.30 గంటలకే ఎస్ఎస్ఏ పీఓకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి చిన్న పిల్లలతో చేరుకున్నారు. అయితే పీఓ బదిలీలపై జేసీ–2 రామస్వామి దగ్గర చర్చలు జరుపుతున్నారని తెలుసుకోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్రమాలపై ఎస్ఓలు, సీఆర్టీలు జేసీ–2కి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేసేందుకు వెళ్లగా అనుమతి ఇవ్వక పోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. విద్యా సంత్సరం ప్రారంభంలో కాకుండా, వేసవి సెలవుల్లో బదిలీలకు కౌన్సెలింగ్ చేసి ఉంటే బాగుండదని, స్కూళ్లు ప్రారంభించేందుకు రెండు రోజుల ముందుగా బదిలీలు చేపట్టడంపై తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటీకే పిల్లలను స్కూళ్లలో చేర్పించి, ఫీజులు కూడా కొంత చెల్లించామని, ముందస్తు సమాచారం లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం తగదన్నారు. అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నామన్నారు. సీఆర్టీ పాయింట్లలో అక్రమాలు జిల్లాలో 53 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 47 మంది ప్రత్యేకాధికారులు, కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లుగా సుమారు 401 మంది పని చేస్తున్నారు. వీరిలో ప్రత్యేకాధికారులుగా మూడు సంవత్సరాలు, సీఆర్టీలుగా ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పని సరిగా బదిలీలు చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ఎస్ఓలు 30 మంది, సీఆర్టీలు సుమారు 300 మంది వరకు బదిలీలకు అర్హులు. గతంలో వీరు బదిలీల కోసం ఇచ్చిన ఆప్షన్లను పరిగణలోకి తీసుకోని, ఆయా స్కూళ్లలో సీఆర్టీల పని తీరుపై ఎస్ఓలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పాయింట్లు ఇచ్చారు. అయితే ఇక్కడే అక్రమాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. 6 స్కూళ్లకు సీఆర్టీలే ఇన్చార్జ్ ఎస్‌ఓలుగా ఉన్న స్కూళలోనే పాయింట్లలో అక్రమాలు జరిగినట్లు కొందరు సీఆర్టీలు ఆరోపణలు చేస్తున్నారు. మరి కొందరు పదో తరగతిలో 100 శాతం ఫలితాలు ఉండి, అడ్మిషన్లు సైతం భారీగా చేపట్టినా, బోధనలోను, ఇతర వాటన్నింటిలో మెరుగ్గా ఉన్నా కూడా మంచి పాయింట్లు రాలేదని, ఇందుకు కారణం ఎస్ఎస్ఏ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీఆర్టీల పాయింట్లు సైతం ఎస్పీడీ కార్యాలయం నుంచే వచ్చాయని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఆలస్యంగా కౌన్సెలింగ్: కస్తూర్బాలో ఎస్ఓలు, సీఆర్టీల బదిలీల కోసం కౌన్సిలింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో చాలా మంది చంటి బిడ్డలతో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే పాయింట్లపై ఉన్న గందరగోళంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో చాలా మంది పిల్లలతో వచ్చిన వారు, అనారోగ్యంతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. -
మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి
కర్నూలు సిటీ: విద్య పట్ల రాష్ట్రంలోని మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర స్థాయి అధికారి డాక్టర్ షేక్ నాసర్ సాహెబ్ అన్నారు. సోమవారం నగరంలో ఉర్దూ టీచర్లకు ఆరు రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమైయ్యాయి. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మైనార్టీల్లో అధిక శాతం నిరక్షరాస్యులు ఉన్నారని, వారిని అక్షరాస్యులుగా మార్చాల్సిన బాధ్యత ఉర్దూ టీచర్లపై ఉందన్నారు. రాష్ట్రంలోని కస్తూర్బా పాఠశాలల్లో 3600 సీట్లు ఉంటే 2600 ఖాళీగానే ఉన్నాయన్నారు. ఎస్ఎస్ఏ సీమెట్ అధ్యాపకుడు ప్రసాద్‌రావు, ఎస్ఎస్ఏ పీడీ రామచంద్రారెడ్డి, ఏఎంఓ మాలిబాషా, చిత్తూరు ఏఎంఓ మహ్మాద్‌ఖాన్, సీఎంఓ జయరామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ ఏఎంఓ రఫీ, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై ‘ప్రత్యేక’ శ్రద్ధ మా స్కూల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉపాధ్యాయులందరూ నమన్వయంతో పని చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలకు ఇది ఒక కారణం. నేను ఇక్కడ ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. వరుసగా ఆరేళ్లు పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. – వాడాల సుబ్బరాయుడు యాదవ్, కునుకుంట్ల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం